భగవంతుడు శాశ్వతం భగవంతుడికి సేవ చేసి సేవకులు శాశ్వతం కాదు

0
406

భగవంతుడు శాశ్వతం-భగవంతుడికి సేవ చేసే సేవకులు శాశ్వతం కాదు. భగవంతుడికి సేవ చేసే సేవకులు మారుతూ ఉంటారు. భగవంతుడికి సేవ ఆపితే ఆ భూమి తిరిగి దేవాలయం లేదా సంబంధిత మత సమస్త కు వెళుతుంది ఇతరులకు స్వేచ్ఛగా అమ్మడం లేదా బదిలీ చేయడం చట్టవిరుద్దమే కాదు భగవంతుడి కోర్టులో శిక్ష పడుతుంది.ఈ విషయాన్ని ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గార్లతో పాటు నారా లోకేష్ గారు కూడా తెలుసుకోవాలి.

 

చంద్రబాబు పవన్ కళ్యాణ్ గార్లతో పాటు బిజెపి అధ్యక్షుడు మాధవ్ గారికి కూడా భగవంతుడు అంటే భయం లేదు అందుకే హిందూ దేవాలయాలకు చెందిన 138848 ఎకరాల హిందూ దేవుళ్ళ దేవాలయాలకు చెందిన భూముల్ని దేవాలయాల ఆస్తుల జాబితా నుంచి తొలగించి రిజిస్ట్రేషన్ శాఖలో నిషేధిత భూముల జాబితా 22A (1) తొలగించి ప్రైవేటు వ్యక్తుల పేర్లపై యాజమాన్య హక్కులు కల్పించి తద్వారా ఈ 138848 ఎకరాల భూములను అమ్మకం చేసి వేలకోట్ల రూపాయలు సంపాదించాలని అందుకే హిందూ దేవాలయాల భూముల్ని దేవాలయాల ఆస్తుల జాబితా నుంచి తొలగించే బాధ్యతను ఎండోమెంట్ కమిషనర్ రామచంద్ర మోహన్ కు అప్పగించారు అతను ఎప్పటికీ అన్నవరం సింహాచలం తిరువూరు ఇలాంటి చాలా ఆలయాలకు సంబంధించిన వేల ఎకరాల హిందూ దేవుళ్ళ భూముల్ని ఆస్తుల జాబితా నుంచి తొలగించి ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి వందల వేల కోట్ల రూపాయల ఆస్తులను సంపాదించిన చేయి తిరిగిన వ్యక్తి కనుకనే చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ లక్ష 38,848 ఎకరాల భూములను దేవాలయాల ఆస్తుల జాబితా నుంచి తొలగించే బాధ్యతను బకాసురుడైన ఎండోమెంట్ ఇన్చార్జి కమిషనర్ రామచంద్ర మోహన్ కు అప్పగించారు.

హిందూ దేవాలయాల భూముల్ని కొట్టేయాలని చూస్తున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ మాధవ్ మరియు లోకేష్ లు భగవంతుడి ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరిస్తున్నాం.

 

దేవాదాయ శాఖకు చెందిన ఈనాం భూములకు వక్ర భాష్యం చెబుతూ సర్వీస్ ఇనాం భూములను విడుదల చేస్తున్నామని అబద్ధాలు చెబుతూ దేవాదాయ శాఖ భూములను కొట్టేసే కుట్ర చేస్తుంది కూటమి ప్రభుత్వం. 

 

దేవాదాయ ఈనాం భూములు అంటే దేవుడికి సేవ చేసినంతవరకు మాత్రమే ఆ భూములపై సేవ చేసే వ్యక్తి కుటుంబం ఐ వేలు తినే హక్కు మాత్రమే ఉంటుంది వారికి ఎప్పటికీ యాజమాన్య హక్కులు లభించవు వారు దేవుడి సేవకులు మాత్రమే దేవుడి భూములపై ఎటువంటి హక్కులు సంక్రమించవు. 

 

హిందూ దేవాలయాలకు హిందూ ధార్మిక సంస్థలకు సేవలు అందించాలని బాధ్యతతో ఇచ్చే ఈనాం భూములు విలేజ్ సర్వీస్ ఇనాం భూములతో సమానంగా చూడరాదు. మీరు కావాలనే విలేజ్ సర్వీస్ ఇనాం భూముల ముసుగులో హిందూ దేవాలయాలకు ధార్మిక సంస్థలకు చెందిన ₹138,840 ఎకరాల భూములను కాజేసే ప్రయత్నం చేస్తున్నారు. 

