ట్రిపుల్ ఐటీ ప్రవేశాల ఫలితాలు విడుదల చేసిన మంత్రి నారా లోకేశ్.. ఇలా చెక్ చేసుకోండి!

0
117

 

 

ట్రిపుల్ ఐటీ ప్రవేశాల ఫలితాలు విడుదల చేసిన మంత్రి నారా లోకేశ్.. ఇలా చెక్ చేసుకోండి!

13-06-2026 Sat 15:37

Andhra

Minister Nara Lokesh releases IIIT admission results check details here

ఆర్జీయూకేటీ ఆరేళ్ల బీటెక్ కోర్సు ప్రవేశాల ఫలితాలు విడుదల

2026–27 విద్యా సంవత్సరానికి 4,040 మంది విద్యార్థుల ఎంపిక

ఎంపికైన వారిలో 96.7% మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులే

గ్రామీణ ప్రతిభను ప్రోత్సహించడమే లక్ష్యమన్న విద్యాశాఖ మంత్రి లోకేశ్

ఎంపికైన విద్యార్థులు rgukt.in వెబ్‌సైట్ నుంచి లేఖలు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు

ఆంధ్రప్రదేశ్‌లోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (RGUKT) పరిధిలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లలో ప్రవేశాలకు సంబంధించిన ఫలితాలు విడుదలయ్యాయి. 2026–27 విద్యా సంవత్సరానికి గానూ ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సులో ప్రవేశాల కోసం ప్రొవిజనల్ సెలెక్షన్ జాబితాను ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. ఈ ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరచడం విశేషం.

 

ఈ ఏడాది మొత్తం 44,104 దరఖాస్తులు రాగా, వారిలో 4,040 మంది విద్యార్థులను తాత్కాలికంగా ఎంపిక చేసినట్లు మంత్రి లోకేశ్ తెలిపారు. నూజివీడు, ఆర్కే వ్యాలీ (ఇడుపులపాయ), ఒంగోలు, శ్రీకాకుళం క్యాంపస్‌లలో ఈ ప్రవేశాలు కల్పించనున్నారు. ఎంపికైన వారిలో 96.7 శాతం మంది ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులే ఉండటం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. నాణ్యమైన ఉన్నత విద్యను అందిస్తూ గ్రామీణ ప్రతిభను ప్రోత్సహించాలన్న ఆర్జీయూకేటీ లక్ష్యం మరోసారి నెరవేరిందని లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు.

 

ఎంపికైన విద్యార్థులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అభ్యర్థులు తమ ఎంపిక పత్రాలను (Selection Letters) అధికారిక వెబ్‌సైట్ rgukt.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. ఏవైనా సందేహాలుంటే, సహాయం కోసం 9552300009 అనే వాట్సాప్ హెల్ప్‌డెస్క్ నంబర్‌ను సంప్రదించవచ్చని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.

Search
Categories
Read More
Telangana
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని బిఅర్ఎస్ కార్యాలయంలో జాతియ జెండా ఎగరేసి మహనీయుల త్యాగాలను స్మరించుకున్న ఎమ్మెల్యే
🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్)  కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్...
By Chunarkar Jagadeesh 2026-08-15 11:29:15 0 196
SURAKSHA
AP పోలీసులు నేడు: రక్తదాన వీరులుగా జీవాలు కాపాడారు
నేడు AP పోలీసులు “రక్తదానం జీవనదానం” శిబిరాలు 15 జిల్లాల్లో నిర్వహించారు. 24 గంటల్లో...
By Kalaga Sailaja 2026-07-04 09:21:03 0 69
Andhra Pradesh
సాహిత్య అకాడమీ అవార్డుల ప్రకటనను రద్దు చేసింది
*సాహిత్య అకాడమీ అవార్డుల ప్రకటనను రద్దు చేసింది* -శ్రీపర్ణ చక్రవర్తి   న్యూఢిల్లీ: కేంద్ర...
By Rajini Kumari 2025-12-19 11:18:10 0 255
Andhra Pradesh
వంగవీటి మోహనరంగా కి ఘన నివాళులు
వంగవీటి మోహనరంగా కి ఘన నివాళులు బాపట్ల: ది 26-12-2025 వ తేదీ అనగా రేపు శుక్రవారం శ్రీ వంగవీటి...
By Gadiyapudi Narendra 2025-12-26 14:50:45 0 282
Telangana
గద్దర్ చిత్రపటం లేకుండా అవార్డు లు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్న దళిత సంఘాలు.
గద్దర్ తెలంగాణ ఫిల్మ్అవార్డుల ప్రాథనోత్సవానికి హైదరాబాద్ లోని హైటెక్స్ వేదిక సర్వాంగ సుందరంగా...
By Sidhu Maroju 2025-06-14 08:09:03 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com