రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు ముందస్తు అన్ని ఏర్పాట్లు పర్యవేక్షించి జిల్లా కలెక్టర్, ఎస్పీ గారు

0
113

రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు ముందస్తుగా అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ గారు

రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా రాక నేపధ్యంలో అత్యంత పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు: మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారు

ఈ నెల 27వ తేదీ న గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మార్కాపురం జిల్లాలోని గిద్దలూరు మండలం, క్రిష్టం శెట్టిపల్లి గ్రామంలో సంజీవిని పథకం లో భాగంగా డిజిటల్ నర్వ్ సెంటర్ ప్రారంభించునున్న నేపథ్యంలో ముందస్తుగా భద్రతా ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎం.విజయ సునీత, ఐఏఎస్, జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపియస్.,గార్లతో పాటు గిద్దలూరు ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు మరియు జిల్లా అధికారులు పరిశీలించారు.

హెలిప్యాడ్ ప్రదేశం, ప్రజా వేదిక, పార్కింగ్ ప్రాంతాలను, సీఎం కాన్వాయ్ రూట్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరియు చుట్టు ఉన్న ప్రాంతములను క్షుణ్ణంగా పరిశీలించారు. ఇంకా తీసుకోవాల్సిన ప్రత్యేక చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం జిల్లా ఎస్పీ గారు వీఐపీల వాహనాల రాక, సభా స్థలంలో వేదిక, పార్కింగ్‌ ఏరియా, సీఎం ప్రవేశం, నిష్క్రమణ స్థలాలను, హెలిప్యాడ్ నుంచి సభా ప్రాంగణం వరకు ఉన్న రూట్ ను, క్షుణ్ణంగా పరిశీలించి పోలీసు అధికారులకు పలు సూచనలు తెలియజేశారు. ఇతర శాఖల సమన్వయంతో అన్ని చర్యలు చేపట్టాలని పోలీస్ అధికారులను జిల్లా ఎస్పీ గారి ఆదేశించారు. 

ఈ కార్యక్రమంలో మార్కాపురం జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు, మార్కాపురం డి.ఎస్.పి యు. నాగరాజు, ఎస్బి ఇన్స్పెక్టర్ యం.శ్రీనివాసరావు, గిద్దలూరు అర్బన్ సీఐ కె. సురేష్, రూరల్ సీఐ రామకోటయ్య, కంభం సీఐ మల్లికార్జున మరియు రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Bihar
Bihar Wooing Investors With Amended Package
Addressing the centenary business conclave of the Bihar Chamber of Commerce and Industries in...
By Dunna Jessicaruth 2026-05-25 05:00:04 0 112
Andhra Pradesh
క్రెడిట్ చోరీయా.. జగన్‌కు ఏం క్రెడిట్ ఉంది: చంద్రబాబు.
AP: వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలను సీఎం చంద్రబాబు కౌంటర్ వేశారు. శనివారం నగరిలో ఆయన...
By Pagadala Venkateswar 2026-01-24 14:58:00 0 201
Tamilnadu
Driving Innovation: The Industry 5.0 Global Conference
KCG College of Technology in Chennai is hosting the third edition of the International Conference...
By Lokeshwari Panthadi 2026-06-27 10:33:28 0 113
Telangana
నిజామాబాద్
ఈరోజు మున్సిపల్ అధికారులు నిర్వహించినటువంటి జాబ్ మేళలో, సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నియామక పత్రము...
By Sadaq Sadaq 2026-05-07 13:47:16 0 188
Karnataka
New Alcohol-in-Beverage Tax Structure Rolls Out
Karnataka has implemented a pioneering Alcohol-in-Beverage (AIB) excise policy, shifting taxation...
By Dunna Jessicaruth 2026-05-18 06:56:50 0 121
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com