మెగా డీఎస్సీపై ఆరోపణలు.. స్పష్టతనిచ్చిన ఏపీ విద్యాశాఖ.

0
127

 

మెగా డీఎస్సీపై ఆరోపణలు.. స్పష్టతనిచ్చిన ఏపీ విద్యాశాఖ

06-06-2026 Sat 08:27

Andhra

Mega DSC allegations AP Education Department provides clarification

మెగా డీఎస్సీ-2025 పై ఆరోపణలను ఖండించిన ప్రభుత్వం

మెరిట్, రిజర్వేషన్ల ప్రకారమే నియామకాలు జరిగాయని స్పష్టీకరణ

కంప్యూటర్ ఆధారిత పరీక్షతో పారదర్శకంగా ప్రక్రియ పూర్తి చేశామన్న అధికారులు

మెగా డీఎస్సీ-2025 నియామక ప్రక్రియపై వస్తున్న ఆరోపణలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పాఠశాల విద్యాశాఖ తీవ్రంగా ఖండించాయి. నియామకాలన్నీ పూర్తిగా మెరిట్ ప్రాతిపదికన, నిర్దేశిత రిజర్వేషన్ రోస్టర్ నిబంధనల ప్రకారమే అత్యంత పారదర్శకంగా జరిగాయని స్పష్టం చేశాయి. ఈ ప్రక్రియలో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది.

 

సుమారు 16,000 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన ఈ ప్రక్రియను కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) ద్వారా నిష్పాక్షికంగా నిర్వహించినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. మెరిట్ జాబితాలు, ఎంపిక జాబితాలు సహా అన్ని వివరాలను నిబంధనల మేరకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచామని వివరించారు. ప్రభుత్వ ఉత్తర్వులు, రిజర్వేషన్ విధానాలను కచ్చితంగా పాటిస్తూ, బహుళస్థాయి పరిశీలన తర్వాతే నియామకాలు చేపట్టామని, అందువల్ల అక్రమాలు జరిగాయన్న ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టం చేశారు.

 

ప్రశ్నపత్రాల లీకేజీ, డేటా తొలగింపు, మెరిట్ జాబితాల ప్రకటనలో జాప్యం, స్పోర్ట్స్ కోటా మరియు ఇతర రిజర్వేషన్ల అమలులో అక్రమాలు జరిగాయని ప్రతిపక్ష వైసీపీ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నియామక ప్రక్రియపై మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

 

ఈ ఆరోపణల నేపథ్యంలో సాధారణ పరిపాలన శాఖ (సర్వీసెస్) స్పెషల్ సీఎస్ రావత్, పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్, శాప్ ఎండీ భరణి నిన్న సచివాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. నియామక ప్రక్రియపై ఎవరికైనా అనుమానాలుంటే పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్‌కు వచ్చి నివృత్తి చేసుకోవచ్చని వారు సూచించారు. తమకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తున్న 34 మంది అభ్యర్థుల ర్యాంకులు, క్రీడా మెరిట్, హారిజాంటల్ రిజర్వేషన్ అమలుకు సంబంధించిన వివరాలను ఈ సందర్భంగా వెల్లడించి, వారికి ఉద్యోగాలు ఎందుకు రాలేదనే విషయాన్ని స్పష్టంగా వివరించారు

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: అదుపుతప్పి పొలాల్లోకి వెళ్లిన వాహనం
పుంగనూరు పరిధిలో శుక్రవారం రోజున ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. పుంగనూరు నుంచి ముల్బాగల్ కు వెళ్లే...
By Kothuru Murali 2026-05-22 14:22:02 0 131
Andhra Pradesh
Chandrababu Naidu: ప్రజలకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
దేశ వ్యాప్తంగా ఘనంగా ప్రారంభమైన 77వ గణతంత్రదిన వేడుకలు ప్రతి ఒక్కరూ రాజ్యాంగ విలువలను కాపాడుతూ...
By Pagadala Venkateswar 2026-01-26 05:52:58 0 230
SURAKSHA
టెక్నాలజీతో నేర నియంత్రణ: హైదరాబాద్ సిటీ సేఫ్టీ
ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో తెలంగాణ పోలీసులు ముందున్నారు. నగరవ్యాప్తంగా ఏర్పాటు చేసిన...
By Kalaga Sailaja 2026-06-26 05:27:35 0 99
Andhra Pradesh
భారీ జన సందోహం మధ్య విజయోత్సవ సభకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు భారీ బైక్ ర్యాలీ
మంత్రి మండిపల్లి సారథ్యంలో కూటమి విజయోత్సవ సభకు పోటెత్తిన కార్యకర్తలు టిడిపి శ్రేణులను ముందుంది...
By Benguluri Madhubabu 2026-06-20 09:54:23 0 174
Andhra Pradesh
నిమ్మనపల్లె వద్ద ఆటో బోల్తా.. ఐదుగురికి గాయాలు.
నిమ్మనపల్లె సమీపంలో బుధవారం ఆటో బోల్తా పడి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు గాయపడ్డారు....
By Pagadala Venkateswar 2026-05-21 05:40:12 0 122
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com