నందిగామ మండల కార్యాలయంలో MSME రుణాలపై అవగాహన సదస్సు

0
238

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనలతో నందిగామ మండల కార్యాలయంలో MSME ఆధ్వర్యంలో చేతివృత్తుల కార్మికులు, డ్వాక్రా మహిళలకు సబ్సిడీతో కూడిన రుణాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సదస్సులో లబ్ధిదారులకు వివిధ రకాల MSME రుణ పథకాల వివరాలు, అర్హతలు, దరఖాస్తు ప్రక్రియపై పూర్తి అవగాహన కల్పించారు. అనంతరం అర్హులైన సభ్యుల నుంచి రుణాల కోసం దరఖాస్తులు స్వీకరించి పూర్తి చేయించారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ టీవీ టెక్నీషియన్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షులు ఎం.ఏ. పాషా మాట్లాడుతూ, MSME ద్వారా చేతివృత్తుల వారు ఎటువంటి తాకట్టు లేకుండా రుణాలు పొందే విధానం, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, సబ్సిడీ వివరాలు, స్వయం ఉపాధి అవకాశాల గురించి వివరించారు.MSME ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్ రవికుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో చేతివృత్తుల కార్మికులు, డ్వాక్రా మహిళలు, ఇతర లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
మంచిర్యాల: మెడికల్ షాపులు బంద్
దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు బంద్ భాగంగా ప్రజలు తమకు సహకరించాలని మంచిర్యాల్ మెడికల్ డ్రాగెస్ట్...
By Bonagiri RaviShankar 2026-05-20 04:38:22 0 205
Jharkhand
Jharkhand Agricultural Growth and Farmer Support Plans
Jharkhand is advancing agricultural development through a range of farmer support initiatives...
By Fathima Safa 2026-06-24 09:37:23 0 189
BMA
Protest Violence: Journalists Face Assaults and Arrests
News footage continuously captures a terrifying reality for field reporters covering...
By JoinBMA 2026-08-19 10:08:31 0 74
Andhra Pradesh
విద్యార్థి సంఘాల నాయకులను అవమానించిన గోనెగండ్ల ఫిజికల్ డైరెక్టర్ జాకీర్ హుస్సేన్ సస్పెండ్ చేయాలి డిమాండ్ చేశారు డిమాండ్ చేశారు
విద్యార్థి సంఘాల నాయకులు పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసి,కులంతో అవమాన పరిచిన ZPHS గోనెగండ్ల ఫిజికల్...
By Boya Dasthagiri 2026-06-18 16:06:55 0 182
Andhra Pradesh
పది పరీక్షల్లో గుంటూరు జిల్లా నుంచే స్టేట్ టాపర్‌లు రావాలని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా గారు, ఐ.ఏ.ఎస్. పిలుపునిచ్చారు.
గుంటూరు, జనవరి 22 : పది పరీక్షల్లో గుంటూరు జిల్లా నుంచే స్టేట్ టాపర్‌లు రావాలని జిల్లా...
By John Baji 2026-01-22 11:02:43 0 269
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com