"నా తల తాకట్టు పెట్టియినా నిధులు తెస్తా. పేదోడి ఇల్లు కట్టి తీరుతా, రైతుల కోసం ఎవరినైనా ఎదిరిస్తా. మోదీనైనా లెక్కచేయను-ఆసిఫాబాద్ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గర్జన

0
372

🎤కొమరం భీం ఆసిఫాబాద్ (భారత్  ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్)

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పరిధిలోని కొఠారి-కాగజ్‌నగర్ కూడలి వద్ద నిర్వహించిన 'ప్రజాపాలన - ప్రగతి బాట' బహిరంగ సభలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారు పాల్గొని ప్రసంగిస్తూ, గిరిజనులు, ఆదివాసీలు, రైతులు, పేదల సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన ఎజెండా అని స్పష్టం చేస్తూ జిల్లా ప్రగతి కోసం 112.14 కోట్ల నిధులతో విద్యుత్, సౌర విద్యుత్, రోడ్లు, తాగునీటి ప్రాజెక్టుల విస్తరణ పనులకు శంకుస్థాపనలు చేశారు, ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇండ్ల పథకంపై ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఇండ్ల నిర్మాణానికి నిధుల కొరత అనే మాటే రాదని, పేదల కోసం అవసరమైతే తన తల తాకట్టు పెట్టి అయినా సరే నిధులు తెస్తానని హామీ ఇస్తూ, ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారులు 1 లక్ష ఇందిరమ్మ ఇండ్లలో గృహప్రవేశాలు పూర్తి చేసుకున్నారని, రాబోయే సెప్టెంబర్ 17 నాటికి మరో 1 లక్ష ఇండ్లలో గృహప్రవేశాలు జరిగేలా ప్రణాళికలు సిద్ధం చేశామని, రెండో విడతలో భాగంగా మరో 2.50 లక్షల ఇండ్ల నిర్మాణాన్ని చేపడుతున్నామని ప్రకటించడంతో పాటు, ఆదివాసీ గూడాల అభ్యున్నతి కోసం సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ పరిధిలో అదనంగా 21 వేల ఇందిరమ్మ ఇండ్లను ప్రత్యేకంగా మంజూరు చేస్తున్నట్లు వెల్లడించి, గూడెల్లో ఇండ్లు లేని పేదలను గుర్తించేందుకు ప్రత్యేక అధికారులను నియమించాలని రాష్ట్ర రెవెన్యూ మరియు గృహనిర్మాణ శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని సభ నుంచే ఆదేశించారు, ఇండ్ల కేటాయింపులో ఎలాంటి రాజకీయాలు, పార్టీలు, కులాల ప్రస్తావన లేకుండా కేవలం అర్హతనే ప్రామాణికంగా తీసుకుంటామని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి, గత ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో వేల కోట్లు దోచుకున్నా ఆదిలాబాద్ ప్రాంతానికి ఒక్క ఎకరాకు నీరు అందలేదని విమర్శిస్తూ, ఈ జిల్లా సాగునీటి సమస్యకు తుమ్మిడిహెట్టి ప్రాజెక్టే శాశ్వత పరిష్కారం అని, దీని ద్వారా ఎలాంటి మోటార్లు లేకుండానే నేరుగా కాల్వల ద్వారా 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని వివరించారు, ఈ ప్రాజెక్టు కడితే పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్ర పరిధిలో కేవలం 7 గ్రామాలు అంటే 2500 ఎకరాల భూమి మాత్రమే ముంపునకు గురవుతాయని, ఆ ముంపు భూములకు పూర్తి పరిహారం ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, దీనిపై అవసరమైతే తానే స్వయంగా ముంబై వెళ్లి మహారాష్ట్ర ముఖ్యమంత్రిని కలుస్తానని చెప్తూ, మన తెలంగాణ రైతుల ప్రయోజనాల కోసం రాజకీయాలు పక్కనబెట్టి మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈ ప్రాజెక్టు సాకారం అయ్యేలా చొరవ చూపాలని మరియు తెలంగాణకు మద్దతుగా నిలవాలని కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డికి, స్థానిక భారతీయ జనతా పార్టీ నాయకులకు, శాసనసభ్యులు శ్రీ పాల్వాయి హరీష్ బాబుకు పిలుపునిచ్చారు, అలాగే ధాన్యం కొనుగోళ్లపై ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 62 లిక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించిందని, ప్రస్తుత రబీ సీజన్‌లో మొత్తం 75 