కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: కాగజ్ నగర్ ఎక్స్ రోడ్డు వద్ద "జూన్ 2న సీఎం రేవంత్ రెడ్డి గారి, జిల్లా పర్యటనను విజయవంతం చేయాలి" డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క

0
740

🎤కొమురం బీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్): తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారు, జూన్ 2వ తేదీన కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనను అత్యంత విజయవంతం చేయాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క పిలుపునిచ్చారు.శుక్రవారం కెరమెరి మండలం కేస్లాగూడ గ్రామంలో గ్రామ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు,మరియు కార్యకర్తలతో ఆమె ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సీఎం పర్యటన ఏర్పాట్లపై నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సుగుణక్క మాట్లాడుతూ.. జూన్ 2న కాగజ్‌నగర్ ఎక్స్ రోడ్డు వద్ద నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, జిల్లాకు సంబందించిన పలు కీలక అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. ఈ సభకు ప్రతి గ్రామ పంచాయతీ నుండి ప్రజలు, రైతులు, మహిళలు మరియు కాంగ్రెస్ శ్రేణులు సమష్టిగా కృషి చేసి పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు.సమావేశంలో పాల్గొన్న ప్రముఖులు: తులసిరాం, బాపూరావ్, కెరమెరి ఉప సర్పంచ్ వాగ్మారే శ్రీకాంత్, అమూల్, బలిరాం, కాంగ్రెస్ నాయకులు రాథోడ్ శంకర్ నాయక్, రాథోడ్ సుదర్శన్, కోవ ఇందిరా, రాథోడ్ శంకర్ నాయక్, మందాడే విశ్వనాథ్, నాగేష్, గిడ్డప్ప, మురళి, జగన్నాథ్ రావు, చౌహాన్ శంకర్, కేశవ్, చాహకటి జంగు, భీంరావు, ఆత్రం ఆనంద్ రావు తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
గంజాయి గుట్టురట్టు: నలుగురు ముఠా సభ్యుల అరెస్ట్.
మదనపల్లె పరిసరాల్లో గంజాయి సరఫరా చేస్తున్న ముఠా గుట్టును శనివారం పోలీసులు రట్టు చేశారు. ఈ కేసులో...
By Pagadala Venkateswar 2026-04-11 12:53:56 0 168
Telangana
రైతులు సోలార్ విద్యుత్ ను ఉపయోగించుకోవాలి
చిలుకూరు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ద్వారా అందించే విద్యుత్ ను రైతులు ఉపయోగించుకోవాలని కోదాడ ఏడిఈ...
By Nookapangu Manikanta 2026-05-07 12:56:15 0 146
Andhra Pradesh
ప్రభుత్వ వైద్య కళాశాల మహిళా హాస్టల్ వసతి గృహం ప్రారంభం
విజయవాడ   సిద్ధార్ధ ప్రభుత్వ వైద్య కళాశాలలో విద్యార్ధినులకు, సీనియర్ రెసిడెంట్ మహిళా...
By Rajini Kumari 2025-12-23 10:14:48 0 249
West Bengal
CM Suvendu Adhikari Begins Maiden North Bengal Tour
In his first official visit to North Bengal since taking oath as Chief Minister on May 9, Suvendu...
By Dunna Jessicaruth 2026-05-20 10:31:41 0 134
Telangana
నిజామాబాద్:41 వ డివిజన్ లో ఘనంగ అంబెత్కర్ జయతి వేడుకలు
 నిజామాబాద్:41డివిజాన్ కార్పోరేటర్ ప్రావింగౌడ్ గరి అధ్వర్యమ్లో అంబెత్కర్ 135 వ జయంతి ఘనంగా...
By Sadaq Sadaq 2026-04-14 11:13:29 0 248
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com