తనిఖీలు చేస్తున్న ఆర్టీవో పై నుంచి వెళ్లిన బొగ్గు లారీ.....

0
233

అతివేగంతో వచ్చిన టిప్పర్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి నెల రోజుల క్రితమే భూపాలపల్లి జిల్లాకు బదిలీపై వచ్చిన అధికారి

ఆర్టీవో కార్యాలయం ముందే బీభత్సం సృష్టించిన బొగ్గు లారీ...

భారత్ అవాజ్ న్యూస్: 22 జూన్ రోజున భూపాలపల్లి జిల్లా రోడ్డు రవాణా శాఖ అధికారి (ఆర్టీవో) వెంకన్న రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందారు. భూపాలపల్లి ఆర్టీవో కార్యాలయం ముందు బొగ్గు లారీలను చెక్ చేస్తున్న క్రమంలో అతివేగంతో వచ్చిన ఒక టిప్పర్ లారీ ఆయనపై నుంచి దూసుకెళ్లడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాద తీవ్రతకు ఆర్టీవో వెంకన్న స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు...

బదిలీపై వచ్చిన నెల రోజులకే ప్రమాదం

ఆర్టీవో వెంకన్న కేవలం నెల రోజుల క్రితమే భూపాలపల్లి జిల్లాకు బదిలీపై బాధ్యతలు చేపట్టడానికి వచ్చారని తోటి అధికారులు తెలిపారు. విధి నిర్వహణలో భాగంగా కార్యాలయం ముందే తనిఖీలు చేపడుతుండగా ఈ ఘోర ప్రమాదం జరగడం తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రమాదానికి కారణమైన బొగ్గు లారీ బీభత్సంపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించి దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.. దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము 

Search
Categories
Read More
SURAKSHA
Driving Change: The Inspiring Odyssey of IAS Officer Kiran Gitte
From Humble Farming Roots to Shaping Public Governance and Smart Infrastructure Across India...
By Kalaga Sailaja 2026-07-22 09:19:24 0 121
Andhra Pradesh
చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య సమక్షంలో టిడిపిలోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి.
చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య సమక్షంలో టిడిపిలోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి.  ...
By Gadiyapudi Narendra 2026-01-10 16:40:05 0 295
Andhra Pradesh
బైక్‌కు కుక్క అడ్డు రావడంతో దంపతులకు తీవ్ర గాయాలు.
మదనపల్లె మండలంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్రంకొండకు చెందిన కాసింఖాన్ (42), రుక్సానా...
By Pagadala Venkateswar 2026-06-10 05:16:58 0 124
Andhra Pradesh
గాలిబ్ షాహిద్ దర్గా భూములు కాపాడండి
*ఖిల్లా హజరత్ గాలిబ్ షహీద్ దర్గా భూములు కాపాడండి*   *అల్తాఫ్ బాబాకు దర్గా ముజావర్ల వినతి...
By Rajini Kumari 2026-03-28 14:12:21 0 260
Andhra Pradesh
చిన్నగంజాం సముద్ర తీరంలో ఇద్దరి యువకుల గల్లంతు
చిన్నగంజం మండలంలో గురువారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. నలుగురు యువకులు పల్లెపాలెం సముద్ర తీరానికి...
By Gadiyapudi Narendra 2026-02-05 13:47:41 0 252
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com