ఓటరు సవరణ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలి ఆసిఫాబాద్ మున్సిపల్ చైర్మన్ ఆకాష్

0
193

🎤కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్  ప్రతినిధి జగదీష్ 

ఆసిఫాబాద్: పట్టణంలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (SIR) కార్యక్రమాన్ని అత్యంత పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించాలని మున్సిపల్ చైర్మన్ ఆకాష్, వైస్ చైర్మన్ ఎండీ అహ్మద్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని దస్నాపూర్, హడుకో కాలనీలలో మున్సిపల్ బృందం, బూత్ స్థాయి సిబ్బందితో కలిసి వారు ఇంటింటికీ తిరుగుతూ ఓటర్ల నమోదు ప్రక్రియను ప్రత్యక్షంగా పరిశీలించారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ, అర్హత కలిగిన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ, పొరపాట్లకు తావులేకుండా అర్హుల పేర్లను చేర్చాలని, ఎవరి పేర్లూ అనవసరంగా తొలగించబడకుండా చూసే బాధ్యత సిబ్బందిపై ఉందన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు అత్యంత కీలకమైన ఆయుధమని, దీనిపై ప్రజలకు అవగాహన కల్పించడంలో రాజకీయ శ్రేణులు, సామాజిక కార్యకర్తలు చొరవ చూపాలని కోరారు. ఈ క్షేత్రస్థాయి పరిశీలనలో స్థానిక కౌన్సిలర్లు చిలువేరు వెంకటేశ్వర్లు, సాలం బిన్ అహ్మద్, బాలకృష్ణలతో పాటు వార్డు అధికారి మానుష, బీఆర్ఎస్ నాయకులు అశోక్, సాయి, బూత్ స్థాయి సిబ్బంది లక్ష్మి, భాగ్యలక్ష్మి మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగునూరు:పుంగనూరు పట్టణం లో అర్ధనారీశ్వరిగా దర్శనమిచ్చిన మారెమ్మ
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం శ్రీవిరుపాక్షి మారెమ్మ...
By Kothuru Murali 2026-02-15 07:52:48 0 214
Andhra Pradesh
అన్నమయ్య: ఇండక్షన్ స్టవ్‌ల వినియోగం తప్పనిసరి: కలెక్టర్.
అన్నమయ్య జిల్లాలోని 1,792 అంగన్వాడీ కేంద్రాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇండక్షన్ స్టవ్‌లు, వంట...
By Pagadala Venkateswar 2026-06-24 04:22:56 0 94
Andhra Pradesh
ఎన్టీఆర్ జిల్లా నీటి నాణ్యత విషయంలో రాజీ పడేది లేదు
*ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌* *ఎన్‌టీఆర్ జిల్లా, ఏప్రిల్ 08, 2026*  ...
By Rajini Kumari 2026-04-08 16:23:05 0 203
Andhra Pradesh
ఎర్నాకుళం వెళ్లే రైలులో అనకాపల్లి దగ్గర అగ్నిప్రమాదం ఒకరు మృతి రెండు ఏసీ బోగీలు దగ్ధం
*Train Fire: అనకాపల్లి దగ్గర రైలులో అగ్నిప్రమాదం.. రెండు ఏసీ బోగీలు దగ్ధం.. ఒకరు మృతి*  ...
By Rajini Kumari 2025-12-29 08:36:02 0 357
Andhra Pradesh
అంగరంగ వైభవంగా జరిగిన గొల్లపూడి అయ్యప్ప స్వామి వేడుకలు
విజయవాడ గొల్లపూడి అయ్యప్ప స్వామి పుట్టినరోజు సందర్భంగా గొల్లపూడి వాసులు అంగరంగ వైభవంగా కోలాటాల...
By Rajini Kumari 2025-12-27 14:57:30 0 260
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com