ఆదోని పట్టణంలోని DSF.PDSO ఆధ్వర్యంలో

0
187

ఆదోని నారాయణ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలి.రకరకాల పేర్లతో తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపుతున్న కార్పొరేట్ నారాయణ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి.అనంతరం నారాయణ పాఠశాల దగ్గర DSF, PDSO విద్యార్థి సంఘాల ఆధ్వర్యం లో ధర్నా నిర్వహించడం జరిగింది.ఈ ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి DSF రాష్ట్ర అధ్యక్షుడు ధనాపురం ఉదయ్ PDSO రాష్ట్ర నాయకుడు తిరుమలేష్ మాట్లాడుతూ.ఆదోనిలోని నారాయణ విద్యాసంస్థల్లో స్కూల్ ఫీజు, బుక్స్ ఫీజు, యూనిఫామ్ ఫీజు తదితర రకరకాల పేర్లతో తల్లిదండ్రుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తూ దోపిడీకి పాల్పడుతున్న కార్పొరేట్ విద్యాసంస్థలపై వెంటనే చర్యలు తీసుకోవాలని DSF, PDSO విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.విద్యను వ్యాపారంగా మార్చి, పేద మరియు మధ్యతరగతి కుటుంబాలపై అధిక ఫీజుల భారాన్ని మోపడం సరైంది కాదు. అడ్మిషన్ల సమయంలో చెప్పిన ఫీజులకు అదనంగా వివిధ రకాల పేర్లతో వసూళ్లు చేయడం, పుస్తకాలు, యూనిఫామ్స్ తప్పనిసరిగా తమ వద్దనే కొనుగోలు చేయాలని ఒత్తిడి చేయడం వంటి చర్యలను వెంటనే నిలిపివేయాలి.ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలపై విద్యాశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము.విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాల్సిన బాధ్యతను గుర్తించి, ఫీజుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము.నారాయణ విద్యాసంస్థల్లో జరుగుతున్న అధిక ఫీజుల వసూళ్లపై విచారణ జరపాలి.బుక్స్, యూనిఫామ్ పేరుతో అదనపు వసూళ్లను నిలిపివేయాలి.తల్లిదండ్రులపై ఆర్థిక భారం తగ్గించేలా ఫీజు నియంత్రణ చర్యలు తీసుకోవాలి.నిబంధనలు ఉల్లంఘించే కార్పొరేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: 136 పాఠశాలలకు పాఠ్య పుస్తకాలు పంపిణీ
పాఠశాలలు పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో, పుంగనూరు పరిధిలోని 136 పాఠశాలలకు ఎస్.ఆర్.కె. కిట్లతో...
By Kothuru Murali 2026-06-06 15:10:14 0 119
Andhra Pradesh
నంద్యాల జిల్లా, ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని చాగలమర్రి మండలం డి. వనిపెంట గ్రామంలో "మన భూమా - మన ధీమా" కార్యక్రమం ఐదో రోజు ప్రజలతో మమేకమయ్యాను
నంద్యాల జిల్లా, ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని చాగలమర్రి మండలం డి. వనిపెంట గ్రామంలో "మన భూమా - మన ధీమా"...
By Chennaiah Kati 2026-07-10 16:32:13 0 120
Telangana
మంచిర్యాల: రక్తదానం చేయండి.. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నీ 52 డివిజన్ లో మంచిర్యాల్ క్లబ్ ఆధ్వర్యంలో, రెడ్...
By Bonagiri RaviShankar 2026-07-11 14:38:14 0 256
Andhra Pradesh
ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
బుధవారం రోజు ఉదయం మండలంలోని బో రెడ్డి గారి పల్లెలో మంత్రిగారి స్వగృహం నందు జిల్లా నలుమూలల నుండి...
By Benguluri Madhubabu 2026-04-01 05:52:24 0 257
SURAKSHA
Odisha Cyber Police Warn Against Online Fraud
: To protect citizens from digital scams, Odisha Police cyber cell held an awareness session for...
By Kalaga Sailaja 2026-07-06 10:58:14 0 387
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com