ఆసిఫాబాద్‌ దస్నాపూర్‌లో అగ్నిప్రమాద బాధితులకు మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు పరామర్శ తక్షణ ఆర్థిక సహాయం అందజేత

0
375

🎤కొమురం భీం ఆసిఫాబాద్  భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్ 

ఆసిఫాబాద్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని దస్నాపూర్‌లో అర్ధరాత్రి వేళ జరిగిన ఘోర అగ్నిప్రమాదం బాధితులను మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జిల్లా లైబ్రరీ చైర్మన్ అనిల్ కుమార్ గురువారం పరామర్శించారు. ప్రమాదంలో ఇళ్లను కోల్పోయి నిరాశ్రయులైన బాధితులను వారు కలిసి ఓదార్చారు. అగ్నిప్రమాదంలో పూర్తిగా కాలి బూడిదైన ఇళ్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి, నష్టపోయిన కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాధితులకు ధైర్యం చెబుతూ, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు బాధిత కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యేలా ప్రత్యేక కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రమాద ఘటన తీవ్రతను మరియు బాధితుల దుస్థితిని జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు గారి దృష్టికి తీసుకువెళ్లగా, ఆయన తక్షణమే సానుకూలంగా స్పందించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరపున అందవలసిన అత్యవసర సహాయాన్ని వెంటనే అందిస్తామని, అలాగే నిరాశ్రయులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు కట్టించి ఇస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. ప్రభుత్వ పరంగా తగిన సహాయ సహకారాలు త్వరితగతిన అందేలా చూడాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ పరామర్శ కార్యక్రమంలో ఆసిఫాబాద్ మున్సిపాలిటీ కౌన్సిలర్ రాపర్తి కార్తీక్, గులాం జావిద్, NSUI జిల్లా నాయకులు ఆసిఫ్, సర్పంచ్ బసవయ్య, మేకర్తి శ్రీను, నిఖిల్, రాజేందర్, జమీర్, అబ్బు, బండి సాయి, చాపడి సురేష్‌లతో పాటు స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Search
Categories
Read More
BMA
BJP Declares June 25 as 'Samvidhan Hatya Diwas'
Union Home Minister Amit Shah and PM Modi termed the 1975 Emergency a “dark chapter”...
By Bharat Aawaz 2025-06-25 11:40:55 0 2K
Telangana
కరీంనగర్ లో ముమ్మరంగా వాహన తనిఖీలు
కరీంనగర్‌లో ముమ్మరంగా వాహన తనిఖీలు కరీంనగర్: టౌన్ ఏసీపీ ఎన్. వెంకటస్వామి ఆధ్వర్యంలో...
By Thalakokkula Sadanandam 2026-08-13 17:19:25 0 132
Andhra Pradesh
దుర్గ గుడి నూతన యాగశాలలో చండీ హోమంలో పాల్గొన్న భక్తులు
*దుర్గగుడి నూతన యాగశాలలో చండీ హోమంలో పాల్గొన్న భక్తులు*    *నూతన యాగశాల ద్వారా...
By Rajini Kumari 2025-12-19 09:54:12 0 240
SURAKSHA
Ex-AP Cops: Cyber Crime Fighters After Service Ends
Retirement తీసుకున్న AP police officers ఇప్పుడు cyber crime fighters గా మారారు. Villages, towns...
By Kalaga Sailaja 2026-07-03 13:49:47 0 181
Andhra Pradesh
మార్కాపురంలోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎం.విజయ సునీత గారు, 
మార్కాపురంలోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ శ్రీమతి...
By Chennaiah Kati 2026-07-11 14:48:55 0 141
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com