ఆసిఫాబాద్‌ దస్నాపూర్‌లో అగ్నిప్రమాద బాధితులకు మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు పరామర్శ: తక్షణ ఆర్థిక సహాయం అందజేత

0
358

🎤కొమురం భీం ఆసిఫాబాద్  భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్ 

ఆసిఫాబాద్ : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని దస్నాపూర్‌లో అర్ధరాత్రి వేళ జరిగిన ఘోర అగ్నిప్రమాదం బాధితులను మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జిల్లా లైబ్రరీ చైర్మన్ అనిల్ కుమార్ గురువారం పరామర్శించారు. ప్రమాదంలో ఇళ్లను కోల్పోయి నిరాశ్రయులైన బాధితులను వారు కలిసి ఓదార్చారు. అగ్నిప్రమాదంలో పూర్తిగా కాలి బూడిదైన ఇళ్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి, నష్టపోయిన కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాధితులకు ధైర్యం చెబుతూ, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు బాధిత కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యేలా ప్రత్యేక కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రమాద ఘటన తీవ్రతను మరియు బాధితుల దుస్థితిని జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు గారి దృష్టికి తీసుకువెళ్లగా, ఆయన తక్షణమే సానుకూలంగా స్పందించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరపున అందవలసిన అత్యవసర సహాయాన్ని వెంటనే అందిస్తామని, అలాగే నిరాశ్రయులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు కట్టించి ఇస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. ప్రభుత్వ పరంగా తగిన సహాయ సహకారాలు త్వరితగతిన అందేలా చూడాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ పరామర్శ కార్యక్రమంలో ఆసిఫాబాద్ మున్సిపాలిటీ కౌన్సిలర్ రాపర్తి కార్తీక్, గులాం జావిద్, NSUI జిల్లా నాయకులు ఆసిఫ్, సర్పంచ్ బసవయ్య, మేకర్తి శ్రీను, నిఖిల్, రాజేందర్, జమీర్, అబ్బు, బండి సాయి, చాపడి సురేష్‌లతో పాటు స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
మేడ్చల్ డిసిపి కోటిరెడ్డి ఆధ్వర్యంలో అల్వాల్ పోలీసుల కార్డన్ సెర్చ్.|
మేడ్చల్ మల్కాజ్గిరి :  మేడ్చల్ డిసిపి కోటిరెడ్డి ఆధ్వర్యంలో దాదాపు 250 మంది పోలీస్...
By Sidhu Maroju 2025-11-19 07:23:25 0 237
Andhra Pradesh
# కొత్తూరు మురళి.
పుంగనూరులోని నెక్కొంది కొండపై ఉన్న శ్రీఅగస్తీశ్వర స్వామి దేవాలయం, సాక్షాత్తు అగస్త్య మహాముని...
By Kothuru Murali 2026-01-26 13:57:47 0 225
Telangana
GHMC విభజన పూర్తి- ఏప్రిల్ 1 నుండి స్వతంత్ర పాలన. |
హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) నుంచి విభజించబడిన మూడు మున్సిపల్...
By Sidhu Maroju 2026-03-29 13:53:25 0 458
Andhra Pradesh
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి విశ్వరూప సందర్శన మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు
ప్రచురణార్థం :- 20-01-2026   *శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి విశ్వరూప సందర్శన...
By Rajini Kumari 2026-01-20 10:48:26 0 220
Andhra Pradesh
పుంగనూరు:హైవేపై రోడ్డు ప్రమాదం కొత్తూరు మురళి
పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల క్రాస్ వద్దగల హైవేపై గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది....
By Kothuru Murali 2026-05-22 14:18:09 0 138
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com