గుడివాడలో టిడిపి మహానాడు గ్రాండ్ సక్సెస్

0
126

*గుడివాడలో టిడిపి హైబ్రిడ్ మహానాడు గ్రాండ్ సక్సెస్...*

 

*10 క్లస్టర్లలో ఉత్సాహంగా పాల్గొన్న పార్టీ శ్రేణులు*

 

*రెండు రోజుల మహానాడులో....17,323మంది కార్యకర్తల ఆన్లైన్ అటెండెన్స్....సాధారణ ప్రజానికం అదనం*

 

*ఐఎంఏ హాల్లో ముగింపు వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వెనిగండ్ల రాము....*

 

*రెండు రోజుల మహానాడును విజయవంతం చేసిన నాయకత్వానికి అభినందనలు*

 

*కొడాలి నాని కోరలు పీకిన పాము.. ప్రజల్లోకి రా తేల్చుకుందాం...ఎమ్మెల్యే రాము సవాల్*

 

*గత పాలకుల మాదిరి అరాచకాలు, కబ్జాలు చెయ్యట్లేదు.. గుడివాడ అభివృద్ధే నా లక్ష్యం" - ఎమ్మెల్యే రాము*

 

గుడివాడ:గుడివాడ నియోజకవర్గంలో టిడిపి హైబ్రిడ్ మహానాడు విజయవంతంగా ముగిసింది. పది క్లస్టర్లలో నిర్వహించిన మహానాడులో టిడిపి కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. 

 

గుడివాడ సత్యనారాయణపురంలోని ఐఎంఏ హాల్లో జరిగిన ముగింపు వేడుకల్లో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పాల్గొన్నారు. రెండు రోజులపాటు జరిగిన మహానాడు విజయవంతం చేసిన పార్టీ నాయకత్వాన్ని ఆయన అభినందించారు.

 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ... చంద్రబాబు చెప్పినట్లు క్లస్టర్ స్థాయిలో కొత్తగా బాధ్యతలు ఇస్తారని, సమష్టి కృషితో విజయం సాధించామని, ఈ స్ఫూర్తిని కొనసాగిద్దామని పిలుపునిచ్చారు. మహానాడులో చంద్రబాబు, లోకేష్, పార్టీ పెద్దలు చెప్పిన మాటలను ఆచరిస్తామని చెప్పారు.రెండు రోజుల మహానాడులో.... నియోజకవర్గ వ్యాప్తంగా 17,323మంది సభ్యత్వ కార్డులు కలిగిన కార్యకర్తల ఆన్లైన్ అటెండెన్స్ నమోదయిందని....సాధారణ ప్రజానికం హాజరు అదనమని ఎమ్మెల్యే రాము తెలిపారు.

 

 

కొడాలి నానిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన ఎమ్మెల్యే రాము..పనికి మాలిన కొడాలి నాని మళ్లీ వచ్చాడనీ, ఈపాటికి జైలుకు వెళ్లసిందనీ,రోగంతో ఉన్నాడని చూసి చూడనట్లు పట్టించుకోక పోతే ఇప్పుడు పిచ్చివాగుడు లాగుతున్నాడనీ మండిపడ్డారు. చంద్రబాబు స్థాయి గురించి మాట్లాడే అర్హతగా ఉందా? వాడు కోరలు పీకిన పాము అని విమర్శించారు.

 

గత పాలకుల మాదిరి మనం అరాచకాలు, కబ్జాలు చెయ్యట్లేదనీ,జూద క్రీడలను ప్రోత్సహించడం లేదనీ, ప్రజలకు మంచి చెయ్యడం, గుడివాడ అభివృద్ధి నా లక్ష్యమని పేర్కొన్నారు.మనం చేస్తున్న అభివృద్ధి పవర్ ఫుల్ వెపన్ అని రానున్న రోజుల్లో ఎన్నో అభివృద్ధి పనులను ప్రజలకు చూపిస్తాను" అని ఎమ్మెల్యే రాము స్పష్టం చేశారు.

 

గుడివాడ శుభ్రతకు చేపట్టిన ప్రాజెక్ట్‌ను ప్రభుత్వం కూడా అభినందించిందన్నారు.,సాంకేతికంగా పార్టీ యాప్‌ల ద్వారా చంద్రబాబు, లోకేష్, తనతో మాట్లాడవచ్చని ఎమ్మెల్యే తెలిపారు.

 

ఈ కార్యక్రమంలో పట్టణ టిడిపి అధ్యక్షుడు పండ్రాజు సాంబయ్య,సీనియర్ నాయకులు లింగం, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు నేరుసు కాశి,పార్టీ నాయకులు యార్లగడ్డ సుధారాణి, షేక్ జానీ,పొట్లూరి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
"మారేడ్‌పల్లి పీఎస్‌లో ‘Arrive Alive’.. డీసీపీ శ్రీధర్ గోల్డెన్ అవర్ ప్రాధాన్యం”
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలను కాపాడటంలో ‘గోల్డెన్ అవర్’...
By Sidhu Maroju 2026-04-17 09:00:40 0 326
Sikkim
Sikkim Celebrates Historic 50th Statehood Day
Sikkim is celebrating its historic 50th Statehood Day today, marking five decades since its...
By Dunna Jessicaruth 2026-05-16 04:46:11 0 125
Telangana
ఆసిఫాబాద్‌ పట్టణం దశ్నపూర్ లో అగ్నిప్రమాదం బాధితులకు తక్షణ ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే కోవ లక్ష్మి
🎤కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్  జూన్ 04: కొమురం భీం ఆసిఫాబాద్...
By Chunarkar Jagadeesh 2026-06-04 10:49:48 0 432
SURAKSHA
Administrative Excellence: The Inspiring Journey of Michael M. D’Souza
Blueprint of Integrity: How IAS Officer Michael M. D’Souza is Shaping Governance and Public...
By Kalaga Sailaja 2026-07-28 06:43:27 0 287
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com