పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్

0
353

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం RTCలో PPP (పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్) విధానాన్ని తీసుకురావడం, క్రమంగా ప్రైవేటుపరం చేసే ప్రయత్నాలు చేయడం తీవ్రంగా ఖండిస్తు ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఓబిరెడ్డి మరియు బీసీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ..RTC అనేది కేవలం ఒక రవాణా సంస్థ కాదు. ఇది గ్రామీణ ప్రాంతాలు, విద్యార్థులు, రైతులు, కార్మికులు, వృద్ధులు, మహిళలకు అందుబాటులో ఉండే ప్రజా సేవా వ్యవస్థ. లాభనష్టాలతో సంబంధం లేకుండా ప్రజలకు సేవ చేయడమే RTC ప్రధాన లక్ష్యం. అలాంటి సంస్థను ప్రైవేట్ చేతుల్లోకి నెట్టడం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధం. ప్రైవేట్ సంస్థల లక్ష్యం ప్రజాసేవ కాదు, లాభార్జన. RTCలో ప్రైవేట్ భాగస్వామ్యం పెరిగితే టికెట్ ధరలు పెరిగే ప్రమాదం ఉంది. గ్రామీణ, మారుమూల ప్రాంతాలకు బస్సు సౌకర్యాలు తగ్గే అవకాశం ఉంది. వేలాది మంది RTC ఉద్యోగులు, కార్మికుల ఉద్యోగ భద్రత ప్రశ్నార్థకంగా మారుతుంది.

వైయస్ఆర్ సీపీ ప్రభుత్వ హయాంలో RTCని ప్రభుత్వంలో విలీనం చేసి ఉద్యోగులకు భరోసా కల్పించింది. వారి జీతాలు, సంక్షేమం, ఉద్యోగ భద్రతకు ప్రాధాన్యత ఇచ్చింది. కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ప్రజా ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే విధానాన్ని అవలంబిస్తోంది. ఈ కార్యక్రమంలో ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొరపాడు హుస్సేన్ పీరా, నగేష్ గుజ్జల, వైయస్ఆర్ సీపీ నగర అధ్యక్షుడు చింత సోమశేఖర్ రెడ్డి అనుబంధవిభాగాల జిల్లా అధ్యక్షులు అమర్నాథరెడ్డి, సైఫుల్ల బేగ్, శ్రీనివాసులు నాయక్, ట్రేడ్ యూనియన్ నగర అధ్యక్షులు మార్కెట్ కాజా, ట్రేడ్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి లు సంపంగి రామాంజనేయులు, అనిల్ కుమార్, వైయస్ఆర్ సీపీ నాయకులు గుజ్జన శివయ్య , ఆదినారాయణ, కాకర్ల శ్రీనివాసులు, హరి, రామాంజినేయులు, తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
ఎండవేడులకు ప్రజలు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారు....
భారత్ అవాజ్ న్యూస్ :తెలంగాణ ఎండలు. దంచికొడుతున్నాయి.ఎండలు, వడగాల్పులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి...
By Gujile Ramu 2026-05-03 15:41:34 0 176
Telangana
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు సరస్వతి, మున్సిపల్ చైర్మన్ మేంగ్రే ఆకాష్ ధ్వజం
🎤ఆసిఫాబాద్, భారత్ ఆవాజ్ న్యూస్: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి వస్తే...
By Chunarkar Jagadeesh 2026-09-08 10:45:58 0 301
Andhra Pradesh
Madanapalle: మదనపల్లె పట్టణంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని మున్సిపల్ కమిషనర్‌కు మున్సిపల్ అధ్యక్షుడు ముజీబ్ వినతిపత్రం అందజేశారు.
Madanapalle: పట్టణంలో నెలకొన్న తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతూ మదనపల్లె...
By Pagadala Venkateswar 2026-07-21 09:48:26 0 111
Tamilnadu
CM Vijay Orders Crackdown on Heinous Crimes
In a high-level review meeting held today, Tamil Nadu Chief Minister C. Joseph Vijay issued a...
By Dunna Jessicaruth 2026-05-25 10:33:47 0 574
SURAKSHA
Inside the Mind of a Guardian: The Legacy of Shri Rajeev Kumar, IPS
From Tech Innovation to Iron-Willed Command: Tracing the Illustrious Three-Decade Journey of a...
By Kalaga Sailaja 2026-08-01 05:39:28 0 271
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com