ఇప్పటికైనా కళ్లు తెరవండి, మీ పాలనను అన్ని వర్గాల ప్రజలు ఛీ కొడుతున్నారన్న విషయాన్ని గుర్తించండి.హరీష్ రావు తన్నిరు

0
169

మహిళలను కోటీశ్వరులుగా చేస్తామని మభ్యపెడుతున్న 

‎ రేవంత్ రెడ్డి .. ముందు అంగన్ వాడీలకు జీతాలు చెల్లించి, మహిళల పట్ల నీకున్న గౌరవాన్ని నిలబెట్టుకో. 

‎రెండు నెలలుగా జీతాలు అందక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న 62వేల అంగన్ వాడీ సోదరీమణుల కష్టాలు మీకు కనిపించడం లేదా?

‎నెలల తరబడి జీతాలు ఇవ్వకుండా అంగన్ వాడీలను వేదిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తప్పకుండా వారి ఉసురు తగులుంది.    

‎మహిళా మంత్రిగా ఉన్న సీతక్క గారు సాటి మహిళల కన్నీటి గోస అర్థం చేసుకోకపోవడం శోచనీయం. 

‎అంగన్ వాడీల సేవలను గుర్తించిన కేసీఆర్ గారు వారు వర్కర్లు కాదని, అంగన్ వాడీ టీచర్లు అని పోస్టును ఉన్నతీకరించారు. వారి గౌరవాన్ని పెంచారు.

‎2014 నాటికి అంగన్ వాడీ టీచర్లకు కేవలం రూ.4,200, వారి సహాయకులకు రూ.2,200 వేతనం లభించేది. 

‎కానీ బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక అంగ‌న్‌వాడీ టీచర్ల వేతనాన్ని రూ.13,650లకు, మినీ అంగన్ వాడీ టీచర్ల వేతనాన్నిరూ.7,800లకు, అంగన్ వాడీ హెల్పర్ల వేతనాన్ని రూ.7,800 లకు పెంచి దేశంలోనే అత్యధికంగా చెల్లించారు. 

‎అభయహస్తం పేరిట ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోలో అంగన్‌వాడీ టీచర్ల వేతనాన్ని 18,000లకు పెంచుతామని, ఈపీఎఫ్ పరిధిలోకి తీసుకువచ్చి ఉద్యోగ భద్రత కల్పిస్తామని ప్రకటించారు.

‎మాయ మాటలు చెప్పి, రెండున్నరేండ్లు గడుస్తున్నా ఇచ్చిన హామీకి అతీ లేదు, గతీ లేదు.

‎ఎన్నికలకు ముందు అరచేతిలో వైకుంఠం, అధికారంలోకి వచ్చాక అబద్దాలు ప్రచారం చేసుకుంటం అన్నట్లుంది కాంగ్రెస్ వైఖరి. 

‎సమస్యల పరిష్కారం కోసం ఛలో సెక్రెటేరియట్ పిలుపునిచ్చిన అంగన్ వాడీల పట్ల ప్రభుత్వం పోలీసులను ప్రయోగించి, కర్కషంగా వ్యవహరించిన దుర్మార్గమైన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిది. 

‎ఇప్పటికైనా కళ్లు తెరవండి, మీ పాలనను అన్ని వర్గాల ప్రజలు ఛీ కొడుతున్నారన్న విషయాన్ని గుర్తించండి.

‎రెండు నెలలుగా పెండింగ్ లో ఉన్న అంగన్ వాడీల వేతనాలను చెల్లించాలని, అప్ గ్రేడ్ చేసిన మినీ అంగన్ వాడీలకు ఏడాదిగా పెండింగ్ లో ఉన్న పెంచిన వేతనాలను తక్షణం చెల్లించాలని బిఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.

Search
Categories
Read More
Telangana
మంచిర్యాల బస్టాండ్ ఆధునీకరణకు చర్యలు : ఎంమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల: పట్టణ ప్రజలు, ప్రయాణికుల సౌకర్యార్థం మంచిర్యాల బస్టాండ్‌ను సుమారు రూ.20 కోట్లతో...
By KalyanKumar Katakam 2026-09-19 12:46:55 0 27
Telangana
‎మీ అన్ననో, తండ్రినో తిడితే మీకు కోపం రాదా? ఎమ్మెల్యే తలసాని
కేటీఆర్ ఉధృతంగా మాట్లాడితే అహంకారం అంటున్నారు.. ఆయన తండ్రిని తిడితే ఆయనకి కోపం రాదా? ...
By Ponnala Srinivasrao 2026-05-18 01:29:59 0 172
Telangana
న్యూయర్ ఫీవర్.. మీటర్ దాటితే జైలుకే..! వాహనదారులకు మాస్ వార్నింగ్!
న్యూయర్ వేడుకల పేరుతో రోడ్లపై హంగామా సృష్టిస్తూ, హద్దు మీరితే కఠిన చర్యలు తప్పవని వాహనదారులకు...
By SivaNagendra Annapareddy 2025-12-25 06:32:33 0 628
Andhra Pradesh
ఎన్.సి.సి. ఆఫీసర్ గిరిధర్ నాయక్ కు జాతీయ స్థాయి అవార్డు.
మదనపల్లె మండలం, చిన్నతిప్పసముద్రం పి. ఎం. శ్రీ జడ్పీ ఉన్నత పాఠశాల ఎన్.సి.సి. ఆఫీసర్ ఎం. గిరిధర్...
By Pagadala Venkateswar 2026-03-01 04:17:20 0 225
Andhra Pradesh
తల్లి కష్టానికి ప్రతిఫలం.. కోర్టులో కుమారుడికి జాబ్
 రాజాం పట్టణంలోని ఎల్లయ్య నగర్కు చెందిన అరసాడ యువరాజు శ్రీకాకుళం జిల్లా కోర్టులో టైపిస్ట్...
By Boiena Rajesh 2026-08-22 05:28:17 0 90
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com