నైరుతి ఆగమనం.. ఒకటి రెండు రోజుల్లో ఏపీకి!

0
115

ముందుగా రాయలసీమను తాకనున్నట్లు అంచనా

ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు

ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గుతాయని ఐఎండీ నివేదిక

దేశవ్యాప్తంగా ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు భారత ప్రధాన భూభాగంలోకి ప్రవేశించాయి. జూన్ 4వ తేదీన ఇవి కేరళ తీరాన్ని తాకినట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం రుతుపవనాల కదలిక చురుగ్గా ఉందని, శనివారం నుంచి సోమవారం లోపు ఇవి ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు.

 

సాధారణంగా జూన్ 1న కేరళలోకి ప్రవేశించాల్సిన రుతుపవనాలు, ఈసారి మూడు రోజులు ఆలస్యంగా వచ్చాయి. ఇప్పటికే కేరళతో పాటు కర్ణాటక, తమిళనాడు, గోవాలోని కొన్ని ప్రాంతాలకు ఇవి విస్తరించగా, అక్కడ వర్షాలు కురుస్తున్నాయి. అమరావతి వాతావరణ కేంద్రం అంచనాల ప్రకారం.. జూన్ 6 నుంచి 8 మధ్య రుతుపవనాలు రాయలసీమలోకి ప్రవేశించే అవకాశం ఉంది. ఒకవేళ వాతావరణ పరిస్థితులు అనుకూలించని పక్షంలో వారం రోజుల వరకు ఆలస్యం కావచ్చని అధికారులు తెలిపారు. అయితే, ఈ నెల 10వ తేదీ నాటికి ఇవి రాష్ట్రాన్ని తాకి, 15వ తేదీ నాటికి రాష్ట్రమంతటా విస్తరిస్తాయని విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథకుమార్ పేర్కొన్నారు. 

Search
Categories
Read More
Andhra Pradesh
విధులకు గైర్హాజరు.. 51 మంది వైద్యులపై ఏపీ సర్కార్ వేటు.
ఏపీలో 51 మంది ప్రభుత్వ వైద్యులను శాశ్వతంగా తొలగించిన ప్రభుత్వం ఏళ్ల తరబడి విధులకు అనధికారికంగా...
By Pagadala Venkateswar 2026-05-07 07:06:47 0 127
BMA
Amnesty Report Warns of Dissent Criminalization in India
A mid-2026 human rights report jointly released by Amnesty International and the Civicus Monitor...
By JoinBMA 2026-08-19 06:02:45 0 167
Telangana
టీచర్ గా మారిన కలెక్టర్...
మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమసింగ్ ఉపాధ్యాయురాలుగా మారారు. రామాయంపేట కేజీబీవీ సందర్శించిన కలెక్టర్...
By Katiyala JeevanRaj 2026-04-08 10:32:21 0 446
Telangana
మల్కాజిగిరి ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  : మల్కాజిగిరి నియోజకవర్గ ప్రజలకు మరియు రాష్ట్ర ప్రజలందరికీ...
By Sidhu Maroju 2026-03-18 13:48:48 0 243
Telangana
భారీగా తగ్గిన చికెన్ ధరలు
గత వారంతో పోలిస్తే ఇవాళ చికెన్ ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ లో నిన్న మొన్నటి వరకు కేజీ స్కిన్...
By Prashanth Goindla 2026-03-29 02:00:39 0 507
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com