నిజామాబాద్

0
137

నిజామాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరం లో శ్రీ లక్ష్మి కల్యాణ మండపం లో నిర్వహించిన సర్వసభ్య సమావేశం మరియు విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిగాల గారు పాల్గొన్నారు.ఈ సందర్భంగా విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేసి అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ఆర్యవైశ్య మహా సభ అధ్యక్షులు శ్రీ అమరవాది లక్ష్మి నారాయణ గారు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిగాల గారు మాట్లాడుతూ, జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో విద్యార్థులను ప్రోత్సహించే విధంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ముఖ్యంగా జిల్లా అధ్యక్షులు శ్రీ పోల విఠల్ రావు గుప్తా గారు ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు పురస్కారాలు అందజేసి వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తున్నందుకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.విద్య అనేది ప్రతి మనిషి జీవితంలో అత్యంత ముఖ్యమైనదని ఆయన పేర్కొన్నారు. తాను కూడా మాక్లూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని సివిల్ ఇంజనీర్‌గా ఎదిగి, అనంతరం వివిధ వ్యాపారాలు నిర్వహిస్తూ రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. ప్రజల ఆశీర్వాదంతో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యేగా పదేళ్లు సేవ చేసే అవకాశం దక్కిందన్నారు.గత 25 సంవత్సరాలుగా తమ కుటుంబం మాక్లూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో ప్రతిభ కనబర్చిన వారికి ప్రోత్సాహకాలు అందిస్తున్నామన్నారు. వైశ్య సమాజానికి సేవా దృక్పథం సహజసిద్ధమని, అదే భావంతో తమ కుటుంబ సభ్యులు చదువుకున్న పాఠశాల శిథిలావస్థలో ఉండటాన్ని చూసి బాధపడ్డానన్నారు.తమ తాతగారు శ్రీ బిగాల గంగారం గారి పేరుపై ప్రైమరీ స్కూల్, తండ్రి శ్రీ బిగాల కృష్ణమూర్తి గారి పేరుపై హై స్కూల్ నిర్మించి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువచ్చామని వివరించారు.

డబ్బును ఎవరైనా దోచుకోవచ్చని, కానీ విద్యను మాత్రం ఎవరూ దోచుకోలేరని పేర్కొన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, విద్య ద్వారానే వ్యక్తి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోగలడని మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల గారు అన్నారు.                   ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ గారు,ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గారు, ఆగీర్ వెంకటేష్ గారు,రేణుకుంట గణేష్ గారు, ఇరుకుల రామకృష్ణ గారు,చింతల రవికుమార్ గారు,మోటూరి మురళి గారు,పోల సుధాకర్ గారు,మంకాళి విజయ్ గారు, బచ్చు రామ్ గారు, బచ్చు అంజయ్య గారు, చిదుర ప్రదీప్ గారు, నీల భాస్కర్ గారు,కందకుర్తి రామకృష్ణ గారు,తాటి వీరేశం గారు, చిదుర మాణిక్యం గారు,గజవాడ హనుమంత్ రావు గారు,కసుబ సంపత్ గారు,కాలభైరవ శ్రీనివాస్ గారు, గర్పల్లి ప్రవీణ్ గారు తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
శీర్షిక: కొత్తపల్లిలో కొలువుదీరిన నూతన పాలకవర్గం.. సర్పంచ్‌గా మున్నూరు చెన్నయ్య ప్రమాణ స్వీకారం
శీర్షిక: కొత్తపల్లిలో కొలువుదీరిన నూతన పాలకవర్గం.. సర్పంచ్‌గా మున్నూరు చెన్నయ్య ప్రమాణ...
By Vanmoj Suryamohan 2025-12-22 17:00:14 0 735
Andhra Pradesh
ప్రతి బీఎల్‌ఓ బాధ్యతాయుతంగా పనిచేయాలి: రామసముద్రం ఎంపీపీ
రామసముద్రంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను వైఎస్ఆర్సిపి మండల ఎంపీపీ...
By Pagadala Venkateswar 2026-07-07 04:30:35 0 129
SURAKSHA
Priyanka Ala, IAS: A Visionary Leader Driving Good Governance
Committed to Transparent Administration, Citizen-Centric Governance, and Sustainable Development...
By Lokeshwari Panthadi 2026-07-10 11:16:07 0 140
Madhya Pradesh
Madhya Pradesh Promotes Religious Tourism and Heritage
Madhya Pradesh continues to enhance religious tourism and heritage conservation by developing...
By Fathima Safa 2026-06-30 08:27:06 0 94
BMA
Tripura Media Targeted by Non-State Actors
Tripura consistently ranks among the highest in the country for physical attacks on journalists...
By JoinBMA 2026-08-19 08:57:06 0 82
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com