"ఆగస్టు 2న ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలు.. తలసానికి ఆహ్వాన పత్రం అందజేత. "|

0
218

సికింద్రాబాద్ : సికింద్రాబాద్‌లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆషాఢ మాస బోనాల ఉత్సవాలను ఈ ఏడాది ఆగస్టు 2న నిర్వహించనున్నట్లు దేవాదాయ శాఖ అధికారులు వెల్లడించారు. 

మంగళవారం ఆలయ ఈవో మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ పండితులు, మాజీ మంత్రి మరియు సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను వెస్ట్ మారేడ్‌పల్లిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి ఉత్సవాల వివరాలను తెలియజేశారు.

ఈ సందర్భంగా ఆషాఢ మాస బోనాల ఉత్సవాలకు సంబంధించిన షెడ్యూల్‌ను వివరించిన లేఖను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు అందజేశారు. 

జులై 19న ఘటాల ఊరేగింపుతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని, ఆగస్టు 2న అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పిస్తారని తెలిపారు. 

ఆగస్టు 3న సంప్రదాయబద్ధంగా రంగం (భవిష్యవాణి) కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో మనోహర్ రెడ్డి వెల్లడించారు.

ఈ సమావేశంలో రాంగోపాల్‌పేట డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, రామ్ మోహన్ యాదవ్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.

#Sidhumaroju

Search
Categories
Read More
Telangana
గోదావరిఖని : కళ్యాణ లక్ష్మి చెక్కులు విడుదల
గోదావరిఖని : కళ్యాణ లక్ష్మి చెక్కులు చాలా రోజుల తర్వాత విడుదలయ్యాయి. ఈ చెక్కులు రామగుండం మేయర్...
By Sunka Santhosh 2026-06-03 18:44:42 0 143
Andhra Pradesh
రూ.54.13 లక్షలతో చిన్న గుడిపాడు గ్రామం అభివృద్ధి శుభరంభం....
రూ.54.13 లక్షలతో చిన్నగుడిపాడు గ్రామ అభివృద్ధికి శుభారంభం...   దోర్నాల మండలం,...
By Chennaiah Kati 2026-01-31 14:24:34 0 250
Telangana
గంగయ్య బస్తీలో త్వరలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం - ఎమ్మెల్యే శ్రీ గణేష్ హామీ.|
  మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కంటోన్మెంట్ నియోజకవర్గంలోని 7వ వార్డు పరిధిలో ఉన్న గంగయ్య...
By Sidhu Maroju 2026-03-09 09:31:38 0 209
SURAKSHA
UP Cops Today: Cyber Awareness Warriors For Citizens
On Wednesday, UP police officers conducted cyber crime awareness campaigns across districts. In...
By Kalaga Sailaja 2026-07-04 09:48:26 0 110
Andhra Pradesh
పోలవరం వద్ద గోదావరికి పోటెత్తుతున్న వరద.. 48 గేట్లు ఎత్తివేత.
  రెండు, మూడు రోజులుగా ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలు పోలవరం ప్రాజెక్ట్ కాఫర్...
By Pagadala Venkateswar 2026-08-26 06:33:56 0 86
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com