ప్రియుడే హంతకుడా.....? దుగ్గొండి మండలంలో వివాహిత దారుణం హత్య కేసు కొలిక్కి....

0
179

ప్రియుడే హంతకుడా..?

దుగ్గొండి మండలంలో వివాహిత దారుణ హత్య కేసు కొలిక్కి..

ప్రేమ వ్యవహారమే ఘోరానికి దారితీసిందన్న కోణంలో పోలీసుల విచారణ..

మృతురాలి సామాజిక వర్గం నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు..

కీలకమైన కాల్ డేటా, ఘటనా స్థల ఆధారాలతో నిందితుడి గుర్తింపు..

అధికారుల అధికారిక నివేదిక రాగానే నేడో రేపో రిమాండ్‌కు  తరలింపు...

భారత్ అవాజ్ న్యూస్:. దుగ్గొండి : మండలంలోని లక్ష్మీపురం శివారులో చోటుచేసుకున్న వివాహిత హత్య కేసు దర్యాప్తు కీలక మలుపు తిరిగినట్లు సమాచారం. ఈ కేసులో మృతురాలికి సన్నిహితంగా ఉన్న వ్యక్తినే పోలీసులు ప్రధాన అనుమానితుడిగా గుర్తించినట్లు తెలిసింది. ప్రేమ వ్యవహారమే హత్యకు దారితీసి ఉండొచ్చన్న కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. లక్ష్మీపురం గ్రామానికి చెందిన తాళ్లపెల్లి సుమలత హత్య కేసులో ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు, ప్రధాన నిందితుడిగా భావిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఘటన జరిగిన ప్రాంతంలో సేకరించిన ఆధారాలు, కాల్ డేటా, స్థానికుల వాంగ్మూలాల ఆధారంగా కేసును ఛేదించినట్లు తెలుస్తోంది....

 

అట్రాసిటీ సెక్షన్ల నమోదుకు సన్నద్ధం...!

మృతురాలు ఎస్సీ వర్గానికి చెందిన మహిళ కావడంతో కేసులో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కూడా కేసు నమోదు చేసే అంశంపై పోలీసులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి సంబంధిత రెవెన్యూ అధికారుల నివేదిక కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిసింది. బాధితురాలి సామాజిక వర్గానికి సంబంధించిన ధృవీకరణ పత్రాలు మరియు నివేదిక అందిన వెంటనే అట్రాసిటీ సెక్షన్లు చేర్చే అవకాశం ఉందని ఉన్నతాధికారుల ద్వారా సమాచారం అందుతోంది. ఇక పోలీసుల అదుపులో ఉన్న ప్రధాన నిందితుడిని నేడో రేపో న్యాయస్థానంలో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలను, నిందితుడి వివరాలను పోలీసులు త్వరలోనే అధికారికంగా వెల్లడించాల్సి ఉంది... దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము...

Search
Categories
Read More
Telangana
ఇంధన నిల్వల పై భయం వద్దు
పెట్రోల్ , డీజిల్ , కొరతతో రాష్ట్ర వ్యాప్తంగా వాహన దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్న ...
By Dodla Nagaraju 2026-03-25 07:42:07 0 549
Jammu & Kashmir
Apple Orchards in Ruins: Hailstorms Decimate Kashmir’s Fruit Economy
A catastrophic wave of unseasonal rain and severe hailstorms has ravaged the horticulture...
By Dunna Jessicaruth 2026-05-14 07:41:12 0 191
Telangana
త్వరలో అందుబాటులోకి అల్వాల్ టిమ్స్ హాస్పిటల్ ఎమ్మెల్యే శ్రీ గణేష్
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: అల్వాల్ టిమ్స్ హాస్పిటల్ నిర్మాణ పనులను బుధవారం కంటోన్మెంట్ ఎమ్మెల్యే...
By Sidhu Maroju 2025-10-08 11:20:10 0 286
Telangana
కొత్త కమ్యూనిటీ హాల్ నందు పింఛన్ పంపిణీ
చిలుకూరు  గ్రామంలోని వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు పెన్షన్ తీసుకొనుట కొరకు...
By Nookapangu Manikanta 2026-04-29 11:05:23 0 191
Andhra Pradesh
నల్లచెరువు MRCలో 31 మంది జాతీయ నాయకుల చిత్రపటాల అందజేత
భారత్ ఆవాజ్ న్యూస్: నల్లచెరువు మండల విద్యా వనరుల కేంద్రం (MRC) ఆధునీకరణ పనులు పూర్తికావడంతో...
By Vinod Kumar 2026-09-11 12:49:49 0 179
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com