"అల్వాల్‌లో 33 ఏళ్ల వ్యక్తి అదృశ్యం.. లుక్ అవుట్ నోటీసు జారీ.|

0
482

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని అల్వాల్ పోలీస్ స్టేషన్‌లో ఓ వ్యక్తి అదృశ్యమైన ఘటన నమోదైంది. 

పోలీసులు విడుదల చేసిన లుక్‌అవుట్ నోటీసు ప్రకారం పొట్టబత్తిని ఇళయరాజా (33) అనే వ్యక్తి ఈ నెల 27వ తేదీ ఉదయం నుంచి కనిపించకుండా పోయాడు. 

ఈ ఘటనపై అల్వాల్ పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఇళయరాజా భార్య గండూరి ప్రశాంతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు అయింది. 

ఆమె తన పిల్లలతో కలిసి స్కూల్ సెలవుల కారణంగా ఈ నెల 25న తన తల్లి ఇంటికి వెళ్లినట్లు తెలిపింది. అనంతరం 26వ తేదీ రాత్రి భర్తతో ఫోన్‌లో మాట్లాడినట్లు పేర్కొంది.

అయితే 27వ తేదీ ఉదయం భర్త ఉద్యోగానికి హాజరుకాలేదని కార్యాలయం నుంచి సమాచారం రావడంతో ఇంటికి చేరుకుని చూడగా, ఇంట్లో నుంచి కొన్ని బట్టలు మరియు మొబైల్ ఛార్జర్ తీసుకుని వెళ్లిపోయినట్లు గుర్తించినట్లు తెలిపింది.

అతని మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్‌లో ఉండటంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. 

దీంతో పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.

ఇళయరాజా ఎత్తు సుమారు 5 అడుగుల 5 అంగుళాలు, గోధుమ వర్ణం, నల్ల జుట్టు, గుండ్రటి ముఖాకృతి కలిగి ఉన్నట్లు పోలీసులు వివరించారు. 

లోత్కుంట, ఆదర్శ్ నగర్ ప్రాంతానికి చెందిన ఆయన ఆచూకీ తెలిసిన వారు అల్వాల్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

#Sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
నందిగామ మండల కార్యాలయంలో MSME రుణాలపై అవగాహన సదస్సు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనలతో నందిగామ మండల...
By Patan Khuddus 2026-06-25 18:38:19 0 238
Andhra Pradesh
నిమ్మనపల్లిలో ట్రాక్టర్‌పై నుంచి పడి మహిళకు తీవ్ర గాయాలు.
నిమ్మనపల్లి మండలంలో శుక్రవారం ఉదయం ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌పై నుంచి పడిపోయి ఓ మహిళ తీవ్రంగా...
By Pagadala Venkateswar 2026-05-22 12:38:39 0 212
Telangana
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటనకు సర్వం సిద్ధం: ట్రాఫిక్ ఆంక్షలు, పార్కింగ్ జోన్లపై జిల్లా ఎస్పీ నితికా పంత్ కీలక ఆదేశాలు!
🎤కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో...
By Chunarkar Jagadeesh 2026-05-31 09:46:33 0 723
Andhra Pradesh
కొమరాడలో తిష్ట వేసిన ఏనుగుల గుంపు
కొమరాడ మండలంలో కొద్ది రోజులుగా ఎనిమిది అడవి ఏనుగుల గుంపు తిష్ట వేసి రైతులకు కంటిమీద కునుకు...
By Boiena Rajesh 2026-09-07 06:13:22 0 87
Uttarkhand
Uttarakhand Strengthens Agriculture and Horticulture
Uttarakhand continues to strengthen its agriculture and horticulture sectors through initiatives...
By Fathima Safa 2026-06-27 07:40:36 0 88
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com