ఓటు హక్కు పరిరక్షణ కోసం ప్రతి కార్యకర్త బాధ్యతతో పనిచేయాలి: ఎంపీ గడ్డం వంశీకృష్ణ

0
215

మంచిర్యాల జిల్లా : పట్టణంలోని పద్మావతి గార్డెన్‌లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు, బూత్ లెవెల్ ఏజెంట్లు (BLAలు) మరియు పార్టీ నాయకుల కోసం నిర్వహించిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) అవగాహన శిక్షణ సమావేశంలో పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ పాల్గొని దిశానిర్దేశం చేశారు,ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓటు హక్కు భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి కల్పించిన అత్యంత విలువైన ప్రజాస్వామ్య హక్కు అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ఓటర్ల జాబితా పరిశుద్ధత ఎంతో కీలకమని, అర్హులైన ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా BLAలు అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు,ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా ప్రతి ఇంటిని సందర్శించి ఓటర్ల వివరాలను ధృవీకరించాలని, కొత్తగా 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న యువత పేర్లను నమోదు చేయించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే వలసలు, మరణాలు, చిరునామా మార్పులు వంటి అంశాలపై పూర్తి సమాచారంతో ఎన్నికల అధికారులకు సహకరించాలని సూచించారు,ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజల హక్కుల పరిరక్షణకు ముందుండాలని, ఎక్కడైనా అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించే ప్రయత్నాలు జరిగితే వెంటనే గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు,బూత్ స్థాయి కార్యకర్తలే పార్టీకి, ప్రజాస్వామ్య వ్యవస్థకు వెన్నెముకలని కొనియాడిన ఆయన, ప్రతి BLA ఫారం-6, ఫారం-7, ఫారం-8 ప్రక్రియలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ప్రజలకు కూడా వాటి గురించి వివరించాలని సూచించారు,కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉందని, ప్రజాస్వామ్య విలువలను కాపాడటం ప్రతి కార్యకర్త బాధ్యత అని పేర్కొన్నారు. పార్టీ బలోపేతం, ప్రజాస్వామ్య పరిరక్షణ అనే ద్వంద్వ లక్ష్యాలతో ప్రతి కార్యకర్త క్షేత్రస్థాయిలో చురుకుగా పనిచేయాలని పిలుపునిచ్చారు,ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, మండల అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్, NSUI, సేవాదళ్, మహిళా కాంగ్రెస్ నాయకులు, బూత్ లెవెల్ ఏజెంట్లు, పార్టీ ముఖ్య కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
జర్నలిస్టు ల సమస్యల పరిష్కారానికి కృషి
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఐజేయు...
By Nookapangu Manikanta 2026-05-15 14:21:39 0 332
Andhra Pradesh
కూటమి విజయాలను ప్రతిగడపకు చేర్చాల్సిన బాధ్యత టీడీపీ కేడర్ దే: నారా లోకేశ్.
  కూటమి విజయాలను ప్రతిగడపకు చేర్చాల్సిన బాధ్యత టీడీపీ కేడర్ దే: నారా లోకేశ్ 17-06-2026 Wed...
By Pagadala Venkateswar 2026-06-17 04:17:09 0 103
Chandigarh
Chandigarh Sets Bold Climate Goal: 1.26 Crore Tonnes CO₂ Cut by 2030
Chandigarh is charting an ambitious path toward environmental sustainability with its State...
By Bharat Aawaz 2025-07-17 06:16:35 0 1K
SURAKSHA
Dr. Arshinder Singh Chawla: Guardian Against Corruption
A distinguished 1994-batch Haryana Cadre IPS officer leading the Haryana State Vigilance &...
By Lokeshwari Panthadi 2026-07-24 08:56:24 0 259
Andhra Pradesh
పశ్చిమగోదావరి జిల్లా డివైడర్ను ఢీ కొట్టి నా బైక్ ప్రమాదంలో ముగ్గురు మృతి
పశ్చిమ గోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. పెనుమంట్ర మండలం పోలమూరు వద్ద ఓవర్ స్పీడ్ తో...
By Rajini Kumari 2025-12-23 10:04:04 0 514
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com