పదవి విరమణ పొందిన పోలీస్ అధికారులకు ఆత్మీయ వీడుకోలు

0
155

*ఎన్. టి. ఆర్ .జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయం, ఎన్. టి. ఆర్. జిల్లా.*

 

*పత్రికా ప్రకటన* *తేది.30.05.2026.*

 

*పదవీ విరమణ పొందిన పోలీస్ అధికారులకు ఆత్మీయ వీడ్కోలు*

 

*🔴సుదీర్ఘ కాలం క్రమశిక్షణతో, బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి, పదవి వీరమణ పొందడం అభినందనీయం.*

*🔴ఇన్ని రోజులు చట్టాలకు అనుగుణంగా విధులు నిర్వహించారు, మనమంతా ఒకే పోలీసు కుటుంబం.*

*🔴పోలీసు డిపార్ట్మెంట్ లో ప్రజా సేవకే మీ సమయం, శక్తి అన్ని వినియోగించినందుకు డిపార్ట్మెంట్ తరపున ధన్యవాదాలు.... అడ్మిన్ డి.సి.పి. శ్రీమతి కె.జి.వి.సరిత ఐ.పి.ఎస్. గారు.*

 

*🔴ఎన్.టి.ఆర్.జిల్లా నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించి, కర్తవ్య నిర్వహణలో చిత్తశుద్ది, అంకిత భావంతో పోలీస్ శాఖ ద్వారా ప్రజలకు విశిష్ట సేవలందించి ది.31.05.2026 తేదిన పదవీ విరమణ చేస్తున్న (14) పద్నాలుగు మంది పోలీస్ అధికారులకు ఈ రోజు పోలీస్ కమీషనర్ వారి కార్యాలయం నందు పోలీసు కమిషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. గారి ఆదేశాల మేరకు అడ్మిన్ డి.సి.పి. శ్రీమతి కె.జి.వి. సరిత ఐ.పి.ఎస్. గారు, ఇతర పోలీస్ అధికారులతో కలిసి సుదీర్ఘకాలం పాటు పోలీస్ శాఖ ద్వారా ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించినందుకు గాను పదవీ విరమణ చేసిన అధికారులను అభినందించి పోలీస్ మర్యాదలతో శాలువాలతో సత్కరించి ఆత్మీయ వీడ్కోలు పలికినారు.*

 

*పదవీవిరమణ పొందిన వారి వివరాలు :*

*క్ర.సం* *పేరు* *హోదా* *విధులు నిర్వహణ*

(1) శ్రీ జి.వి.నరసింహారావు గారు, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సి.టి.సి.

 

(2) శ్రీ ఎస్ ఫ్రాన్సిస్ గారు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎస్.ఆర్.పేట పి.ఎస్.

 

(3) శ్రీ ఎన్.వీరాంజనేయులు గారు, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఒన్ ట్రాఫిక్ పి.ఎస్.

 

(4) శ్రీ బి.పైడేశ్వర రావు గారు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, సి.ఎస్.బి..

 

(5) శ్రీమతి ఎం. ప్రేమలత గారు మహిళా సబ్ ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్ మహిళా పి.ఎస్.

 

(6) శ్రీమతి ఎం.విజయ కుమారి గారు మహిళా సబ్ ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్ పి.సి.ఆర్.

 

(7) శ్రీ వి.దుర్గా ప్రసాదరావు గారు రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్, సి.ఎ.ఆర్..

 

(8) శ్రీపి.సుకుమార్ గారు, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్ సి.ఎ.ఆర్.

 

(9) శ్రీమతి జె.పద్మ గారు సుపరిండేంట్ సి.పి.ఓ. 

(10) శ్రీ జి.బాబ్జి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్ 5వ ట్రాఫిక్ పి.ఎస్.

 

(11) శ్రీ ఎ.వి.ఎస్.సుబ్బరాజు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్ సి.సి.ఎస్.

