పెట్టుబడులే లక్ష్యం.. రేపు సింగపూర్‌కు సీఎం చంద్రబాబు.

0
102

 

 

పెట్టుబడులే లక్ష్యం.. రేపు సింగపూర్‌కు సీఎం చంద్రబాబు

13-06-2026 Sat

Andhra

Chandrababu Naidu to visit Singapore tomorrow aiming for investments

సింగపూర్ పర్యటనలో కీలక భేటీలు

సింగపూర్ ప్రధాని, మంత్రులు, పారిశ్రామికవేత్తలతో సమావేశం

అమరావతి నిర్మాణంపై సుర్బానా జురాంగ్ సంస్థతో చర్చలు

2026 సీఐఐ భాగస్వామ్య సదస్సు రోడ్‌షోలో పాల్గొననున్న ముఖ్యమంత్రి

ఏపీకి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు సింగపూర్‌లో పర్యటించనున్నారు. జూన్ 14 నుంచి సాగే ఈ పర్యటనలో రాష్ట్రానికి, ముఖ్యంగా రాజధాని అమరావతి నిర్మాణానికి నిధులు సమీకరించడంపై ఆయన ప్రధానంగా దృష్టి సారించనున్నారు. ఇందుకోసం రేపు ఉదయం బెంగళూరు నుంచి ఆయన సింగపూర్‌కు బయలుదేరి వెళ్లనున్నారు. ముఖ్యమంత్రి వెంట పురపాలక శాఖ మంత్రి నారాయణ, పలువురు ఉన్నతాధికారులు కూడా ఈ పర్యటన‌కు వెళ్ల‌నున్నారు.

 

పర్యటనలో భాగంగా చంద్రబాబు సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్‌తో పాటు ఆ దేశ ఉప ప్రధాని, వాణిజ్య మంత్రి గాన్ కిమ్ యాంగ్, విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్, హోం మంత్రి షణ్ముగమ్ వంటి కీలక నేతలతో సమావేశమవుతారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను, ప్రభుత్వ విధానాలను వారికి వివరించనున్నారు. తొలుత సింగపూర్‌లోని భారత హై కమిషనర్ శిల్పక్ అంబులేతో భేటీ అయి పర్యటన అజెండాపై చర్చిస్తారు.

 

పారిశ్రామిక, వాణిజ్య రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు గూగుల్ క్లౌడ్, జీఐసీ, వైసీహెచ్ లాజిస్టిక్స్ వంటి దిగ్గజ సంస్థల ప్రతినిధులతో చంద్రబాబు భేటీ కానున్నారు. స్టార్టప్ వెంచర్ క్యాపిటలిస్టులతో జరిగే రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ సింగపూర్ అధ్యక్షుడితోనూ సమావేశమై విద్యా రంగంలో భాగస్వామ్యంపై చర్చిస్తారు. ఈ పర్యటనలో అత్యంత కీలకమైన అంశం రాజధాని అమరావతి. రాజధాని మాస్టర్ ప్లాన్ రూపొందించిన సుర్బానా జురాంగ్ సంస్థ ప్రతినిధులతో అమరావతి ప్రణాళికపై ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.

 

పర్యటనలో భాగంగా 'వరల్డ్ సిటీస్ సమ్మిట్'లో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం 2026లో విశాఖలో జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సుకు సన్నాహకంగా ఏర్పాటు చేసిన బిజినెస్ రోడ్‌షోలో చంద్రబాబు పాల్గొంటారు. పర్యటన ముగించుకుని 16న రాత్రి 10 గంటలకు ఆయన తిరిగి స్వదేశానికి రానున్నారు. ముఖ్యమంత్రి వెంట పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి సురేశ్ కుమార్, సీఆర్డీఏ అధికారుల బృందం కూడా ఈ పర్యటనలో పాల్గొంటుంది.

Search
Categories
Read More
Andhra Pradesh
బివి జయనాగేశ్వర్ రెడ్డి కు కృతజ్ఞతలు చెప్పిన ఎమ్మిగనూరు టిడిపి నాయకులు
ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా నియమితులైన శ్రీ...
By Boya Dasthagiri 2026-04-08 07:25:46 0 231
Andhra Pradesh
‘జిల్లాలో శతశాతం అక్షరాస్యతే లక్ష్యం'
జిల్లాలో శతశాతం అక్షరాస్యత సాధించేందుకు సమష్టిగా కృషి చేయాలని DRDA పీడీ శ్రీనివాస పాణి...
By Boiena Rajesh 2026-08-19 13:08:32 0 93
Andhra Pradesh
Ambati Rambabu: అంబటి రాంబాబుకు జగన్ ఫోన్‌... పార్టీ మొత్తం అండగా ఉంటుందని భరోసా.
అంబటిని ఫోన్‌లో పరామర్శించిన జగన్ రాష్ట్రంలో జంగిల్ రాజ్ నడుస్తోందని తీవ్ర విమర్శ  ...
By Pagadala Venkateswar 2026-02-01 08:45:55 0 194
Andhra Pradesh
అంబటి రాంబాబు బెయిల్‌ పిటీషన్‌పై నేడు వాదనలు.
గుంటూరు లీగల్‌: మాజీ మంత్రి, వైఎస్సార్‌కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షుడు,...
By John Baji 2026-02-05 05:39:13 0 589
Rajasthan
Tragic Bus-Truck Collision on Delhi-Mumbai Expressway
A devastating accident occurred early this morning on the Delhi-Mumbai Expressway in...
By Lokeshwari Panthadi 2026-07-01 08:09:55 0 113
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com