"వైద్య నిర్లక్ష్యమా?.. ప్రభావతి మృతి కలకలం.|

0
512

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : ఆల్వాల్‌లోని ఎక్సెల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ప్రభావతి (50) మృతి చెందడంతో కుటుంబ సభ్యులు వైద్యుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆరోపణలు చేశారు. 

అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను కొద్ది రోజుల క్రితం ఆస్పత్రిలో చేర్పించగా, చికిత్స కొనసాగుతున్న సమయంలో ఆరోగ్య పరిస్థితి మరింత విషమించినట్లు బంధువులు తెలిపారు.

పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో ప్రభావతిని మెరుగైన వైద్యం కోసం మరో ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే అంబులెన్స్‌లో తరలిస్తుండగానే ఆమె మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. 

సరైన సమయంలో తగిన చికిత్స అందించకపోవడం వల్లే ఆమె ప్రాణాలు కోల్పోయిందని వారు ఆరోపించారు.

ప్రభావతి మృతితో ఆవేదనకు గురైన కుటుంబ సభ్యులు, బంధువులు ఎక్సెల్ హాస్పిటల్ ఎదుట ఆందోళన చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

చికిత్సకు సంబంధించిన పూర్తి వివరాలు, వైద్య రికార్డులను అందించాలని ఆస్పత్రి యాజమాన్యాన్ని కోరారు. 

మరోవైపు ఆస్పత్రి వర్గాలు మాత్రం రోగి ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని అవసరమైన వైద్య సేవలు అందించామని పేర్కొన్నట్లు తెలిసింది.

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. 

కుటుంబ సభ్యుల వాదనలు, ఆస్పత్రి యాజమాన్యం వివరణలను నమోదు చేసుకుని ఘటనకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. ప్రభావతి మృతికి గల కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది.

#Sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు పట్టణంలో ముగిసిన అగ్నిమాపక వారోత్సవాలు
పుంగనూరు పట్టణంలో సోమవారంతో ఏడు రోజులపాటు జరిగిన అగ్నిమాపక వారోత్సవాలు ముగిశాయి. ఇన్ఛార్జ్...
By Kothuru Murali 2026-04-21 14:41:43 0 136
Andhra Pradesh
మదనపల్లె: ప్రైవేట్ ఆసుపత్రిలో ఆపరేషన్ వికటించి రైతు మృతి.
మదనపల్లెలోని ఒక ఆసుపత్రిలో గురువారం ఆపరేషన్ వికటించి రైతు శ్రీనివాసులు నాయుడు (51) మృతి చెందిన...
By Pagadala Venkateswar 2026-05-28 06:47:56 0 102
Telangana
రూ.55 లక్షలతో 8 సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని 278వ డివిజన్ గాజులరామారం పరిధిలోని...
By Sidhu Maroju 2026-06-25 12:06:50 0 187
Andhra Pradesh
శ్రీ పవన్ కళ్యాణ్ గారి దార్శనికతను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యం నరేంద్ర దండి
ఆత్మీయ మిత్రుడు ఎర్రంశెట్టి మస్తాన్ రాయల్ ప్రత్యేక ఆహ్వానం మేరకు విజయవాడ అమరావతి కన్వెన్షన్ లో...
By Benguluri Madhubabu 2026-06-28 12:26:58 0 150
Telangana
కేసీఆర్‌ భయం.. రెండో విడత పెట్టుబడి సాయం..!
బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ జగిత్యాలలో భారీ బహిరంగసభ నిర్వహిస్తుండటంతో...
By Ponnala Srinivasrao 2026-04-20 01:25:49 0 166
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com