 

రాష్ట్రవ్యాప్తంగా నిషేధిత జాబితాలో ఉన్న భూములు 22 లక్షల ఎకరాలకు పైనే ఉంది అయినా మీరు కేవలం జారీ చేసిన మెమో 214/2026 dt 17.4.2026 కేవలం 1,38,848 ఎకరాలకు మాత్రమే అంటే ఇవి ఖచ్చితంగా చెప్పగలం దేవాదాయ శాఖకు చెందిన హిందూ ధార్మిక సంస్థలకు చెందిన హిందూ దేవుళ్ళ భూములేనని. 

 

మీరు హిందూ దేవాలయాలకు హిందూ మత సంస్థలకు చెందిన భూములను విలేజ్ సర్వీస్ ఇన్ ముసుగులో హిందూ దేవాలయాలకు చెందిన 1,38,848 ఎకరాల భూములకు ప్రైవేటు వ్యక్తులకు పట్టాలు మంజూరు చేసి రెవెన్యూ రికార్డ్స్ లో పేరు మార్పు చేసి రిజిస్ట్రేషన్ శాఖలో నిషేధిత భూముల జాబితా 22 ఏ నుంచి తొలగించి వారి ద్వారా ఈ భూముల మొత్తాన్ని అమ్మకం చేసి తద్వారా వేల కోట్ల రూపాయలు సంపాదించాలని కొట్ర ఇందులో స్పష్టం. 

 

ఒక్క సంతకంతో ఒక్క కలం పోటుతో హిందూ దేవుళ్లకు దేవాలయాలకు హిందూ ధార్మిక సంస్థలకు చెందిన 138848 ఎకరాల భూములను దేవుడు ఆస్తుల జాబితా నుంచి తొలగించే నిర్ణయం సాధారణ నిర్ణయం కాదు ఇది దేశంలోనే అతిపెద్ద స్కామ్ గా అభివర్ణించవచ్చు ఇది హిందూ దేవాలయాల మీద హిందూ దేవుళ్ళ భూములు మీద జరుగుతున్న అధికారిక దాడి. 

 

హిందూ ధర్మానికి హిందూ దేవాలయాల భూములకు శాశ్వత నష్టం కలిగించే ఈ మెమోని తక్షణమే రద్దు చేయాలి ఈమెమో హిందూ దేవాలయాల ఆస్తులకి తీవ్రమైన ప్రమాదం కలిగిస్తుంది తద్వారా హిందూ ధర్మ పరిరక్షణకే ప్రమాదం వాటిల్లుతుంది. 

 

దేవుడి సర్వీస్ ఈయన భూములు విలేజ్ సర్వీస్ ఇనాం భూములు ఒకటి కాదు ఇవి నిర్ధారించడానికి చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వం ఏమన్నా కమిషన్ వేశారా కమిటీ వేశారా దేవాదాయ ధర్మాదాయ శాఖ ట్రిబ్యునల్ లో ఏమన్నా వాదోపవాదాలు జరిగాయా? అసలు మీరెవరు దేవుడి భూమిని అన్యాక్రాంతం చేయడానికి అమ్ముకోవడానికి హక్కులు కల్పించడానికి 

 

హిందూ దేవాలయాలకు దేవుళ్లకు హిందూ మత సంస్థలకు చెందిన భూములను దేవాలయాల ఆస్తుల జాబితా నుంచి తొలగించే నిర్ణయాన్ని ఎంత గోప్యంగా ఎలా తీసుకుంటారు. 

 

చంద్రబాబు నాయుడు గారు ఈ నామ్ సర్వీస్ భూముల చట్టం 1965 అనేక నియమాలు ఉన్నాయి భూముల అమ్మకాలపై పరిమితులు ఉన్నాయి సేవా ఇనాం ద్వారా దేవుడి భూములను కాపాడడం మాత్రమే చేయాలి గాని కాజేసే హక్కులు కల్పించలేరు. 

 

రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 ప్రకారం ఒకసారి దేవాలయాలకు చెందిన భూములు 22 ఏలో చేర్చబడితే అవి ఎప్పటికీ రిజిస్ట్రేషన్ చేయకుండా నిషేధిత జాబితాలోనే ఉంటాయి చంద్రబాబునాయుడు గారు కూటమి ప్రభుత్వానికి దేవుడి భూములను వేరొకరికి హక్కులు అమ్మి వేసి హక్కులు ఎప్పటి కల్పించలేరు. 

 

దేవాలయాల భూములను ఈనాం సేవా భూములను ప్రభుత్వ భూములను వివాదాస్పద భూములను ఇవన్నీ ఒకేలా చూపించి చంద్రబాబు నాయుడు గారు ఎండోమెంట్ ఇన్చార్జి కమిషనర్ రామచంద్ర మోహన్ ద్వారా ఇంత పెద్ద విషయాన్ని గోప్యంగా నడుపుతున్నారు. 

