వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మల్లంపల్లి హై స్కూల్ విద్యార్థిని కావ్యశ్రీ కి ట్రిపుల్ఐటీ బాసరలో సీటు.....!

0
217

మల్లంపల్లి హై స్కూల్ విద్యార్థిని కావ్యశ్రీకి ట్రిపుల్ఎటీ బాసరలో సీటు.

 

భారత్ అవాజ్ న్యూస్: వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం జూన్ 1 రోజున దుగ్గొండి మండలం మల్లంపల్లి ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థిని జనగాం కావ్యశ్రీకు ప్రతిష్టాత్మక బాసర ట్రిపుల్ ఐటి విద్యాలయంలో సీటు వరించింది. ఇటీవల విడుదలైన పదోతరగతి పరీక్షలలో ప్రభుత్వ జిల్లా పరిషత్ హై స్కూల్ లలో జిల్లా టాపర్ గా కావ్యశ్రీ నిలిచింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్త ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ట్రిపుల్ ఐటి). ఇది భారతదేశంలో సాంకేతిక విద్యను అందించే ప్రతిష్టాత్మకమైన జాతీయ విద్యాసంస్థల సమూహం.రాజివ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ కళాశాల. తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లా, బాసర పట్టణంలో ఉన్న ఒక ప్రతిష్టాత్మక ప్రభుత్వ విశ్వవిద్యాలయం. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన సాంకేతిక విద్యను అందించడమే ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశ్యం.చిన్నారి కార్యశ్రీకి ప్రతిష్టాత్మక ప్రభుత్వ విశ్వవిద్యాలయంలో సీటు రావడం పట్ల తాతయ్య అమ్మమ్మ మల్లంపల్లి మాజీ సర్పంచ్ తడుక సువర్ణ కొమురయ్య గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. తమ పాఠశాల విద్యార్థిని జనగాం కావ్యశ్రీ పదోతరగతి పరీక్షలో జిల్లా టాపర్ గా నిలిచి మల్లంపల్లి పాఠశాలకు పేరు ప్రఖ్యాతలు తెచ్చిందని అన్నారు.నేడు బాసర ట్రిపుల్ ఐటీ కళాశాలలో సీటు సాధించడం గర్వకారణం అని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు భార్గవి అన్నారు.ఈ సందర్భంగా కావ్యశ్రీని అభినందించారు..

కావ్యశ్రీకి ప్రశంసల వెల్లువ..ఎస్ఎస్సి ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించి జిల్లా టాపర్ గా నిలిచి బాసర ట్రిపుల్ ఐటీ కళాశాలలో సీటు సాధించిన జనగాం కావ్యశ్రీకి అభినందనలు వెల్లువెత్తాయి.ప్రత్యక్షంగా పలువురు నాయకులు, అధికారులు, గ్రామస్తులు అభినందనలు తెలుపగా కొందరు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. నిరుపేద కుటుంబానికి చెందిన జనగాం కావ్యశ్రీ భవిష్యత్ లో ఉన్నత శిఖరాలను అధిగమించాలని పలువురు కోరారు.... దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము

Search
Categories
Read More
Andhra Pradesh
తగి న న్నీ బస్సులు లేక బస్ స్టాప్ లలో ప్రజల ఇక్కట్లు
విశాఖ కాంప్లెక్స్ నుండి మధుర వాడ వయా భీమిలి కి తగిన బస్సులు లేక ప్రజలు అల్లాడుతున్నారు. విశాఖ...
By Mobbu Venkatramana 2026-03-06 04:50:58 0 338
Telangana
“Section 30 of the Police Act to be in force across Vikarabad District till February 28” – District SP Smt. Sneha Mehra, IPS
Keeping in view the maintenance of law and order in Vikarabad District, District Superintendent...
By Terli Ashok 2026-02-04 11:20:46 0 849
Andhra Pradesh
పుంగనూరు: మహా కుంభాభిషేకంలో పాల్గొన్న పెద్దిరెడ్డి
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం, ఆరడిగుంట, చిన్నకొండ చారాలలో ఆదివారం శ్రీ పటాలమ్మ మహా కుంభాభిషేకం...
By Kothuru Murali 2026-05-03 16:41:40 0 149
Andhra Pradesh
ఉపాధి హామీ చట్టం రద్దు కేంద్రం కుట్ర రాష్ట్ర కార్యదర్శి సిపిఎం వి శ్రీనివాసరావు
For Scrolling : ఉపాధి హామీ చట్టం రద్దుకు కేంద్రం కుట్ర. తక్షణం ఉపసంహరించాలని సిపియం రాష్ట్ర...
By Rajini Kumari 2025-12-16 09:50:20 0 252
BMA
Ending News Fatigue: Deep Context Over Sensationalism
Audiences across the nation are increasingly suffering from chronic news fatigue caused by an...
By JoinBMA 2026-08-24 05:53:48 0 131
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com