కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(యూ)మండలంలో నకిలీ పత్తి విత్తనాల ముఠా బట్టబయలు 5.45 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం ఇద్దరూ నిందితులపై కేసు నమోదు

0
1K

🎤కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్, 

జిల్లాలో నకిలీపత్తి విత్తనాల అక్రమ రవాణా, విక్రయాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతున్న నేపథ్యంలో సిర్పూర్ (యూ) పోలీస్ స్టేషన్ సమీపంలో నిర్వహించిన.వాహన తనిఖీల్లో 5.45 క్వింటళ్ల నకిలీవణి భావిస్తున్నా పత్తి విత్తనాలు.స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ నితిక పంత్ తెలిపారు.శుక్రవారం సిర్పూర్ (యూ) పోలీస్ స్టేషన్ సమీపంలో ఎస్సై విక్రమ్. తన సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించారు.వారి వద్ద నుంచి మొత్తం.68 కిలోల (152 ప్యాకెట్ల) పత్తి విత్తనాలు లభించాయి.ఒక్కో ప్యాకెట్ లో సుమారు 450 గ్రాముల చొప్పున విత్తనాలు ఉండగా వాటిపై ప్రభుత్వ ఆమోదిత వివరాలు,క్యూఆర్ కోడ్, హాలోగ్రామ్,లాట్ నెంబర్ వంటి గుర్తింపులు లేకపోవడం గమనించారు.దీంతో వెంటనే వ్యవసాయ శాఖ అధికారి (AO)ఆనందరావుకు సమాచారం అందించగా,ఆయన స్వయంగా పరిశీలించి వాటిని నకిలీ పత్తి విత్తనాలుగా నిర్ధారించారు. అనంతరం పోలీసులు చట్టభద్ధంగా సాక్షుల సమక్షంలో "పంచనామ" నిర్వహించి కేసు నమోదు చేశారు.ఈ కేసుపై ఆసిఫాబాద్  సబ్ డివిజన్ డిఎస్పి అశోక్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టాగా.గత రెండు నెలలుగా సిర్పూర్ మండల పరిధిలో సుమారు 6.75 క్వింటళ్ల నకిలీ పత్తి విత్తనాలను లాభాపేక్షణతో రైతులకు సరఫరా చేయాలని తీసుకురాగా నిందితుడు నైతం జంగు ఇంటి వద్ద మరో (1100 ప్యాకెట్స్) 4.90 క్వింటళ్ల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకోగా మొత్తం  5.45 కింటాళ్ళ నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం పరచుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.

పోలీసులు వెల్లడించిన కేసులో నిందితుల వివరాలు:

A1) మంగునాథ్ సుమంధరనాథ్, వయస్సు:64 సంవత్సరాలు,వృత్తి: వ్యాపారం నివాసం: జూనాపాని మధ్యప్రదేశ్ ప్రస్తుతం: ఇంద్రవెల్లి.ఆదిలాబాద్ జిల్లా. A2) నైతం జంగు S/o నానాజీ వయసు: 40 సంవత్సరాలు, వృత్తి: మేస్త్రి.నివాసం: సిర్పూర్ యూ, కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా. 

 A1,A2 లను అరెస్టు చేసి రిమాండ్ పంపిస్తున్నట్లు తెలిపారు.ఈ నకిలీ విత్తనాలు పట్టుకోవడంలో కృషి చేసిన డిఎస్పి అశోక్, ఎస్సై విక్రమ్కా,నిస్టేబుల్ నాగేంద్రబాబు, నాగేంద్ర లను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

 రైతులు నకిలీ విత్తనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రభూత్వ అనుమతులు ఉన్నవిక్రయ కేంద్రాల నుంచే విత్తనాలు కొనుగోలు చేయాలని జిల్లా ఎస్పీ సూచించారు.నకిలీ విత్తనాల సమాచారం ఉంటే వెంటనే సమీప పోలీస్ స్టేషన్ కి సమాచారం తెలియజేయాలని సూచించారు. 

Search
Categories
Read More
SURAKSHA
The Glorious History and Heritage of Tamil Nadu Police
The history of the Tamil Nadu Police is remarkably distinguished. It was officially established...
By Kalaga Sailaja 2026-06-26 12:41:58 0 149
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : కుల మతాలకతీతంగా నిత్యవసరాలు పంపిణీ
పుంగనూరు నియోజకవర్గం, నంజoపేటలో కిద్మతే ఈ కల్క్ మైనారిటీ యూత్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం...
By Kothuru Murali 2026-03-08 08:33:21 0 191
SURAKSHA
V. Rashmi, IAS: A Visionary Leader Transforming Governance
A distinguished 1996-batch Karnataka cadre IAS officer, V. Rashmi has earned nationwide respect...
By Lokeshwari Panthadi 2026-07-18 11:04:04 0 128
Andhra Pradesh
అన్నమయ్య జిల్లా డీపీఎంఓగా బాధ్యతలు స్వీకరించిన రమేష్ బాబు.
అన్నమయ్య జిల్లా ప్రోగ్రామ్ మేనేజ్‌మెంట్ ఆఫీసర్ (డీపీఎంఓ)గా డాక్టర్ రమేష్ బాబు బుధవారం...
By Pagadala Venkateswar 2026-02-12 04:46:18 0 181
Andhra Pradesh
మదనపల్లిలో దివ్యాంగులకు ఉచిత వైద్య శిబిరం.
మదనపల్లి పట్టణంలోని ఎంఎల్ఎల్ హాస్పిటల్ లో గురువారం దివ్యాంగుల కోసం ఉచిత వైద్య శిబిరం...
By Pagadala Venkateswar 2026-02-13 06:42:01 0 203
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com