చింతూరు పోలీసుల తనిఖీలో గంజాయితో పట్టుబడ్డ యువకులు!

0
233

చింతూరు మండలం మోటు జంక్షన్ వద్ద పోలీసులు బుధవారం సాధారణ తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో ఒకే స్కూటీపై అనుమానాస్పదంగా వస్తున్న ముగ్గురు యువకులను ఆపి తనిఖీ చేయగా అసలు రంగు బయటపడింది. వారి వద్ద నుంచి ఏకంగా 4 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.పోలీసుల విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి.వీరంతా ఒరిస్సా నుంచి హైదరాబాద్‌కు గంజాయిని తరలిస్తున్నట్లు ఒప్పుకున్నారు పట్టుబడిన ముగ్గురు యువకులు హైదరాబాద్‌కు చెందిన వారిగా గుర్తించారు.సీజ్ చేసిన గంజాయి విలువ సుమారు రూ. 2 లక్షలు ఉంటుందని అంచనా గంజాయి స్మగ్లింగ్‌పై నిఘా తీవ్రం చేశాం. అక్రమ రవాణాకు పాల్పడితే ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. యువత ఇలాంటి వ్యసనాలకు బానిసై జీవితాలను నాశనం చేసుకోవద్దు అని ఎస్,ఐ సంతోష్ ఈ సందర్భంగా తెలిపారు.ప్రస్తుతం నిందితులపై కేసు నమోదు చేసి, ఈ నెట్‌వర్క్ వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో చింతూరు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

 

# Yadagiri 

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్: తాటికొండ నరేష్ ను పరమర్శించిన మాజీ ఎమ్మెల్యే
నిజామాబాద్ నగరంలోని BRS పార్టీ 35వ డివిజన్ ఇంచార్జ్ శ్రీ తాటికొండ నరేష్ గారి తండ్రి శ్రీ తాటికొండ...
By Sadaq Sadaq 2026-04-23 04:41:59 0 217
Andhra Pradesh
బ్రేకింగ్ న్యూస్ విజయవాడ కొత్తపేట పండగ పూట హోంగార్డు ఇంట విషాదం
*బ్రేకింగ్ న్యూస్..!!* *విజయవాడ కొత్తపేట*    *పండగ పూట హోంగార్డు ఇంట తీవ్ర...
By Rajini Kumari 2026-05-29 11:29:26 0 114
Andhra Pradesh
రౌడీ షీటర్ హత్య.. మదనపల్లెలో మూలాలు
పుంగనూరు రౌడీషీటర్ డీజే భాస్కర్ కర్ణాటక నంగిలి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్యకు గురికావడం...
By Kothuru Murali 2026-02-12 14:05:56 0 182
Telangana
"వాసవీ నగర్‌లో పౌర సమస్యలపై మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి పర్యటన."|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : ఆల్వాల్ మున్సిపల్ పరిధిలోని వాసవీ నగర్ కాలనీలో మాజీ కార్పొరేటర్...
By Sidhu Maroju 2026-06-16 09:19:16 0 124
Andhra Pradesh
పుంగనూరు పట్టణానికి చెందిన మైనారిటీ నాయకుడు ఫక్రూదిన్ షరీఫ్‌ను రాజంపేట జోన్ మైనారిటీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బుధవారం నియమించారు.
వైయస్సార్సీపి అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, పుంగనూరు పట్టణానికి చెందిన మైనారిటీ...
By Kothuru Murali 2026-01-08 13:03:48 0 208
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com