"ఎంపీ ఈటల రాజేందర్‌ను కలిసిన సాయిబాబా నగర్ కాలనీ ప్రతినిధులు."|

0
155

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : తమ కాలనీలో ఎదుర్కొంటున్న తీవ్రమైన మౌలిక వసతుల సమస్యలపై సాయిబాబా నగర్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. 

191వ డివిజన్ మచ్చబొల్లారం పరిధిలోని సాయిబాబా నగర్ కాలనీలో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న డ్రైనేజీ వ్యవస్థ, దెబ్బతిన్న రోడ్లు, మరియు వీధి దీపాల సమస్యను ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. చుట్టుపక్కల ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నా, తమ కాలనీలో కనీస వసతులు లేక నివాసితులు పడుతున్న అవస్థలను ఈ సందర్భంగా వివరించారు.

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చింతల మాణిక్యరెడ్డి, సూర్య ఆధ్వర్యంలో కాలనీ అసోసియేషన్ సభ్యులు ఎంపీకి వినతిపత్రం సమర్పించారు. 

ఈ సమస్యలపై సానుకూలంగా స్పందించిన ఎంపీ ఈటల రాజేందర్, సంబంధిత అధికారులతో మాట్లాడి డ్రైనేజీ, రోడ్లు మరియు వీధి దీపాల పునరుద్ధరణకు తగిన చర్యలు తీసుకుంటామని కాలనీవాసులకు హామీ ఇచ్చారు. 

ఈ కార్యక్రమంలో సాయిబాబా నగర్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లారెడ్డి, ఉపాధ్యక్షులు బంగారు రెడ్డి, ప్రధాన కార్యదర్శి శాలివాహన, సభ్యులు సత్యనారాయణ, సమ్మి రెడ్డి, వరుణ్ కుమార్, డి. శ్రీధర్ రెడ్డి తదితర కాలనీవాసులు పాల్గొన్నారు.

#Sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
నిమ్మనపల్లి: అడవిలో మంటలు ఆర్పేందుకు వెళ్లి ఎఫ్. బి. ఓ అస్వస్థత.
గురువారం నిమ్మనపల్లి మండలం గొల్లపల్లె సమీపంలోని పెద్దకొండపై గుర్తుతెలియని వ్యక్తులు పెట్టిన...
By Pagadala Venkateswar 2026-03-06 02:55:13 0 171
Andhra Pradesh
అన్నమయ్య జిల్లా: 2 డిపో గౌరవ అధ్యక్షుడిగా దేవేంద్రబాబు ఎన్నిక.
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో 2 డిపో గౌరవ అధ్యక్షులుగా జోలపాలెం దేవేంద్రబాబు (చిన్ని) ఎన్నికయ్యారు....
By Pagadala Venkateswar 2026-02-08 10:55:03 0 219
Andhra Pradesh
వేసవిలో నీటి ఎద్దడి నివారణకు పటిష్ఠ చర్యలు అవసరం
వేసవిలో నీటి ఎద్దడి నివారణకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని డీడీఓ కిరణ్ కుమార్ అన్నారు. బొబ్బిలి...
By Boiena Rajesh 2026-04-07 04:49:10 0 235
Telangana
మహబూబ్‌నగర్‌ డీటీసీ కిషన్‌ అరెస్ట్
ఆదాయానికి మించిన ఆస్తుల కేసు   ₹ 200 కోట్ల విలువైన అక్రమాస్తులు గుర్తించిన ఏసీబీ!  ...
By Ellandula Sandeep 2025-12-24 11:18:31 0 750
Andhra Pradesh
Madanapalle:మదనపల్లె వివేకానంద పాఠశాలలో తాగునీటి సమస్యను పరిష్కరిస్తూ టీడీపీ ఇంచార్జ్ మధుసూదన్ రెడ్డి ప్రతిరోజూ నీటి ట్యాంకర్ పంపేలా ఏర్పాట్లు చేశారు.
Madanapalle: మదనపల్లె పట్టణంలోని రామిరెడ్డి లేఔట్‌లో ఉన్న వివేకానంద పాఠశాలలో తాగునీటి కొరత...
By Pagadala Venkateswar 2026-07-30 14:07:37 0 86
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com