ఆసిఫాబాద్‌ పట్టణం దశ్నపూర్ లో అగ్నిప్రమాదం బాధితులకు తక్షణ ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే కోవ లక్ష్మి

0
424

🎤కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్ 

జూన్ 04: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని దస్నాపూర్ కాలనీలో బుధవారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగి, రెండు ఇళ్లు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి.ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే ఆసిఫాబాద్ శాసనసభ్యురాలు శ్రీమతి కోవ లక్ష్మి గారు సంఘటనా స్థలానికి చేరుకొని, బాధితులను పరామర్శించి, ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాధితులకు తక్షణ సహాయం కింద అత్యవసర నిత్యావసర సరుకులు, దుస్తులు మరియు రూ. 20,000 నగదు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ప్రభుత్వం తరపున కూడా బాధితులకు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆమె అక్కడికక్కడే అధికారులను ఆదేశించారు. బాధితులకు తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ముంగ్రే ఆకాష్, వైస్ చైర్మన్ అహ్మద్, సింగిల్ విండో చైర్మన్ అలీ భాయ్, మున్సిపల్ కౌన్సిలర్లు సలాం, బాలకృష్ణ, బీఆర్ఎస్ పార్టీ  నాయకురాలు మారుస్కోల సరస్వతి, మండల అధ్యక్షుడు జబోరే రవీందర్, టౌన్ ప్రెసిడెంట్ అహ్మద్ బిన్ అబ్దుల్లా, దూడల అశోక్, సాయి, శ్రవణ్ తదితర స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతి లొసుగులను ఆసరాగా చేసుకుని హైదరాబాద్‌లో భారీ రియల్ ఎస్టేట్ మోసం
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతి లొసుగులను ఆసరాగా చేసుకుని హైదరాబాద్‌లో భారీ రియల్...
By Ponnala Srinivasrao 2026-05-06 03:54:03 0 211
SURAKSHA
Traffic Management: Leveraging Smart Technology for Efficiency
Effective traffic management is vital for modern urban mobility. By implementing smart...
By Kalaga Sailaja 2026-06-26 11:28:52 0 113
Andhra Pradesh
ఈ నెల 28న మదనపల్లెకు వైఎస్ జగన్ రాక.
మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఈ నెల 28న మదనపల్లెలో పర్యటించనున్నారు. ఈ పర్యటన ఖరారు...
By Pagadala Venkateswar 2026-06-19 04:36:01 0 140
Andhra Pradesh
అమరావతిలో చంద్రబాబును కలిసిన టిడిపి నాయకులు
గురువారం అమరావతిలోని సచివాలయంలో పుంగనూరు టీడీపీ నేత వెంకటరమణ రాజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును...
By Kothuru Murali 2025-12-26 06:13:47 0 248
Telangana
వరంగల్ జిల్లా పాత MGM భవనాన్ని ఏం చేశారో....? మొదలైన చర్చ
భారత్ అవాజ్ న్యూస్:27 మే రోజున ఉత్తర తెలంగాణకు ప్రధాన వైద్య కేంద్రంగా ఉన్న ఎంజీఎం ఆస్పత్రిని...
By Gujile Ramu 2026-05-27 04:23:07 0 160
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com