కైతలాపూర్ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను స్థానిక నిరుపేదలు, విలేకరులకు కేటాయించాలి: ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

0
354

హైదరాబాద్, మే 30: కూకట్పల్లి నియోజకవర్గంలోని కైతలాపూర్‌లో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను స్థానిక నిరుపేద కుటుంబాలకు, అలాగే నియోజకవర్గానికి చెందిన పాత్రికేయులకు కేటాయించాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కోరారు.

శనివారం మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మనుచౌదరిని కలిసి ఎమ్మెల్యే వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇటీవల అమృత్‌నగర్ తండాకు చెందిన 62 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను కేటాయించినట్లు తెలిపారు.

మిగిలిన ఇళ్లను కైతలాపూర్ పరిసర ప్రాంతాల పేద, అర్హులైన కుటుంబాలకు కేటాయించడంతో పాటు, సొంత ఇళ్లు లేని పాత్రికేయులకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్‌ను కోరినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. సమాజానికి సేవలందిస్తున్న జర్నలిస్టుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వారికి కూడా గృహ వసతి కల్పించాలని సూచించినట్లు చెప్పారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పగడాల బాబురావు, డివిజన్ అధ్యక్షుడు ప్రభాకర్ గౌడ్, సీనియర్ నాయకుడు తులసిరావు తదితరులు పాల్గొన్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
Golden Fish: పశ్చిమగోదావరి జాలర్ల వలలో అరుదైన 'గోల్డెన్ ఫిష్'.. ఒకే వేటతో లక్షాధికారులైన మత్స్యకారులు.
పశ్చిమగోదావరి జిల్లా మత్స్యకారులను అదృష్టం వరించింది. అత్యంత అరుదుగా లభించే 'కచ్చిడి' చేపలు వారి...
By Pagadala Venkateswar 2026-03-23 06:09:23 0 324
Karnataka
Karnataka Advances Fisheries and Blue Economy Growth
Karnataka is strengthening its fisheries sector and advancing the Blue Economy through...
By Fathima Safa 2026-06-27 11:52:26 0 86
Andhra Pradesh
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన రాజంపేట టిడిపి అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు
ఈరోజు పీలేరు నందు నారా లోకేష్ బాబు జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ సీఎం రిలీఫ్ ఫండ్...
By Benguluri Madhubabu 2026-01-23 13:17:37 0 303
Telangana
ఓటరు సవరణ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలి ఆసిఫాబాద్ మున్సిపల్ చైర్మన్ ఆకాష్
🎤కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్  ప్రతినిధి జగదీష్  ఆసిఫాబాద్: పట్టణంలో ఓటరు...
By Chunarkar Jagadeesh 2026-06-26 03:36:05 0 196
Telangana
Telangana engineers day
తెలంగాణలో అనేక నీటిపారుదల ప్రాజెక్టులకు రూపకల్పన చేసి, చారిత్రక భవనాల నిర్మాణానికి మార్గదర్శకత్వం...
By G k Nookala 2026-07-11 06:31:33 0 129
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com