లక్షల క్వింటాళ్ల లక్ష్యంతో కొనుగోళ్లు జరుపుతూ నిధులను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తోందని తెలుపుతూ, కేంద్ర ప్రభుత్వం కొనుగోళ్లలో నిర్లక్ష్యం వీడి జూన్ 15 లోపు ధాన్యం కొనాల్సిందేనని, లేదంటే కేంద్రంపై యుద్ధం ప్రకటిస్తానని హెచ్చరిస్తూ, రైతుల ప్రయోజనాల కోసం, వాళ్ల హక్కుల కోసం అవసరమైతే నేను ప్రధానమంత్రి నరేంద్ర మోదీనైనా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డినైనా సరే ఎదిరిస్తా, ఎవ్వరినైనా లెక్కచేసే ప్రసక్తే లేదు అని గర్జించారు, ఎంత ధాన్యం వచ్చినా, అకాల వర్షాలకు తడిసినా సరే ప్రతీ గింజా మన ప్రభుత్వమే కనీస మద్దతు ధరతో కొంటుందని రైతులకు పూర్తి భరోసా ఇస్తూ, కృష్ణా మరియు గోదావరి నదీ జలాల్లో తెలంగాణకు రావాల్సిన ప్రతీ బొట్టు నీటి వాటాను కచ్చితంగా దక్కించుకుంటామని స్పష్టం చేసిన ఈ భారీ బహిరంగ సభకు బెల్లంపల్లి శాసనసభ్యులు శ్రీ గడ్డం వినోద్ గారు మరియు ఇతర కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరాగా, ఈ కార్యక్రమాన్ని గౌరవ ఆసిఫాబాద్ శాసనసభ్యురాలు శ్రీమతి కోవ లక్ష్మి గారు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు గారు, గౌరవ రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి ధనసరి అనసూయ (సీతక్క) గారు, గౌరవ రాష్ట్ర మంత్రి శ్రీ గడ్డం వివేక్ వెంకటస్వామి గారు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా శాసనమండలి సభ్యులు శ్రీ దండే విట్టల్ గారు, మంచిర్యాల శాసనసభ్యులు మరియు పౌరసరఫరాల సంస్థ చైర్మన్ శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు మాజీ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కొక్కిరాల విశ్వప్రసాద్ రావు గారు, ఆసిఫాబాద్ నియోజకవర్గ మాజీ ఎంమ్మెల్యే ఆత్రం సక్కు, ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీర శ్యామ్ నాయక్, మరియు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి ఆత్రం సుగుణక్క గారు దగ్గరుండి పర్యవేక్షించి, సమన్వయం చేసి వంద శాతం విజయవంతం చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
నగరంలో సమావేశమైన ఎర్రచందనం శ్రీగంధం పెంపకం రైతులు
విజయవాడ నగరంలో సమావేశమైన ఎర్రచందనం శ్రీగంధం చెట్ల పెంపకం రైతులు......    ...
By Rajini Kumari 2026-01-10 13:11:41 0 171
Telangana
మంచిర్యాల సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో విజిలెన్స్ అధికారుల తనిఖీ
మంచిర్యాల సబ్ రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ కార్యాలయంలో శుక్రవారం కరీంనగర్ విజిలెన్స్,...
By Avunoori Mahesh 2026-04-18 04:07:43 0 177
Business & Finance
Odisha Approves ₹42 Crore Fertiliser Support Scheme
The Odisha government has approved a ₹42 crore interest subvention scheme to strengthen...
By Navya Sree 2026-06-29 06:24:07 0 62
Andhra Pradesh
బాపట్ల జిల్లా అప్పికట్ల రోడ్డు నందు యర్ర కాలువ లో ఈతకు దిగి ప్రమాదవశాత్తు గల్లంతైన పీట వంశీ, వేటగిరి చందు ల మృతి బాధాకరం
  బాపట్ల మండలం: బాపట్ల మండలం అప్పికట్ల రహదారిలోని నాగరాజు కాలువలో ఇద్దరు యువకులు దుర్మరణం...
By Gadiyapudi Narendra 2026-02-24 17:02:29 0 193
Andhra Pradesh
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ.. 9 మందికి రూ.4.95 లక్షల ఆర్థిక సాయం అందజేసిన డా. గొట్టిపాటి లక్ష్మీ
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ.. 9 మందికి రూ.4.95 లక్షల ఆర్థిక సాయం అందజేసిన డా. గొట్టిపాటి...
By Chennaiah Kati 2026-07-02 03:30:28 0 42
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com