శ్రీరాంపూర్ ఏరియా ఉపరితల గనిని సందర్శించిన : డిప్యూటీ సీఎం

0
171

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు మంచిర్యాల జిల్లాలో రెండో రోజు తన పర్యటనను కొనసాగిస్తూ సింగరేణి సంస్థలో అతిపెద్ద ఏరియాగా పేరొందిన శ్రీరాంపూర్ ఏరియాను సందర్శించారు.ఈ సందర్భంగా శ్రీరాంపూర్ ఉపరితల గనిలో బొగ్గు ఉత్పత్తి, రవాణా, మార్కెటింగ్ అంశాలపై సంబంధిత డైరెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోటీ మార్కెట్ పరిస్థితుల్లో సంస్థ మరింత బలోపేతం కావాలంటే నాణ్యమైన బొగ్గు ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అదే సమయంలో భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటిస్తూ ఉత్పత్తి కార్యకలాపాలను కొనసాగించాలని స్పష్టం చేశారు,ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకోవడం ద్వారా సింగరేణికి మరో వందేళ్లపాటు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. సంస్థ లాభదాయకత, పోటీతత్వ సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు సమష్టిగా కృషి చేయాలని అధికారులకు సూచించారు,ఈ సమావేశంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మంచిర్యాల ఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, ఎమ్మెల్సీ శ్రీ దండే విఠల్, సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాష్‌ జ్యోతి, ఐఏఎస్‌, డైరెక్టర్లు శ్రీ ఎల్.వి. సూర్యనారాయణ (ఆపరేషన్స్), శ్రీ కె. వెంకటేశ్వర్లు (ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్), శ్రీ గౌతమ్ పోట్రు, ఐఏఎస్‌ (పర్సనల్ & ఫైనాన్స్), ఈడీ (కోల్ మూవ్‌మెంట్) శ్రీ బి. వెంకన్న, ఐఆర్‌టీఎస్‌, జీఎం (కో-ఆర్డినేషన్ & మార్కెటింగ్) శ్రీ టి. శ్రీనివాస్‌, శ్రీరాంపూర్ ఏరియా జీఎం శ్రీ ఎం. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఈడిగపల్లి దగ్గర రోడ్డు ప్రమాదం
పుంగనూరు మండలం, ఈడిగపల్లి గ్రామ సమీపంలో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. చిత్తూరు నుంచి...
By Kothuru Murali 2025-12-30 13:02:45 0 442
Andhra Pradesh
ఏపీ హైకోర్టు సీజేకు జడ్ ప్లస్ భద్రత.. గ్రీన్ ఛానల్ ఏర్పాటుకు ఆదేశాలు.
ఏపీ హైకోర్టు సీజేకు జడ్ ప్లస్ భద్రత.. గ్రీన్ ఛానల్ ఏర్పాటుకు ఆదేశాలు 13-05-2026 Wed 08:36 |...
By Pagadala Venkateswar 2026-05-13 06:08:46 0 154
SURAKSHA
Ravi Prakash Meharda: Upholding Justice with Excellence
The Journey Begins "The true strength of policing lies in protecting citizens...
By Fathima Safa 2026-07-21 07:54:44 0 113
Telangana
నర్సు శిరీష హత్యాచారానికి నిరసనగా ఆసిఫాబాద్‌లో దద్దరిల్లిన కొవ్వొత్తుల ర్యాలీ
🎤భారత్ ఆవాజ్ న్యూస్, ఆసిఫాబాద్: హైదరాబాద్ శంషాబాద్ పరిధిలో ఆదివాసీ నర్సు శిరీషపై జరిగిన ఘోర...
By Chunarkar Jagadeesh 2026-09-03 01:06:32 0 403
Andhra Pradesh
పుంగనూరు అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలి: రైతులు
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలంలో నకిలీ మందులు, కల్తీ ఎరువులు విక్రయిస్తున్న వారిపై చర్యలు...
By Kothuru Murali 2026-05-15 15:16:23 0 129
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com