 

ఆర్టికల్ 14 రాజ్యాంగపరంగా కూటమి ప్రభుత్వం జారీచేసిన ఏ మెమో హిందూ ధర్మానికి హిందూ దేవాలయాల భూములకు అత్యంత అన్యాయం చేసేది చట్టవిరుద్ధమైనది రాజ్యాంగ విరుద్ధమైనది. 

 

ఇది ఆర్టికల్ 300A పూర్తిగా ఉల్లంఘించారు మీరు హక్కులను సృష్టించలేరు మార్చలేరు బదిలీ కూడా చేయలేరు ఈ విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలి. 

 

ప్రభుత్వం దేవాలయాల భూములకు ట్రస్ట్రీ మాత్రమే యజమాని ఎప్పటికీ కాదు దేవుడి భూములను ఉపయోగించాల్సింది దేవుడు సేవకు మాత్రమే అంతేగాని లక్షల ఎకరాల భూములను ఏ విధంగా ప్రైవేటు వ్యక్తులకు మీ బినామీలకు కట్టబెడతారో సమాధానం చెప్పాలి. 

 

ఈనామ్ అంటేనే దానం ఇచ్చినది ఒకసారి ఈనాం రద్దు అయినంత మాత్రాన యాజమాన్యం మారదు ఇది సరైన విధానం కాదు విచారణ జరిగి తీరాలి. 

 

హిందూ దేవుళ్ళ భూములను కాజేస్తున్న బిజెపి మౌనం దేనికి సంకేతం నెయ్య జీడిపప్పు బాదంపప్పు వేసిన చక్ర పొంగలి తిని నాలిక మడత పడిపోయిందా మాధవ్ గారు. కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రాలతోనే సరిపెట్టారు 

 

హిందూ ధర్మానికి హిందూ దేవాలయాల భూములకి హిందూ మత సంస్థల భూములకి ఎంత ప్రమాదం జరుగుతుంటే స్వామీజీల కళ్ళకు కనబడడం లేదా మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు చిన్న జీయర్ స్వామి గారు ఎందుకు మౌనంగా ఉన్నారు శివ స్వామి గారు ఎందుకు మౌనంగా ఉన్నారు కమలానంద భారతి సరస్వతి గారు ఎందుకు మౌనంగా ఉన్నారు పరిపూర్ణానంద సరస్వతి గారు తిరుపతి శ్రీనివాస స్వామీజీ మీ కళ్ళకు కనబడడం లేదా మీ చెవులకు వినపడడం లేదా.

Search
Categories
Read More
SURAKSHA
Rajesh Kumar IAS: Driving Reform Through Good Governance
A 2014-batch AGMUT officer entrusted with Personnel, Vigilance and administrative reform in...
By Lokeshwari Panthadi 2026-08-03 07:07:59 0 239
Andhra Pradesh
అమరావతిలో ఫిట్స్ పిలాని సందర్శించిన నారా లోకేష్
*అమరావతిలో బిట్స్ పిలాని నిర్మాణ ప్లాన్ లను పరిశీలించిన లోకేష్*   అమరావతి: అమరావతిలో...
By Rajini Kumari 2026-03-13 13:38:45 0 209
Telangana
రైల్వే స్టేషన్‌లో గంజాయి పట్టివేత.|
"ఒడిశా నుంచి నాగ్‌పూర్‌కు తరలిస్తున్న రూ.20.56 లక్షల విలువైన గంజాయి స్వాధీనం.. ఇద్దరు...
By Sidhu Maroju 2026-07-06 10:28:07 0 116
Andhra Pradesh
డ్రగ్స్ యువత భవిష్యత్తును చీకటిలోకి నెడతాయి డాక్టర్ జి. రాజ్ కుమార్ యండి
సెయింట్ మార్క్స్ లూథరన్ జూనియర్ కళాశాలలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ అవగాహన...
By Vadlamudi NagaVenkat 2026-06-25 11:48:18 0 316
Andhra Pradesh
రెడ్ క్రాస్ సేవలకు గుర్తింపు.. ఏడుగురు కలెక్టర్లకు స్వర్ణ పతకాలు.
ఆంధ్రప్రదేశ్‌లోని ఏడుగురు జిల్లా కలెక్టర్లు ప్రతిష్ఠాత్మక గవర్నర్ స్వర్ణ పతకాలకు...
By Pagadala Venkateswar 2026-08-29 05:42:36 0 71
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com