 

(12) శ్రీమతి షేక్ హెచ్.ఎస్.వర మహిళా అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్ సి.సి.ఆర్.బి.

 

(13) శ్రీ షేక్ గౌస్ రిజర్వ్ హెడ్ కానిస్టేబుల్ సి.ఎ.ఆర్.

 

(14) శ్రీమతి కె.మార్తమ్మ స్కావెంజర్ సి.ఎ.ఆర్. 

 

*🔴ఈ సంధర్భంగా డి.సి.పి. గారు మాట్లాడుతూ... పధవీ విరమణ చేస్తున్న పోలీస్ అధికారులకు మరియు వారి కుటుంబ సభ్యులకు ధన్యవాధములు తెలియజేశారు. ఈ నేపధ్యంలో వారి కుటుంబ సభ్యులను ఆత్మీయంగా పలకరించి వారి యోగక్షేమాల గురించి తెలుసుకున్నారు. వారితో మాట్లాడుతూ ఇప్పటి వరకు 24 గంటలూ ఉద్యోగ వీధి నిర్వహణలో బాగంగా చాలా బిజీగా గడిపారు. ఆరోగ్యమే మహాభాగ్యం అని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా జీవించాలని తెలియజేశారు.* 

 

 *🔴ఈ కార్యక్రమంలో అడ్మిన్ డి.సి.పి.శ్రీమతి కె.జి.వి.సరిత ఐ. పి. ఎస్. గారితోపాటు, క్రైమ్ ఎ.డి.సి.పి. శ్రీ ఎం.రాజారావు గారు, ఏ.ఓ.శ్రీమతి సునీత గారు, ఏ.ఆర్.ఏ.సి.పి. ప్రేమ్ కుమార్, ఆర్.ఐ.లు శ్రీ శ్రీనివాసరావు గారు, శ్రీ సురేశ్ రెడ్డి గారు, శ్రీ శ్రీకాంత్ గారు, ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ ఎం. సోమయ్య, అసోసియేషన్ సంఘ సభ్యులు మరియు అధికారులు, సి.పి.ఓ. సిబ్బంది, పోలీస్ కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.*

****

Search
Categories
Read More
Andhra Pradesh
అమరజీవి పొట్టి శ్రీరాములు కి ఘన నివాళులర్పించిన మాజీ మంత్రి వెల్లంపల్లి ఎమ్మెల్సీ రుహుళ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి
విజయవాడ 15-12-2025   ప్రచురణార్ధం   అమరజీవి పొట్టిశ్రీరాములుకి ఘన నివాళులర్పించిన...
By Rajini Kumari 2025-12-15 07:25:36 0 421
BMA
Campus Crackdowns: Censoring the Next Generation of Press
Student journalists at universities are facing unprecedented retaliation and censorship from...
By JoinBMA 2026-08-19 11:00:27 0 142
Andhra Pradesh
AP Teachers: ఏపీ టీచర్లకు కొత్త అటెండెన్స్ రూల్స్.. ఇక నిమిషం ఆలస్యమైనా 'లేట్'.
ఉదయం 9 గంటలలోపు పాఠశాలలకు హాజరు తప్పనిసరి హాఫ్-డే లీవులు, ఔట్-టైమ్‌పైనా కఠినమైన రూల్స్ జారీ...
By Pagadala Venkateswar 2026-03-02 03:29:41 0 218
Andhra Pradesh
సిటిఎం చెరువు గట్టున మృత శిశువు కలకలం.
మదనపల్లె మండలం సీటీఎం చెరువు గట్టు వద్ద బుధవారం ఒక బాలుడి మృతదేహం లభ్యం కావడంతో తీవ్ర కలకలం...
By Pagadala Venkateswar 2026-05-14 05:54:28 0 127
West Bengal
Citizens Voice Grievances at CM's Second Janata Darbar
West Bengal Chief Minister Suvendu Adhikari held his second Janata Darbar today at the state BJP...
By Dunna Jessicaruth 2026-05-25 11:16:30 0 558
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com