కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

0
299

కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శ్రీ హేమ దుర్గా భవన్ లో ఈరోజు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ జన్మదిన  వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కేక్ కట్ చేసి రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ, సామాజిక న్యాయం, యువత సాధికారత కోసం రాహుల్ గాంధీ గారు చేస్తున్న కృషిని నాయకులు కొనియాడారు.

కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ బండి రమేష్ గారి అధ్యక్షతన ఏ బ్లాక్ &బి అద్యక్షులు డాక్టర్ పి నాగిరెడ్డి, తూము వేణు ఆధ్యర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని, రాహుల్ గాంధీ గారి ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నాయకులు పిలుపునిచ్చారు.

అనంతరం మిఠాయిలు పంపిణీ చేసి జన్మదిన వేడుకలను ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు, నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, బ్లాక్ అధ్యక్షులు, మార్కెటింగ్ కమిటీ సభ్యులు, టెంపుల్ కమిటీ సభ్యులు, డివిజన్ అధ్యక్షులు, బ్లాక్ మహిళా అధ్యక్షురాలు, డివిజన్ మహిళా అధ్యక్షురాలు, యూత్ కాంగ్రెస్, NSUI నాయకులు, మైనారిటీ నాయకులు, SC సెల్ నాయకులు, BC సెల్ నాయకులు, సేవాదళ్ నాయకులు, సోషల్ మీడియా,కార్యకర్తలు మరియు కాంగ్రెస్ పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ సమావేశాన్ని విజయవంతం చేసారు.

రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పార్టీ నాయకులు ప్రజాసేవ పట్ల ఆయన నిబద్ధత స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

Search
Categories
Read More
BMA
DPDP Act in SC: The Battle for RTI Transparency
In February 2026, the Supreme Court of India began adjudicating massive constitutional...
By JoinBMA 2026-08-21 08:20:53 0 163
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గం:బాలికపై లైంగిక దాడి.
పులిచెర్ల మండలంలోని ఓ గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన వడ్డిపల్లెకు...
By Kothuru Murali 2026-07-23 14:58:45 0 218
Andhra Pradesh
రామసముద్రం హెడ్ కానిస్టేబుల్ కిరణ్ కుమార్ కు ఉత్తమ సేవలకు అవార్డు.
రామసముద్రం పోలీస్ స్టేషన్‌లో 2004 బ్యాచ్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ కిరణ్ కుమార్, విధి...
By Pagadala Venkateswar 2026-01-26 11:28:26 0 214
Andhra Pradesh
రేపు అద్దంకి పట్టణం నందు అద్దంకి  రెవెన్యూ డివిజన్ కార్యాలయం ప్రారంభం 
రేపు అద్దంకి పట్టణం నందు అద్దంకి  రెవెన్యూ డివిజన్ కార్యాలయం ప్రారంభం  బాపట్ల జిల్లా...
By Gadiyapudi Narendra 2025-12-30 17:28:07 0 287
Andhra Pradesh
రసాయనాలతో తిరుమల లడ్డు ప్రసాదం తయారు చేసి వైసిపి మహాపరాధం చేసింది
రసాయనాలతో తిరుమల లడ్డూ ప్రసాదం తయారు చేసి వైసీపీ మహాపరాధం చేసింది   • సిట్ నివేదికలో...
By Chennaiah Kati 2026-02-04 09:59:13 0 242
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com