చింతూరు: సీలేరు నదిలో స్నానానికి దిగి వ్యక్తి ప్రమాద వశత్తు మృతి!

0
237

పోలవరం జిల్లా చింతూరు మండలం కల్లేరు కాలనీ సమీపంలోని పిక్‌నిక్ స్పాట్ వద్ద విషాద ఘటన చోటుచేసుకుంది. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం బొమ్మిడి గ్రామానికి చెందిన సబ్బవరపు ఆనంద్ సీలేరు నదిలో మునిగి మృతి చెందారు. మూడు కుటుంబాలకు చెందిన 13 మంది మూడు కార్లలో చింతూరు ఏజెన్సీ ప్రాంతంలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు వచ్చారు. ఈ క్రమంలో సీలేరు నది వద్ద నదిలో దిగి స్నానాలు చేస్తూ ఉండగా నీటి ప్రవాహంలో మృతుడు ఆనంద్ మరియు మరో కుటుంబానికి చెందిన బాబు చిక్కుకోగా కొద్ది దూరంలో ఉన్న స్థానికుడు గుర్తించి వెంటనే స్పందించి బాబుని సురక్షితంగా కాపాడగా, ప్రమాదవశాత్తూ మృతుడు నీటి ప్రవాహంలో చిక్కుకుని మృతి చెందాడు. మృతుడు ఏలూరు జిల్లా పత్తేపురంలో విద్యుత్ శాఖలో లైన్‌మ్యాన్‌గా విధులు నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సమాచారం అందుకున్న చింతూరు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం చింతూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు చింతూరు పోలీసులు.

 

# Yadagiri 

References

Search
Categories
Read More
SURAKSHA
Santosh Sukhadeve IAS: Driving Good Governance Forward
The Journey Begins True leadership in public administration is measured not by headlines but by...
By Fathima Safa 2026-07-23 13:45:32 0 128
Andhra Pradesh
​ప్రైవేట్ ఆసుపత్రిలో గర్భిణీ మృతి: కుటుంబీకుల ఆందోళన.
మదనపల్లిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రసవం కోసం చేరిన గాయత్రి అనే గర్భిణీ మృతి చెందడంతో ఉద్రిక్తత...
By Pagadala Venkateswar 2026-03-08 04:46:00 0 187
Telangana
కన్న తల్లిదండ్రులనే క్షోభ పెట్టే కవితక్క ఎట్లా పరాయి వాళ్లకు 'అమ్మ 'అయితది ?
కొత్త పేరు పెట్టుకునే ధైర్యం లేదు… ‎కానీ “కొత్త రాజకీయ శక్తి” అంటూ...
By Ponnala Srinivasrao 2026-04-26 02:36:38 0 153
Andhra Pradesh
పెద్దాపురం: సుదముక్యలతో సాక్ష్య కళాఖండాలు
పెద్దాపురం పట్టణానికి చెందిన గృహిణి కొరుకొండ మహాలక్ష్మి సుదముక్యలతో సాక్ష్య కళాఖండాలను తయారు చేసి...
By Ratna Sekhar 2026-02-12 08:22:04 0 457
Andhra Pradesh
భారత్ ప్రతిష్ఠ‌ను పెంచిన బ్రిక్స్ సదస్సు.. ప్రధాని మోదీకి చంద్రబాబు, పవన్ కితాబు.
  ప్రపంచవ్యాప్తంగా భారత్ వాణికి గతంలో కంటే గౌరవం పెరిగిందన్న చంద్రబాబు ప్రపంచ వేదికపై...
By Pagadala Venkateswar 2026-09-14 10:48:00 0 90
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com