"యాప్రాల్ చెరువు కట్ట వద్ద ఎక్సైజ్ దాడులు: భారీగా గంజాయి, వాహనాలు స్వాధీనం.|

0
154

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : యాప్రాల్ చెరువు కట్ట వద్ద ఆల్వాల్ ఎక్సైజ్ పోలీసులు జరిపిన మెరుపు దాడుల్లో భారీగా గంజాయి పట్టుబడింది. 

మల్కాజిగిరి జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ అధికారి నవీన్ కుమార్ ఆదేశాలు, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ముకుంద రెడ్డి పర్యవేక్షణలో ఆల్వాల్ ఎక్సైజ్ ఎస్హెచ్ఓ బృందం నిన్న సాయంత్రం ఈ ఆపరేషన్ నిర్వహించింది. 

నమ్మదగిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు యాప్రాల్ చెరువు కట్ట వద్ద ఎన్.డి.పి.ఎస్ చట్టం కింద అక్రమంగా గంజాయి రవాణా, విక్రయాలు జరుపుతున్న ముఠాను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ఈ దాడుల్లో నిందితుల నుంచి 2.5 కేజీల ఎండు గంజాయితో పాటు ఐదు మొబైల్ ఫోన్లు, మూడు ఎలక్ట్రిక్ వాహనాలు, ప్యాషన్ ప్లస్ బైక్, టీవీఎస్ ఎన్‌టార్క్, రెండు హోండా యాక్టివా స్కూటర్లతో కలిపి మొత్తం ఏడు ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసులో మొత్తం ఏడుగురిని నిందితులుగా గుర్తించగా, వారిలో బాలాజినగర్‌కు చెందిన భోనాకల్లూరి గణేష్, బల్లెపూళ్ల తరుణ్, కాప్రాకు చెందిన భిశ్వకర్మ విష్ణుకుమార్, వరంగల్ జిల్లా మేకలగట్టుకు చెందిన పుప్పాల చంద్రకాంత్, మెదక్ జిల్లా మొగదుంపల్లెకు చెందిన సత్యరాం అరవింద్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. 

కాగా కొత్తూరు విశాల్, ఆనంద్ అనే మరో ఇద్దరు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. పట్టుబడిన ఐదుగురు నిందితులను ఎక్సైజ్ అధికారులు రిమాండ్‌కు తరలించారు. 

ఈ విజయవంతమైన దాడుల్లో ఆల్వాల్ ఎక్సైజ్ సిఐ జి. చంద్రశేఖర్, ఇన్స్పెక్టర్ ఎస్. కుమారస్వామి, సబ్ ఇన్స్పెక్టర్ సంధ్యారాణి మరియు సిబ్బంది కీలక పాత్ర పోషించారు.

#Sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
Mulakalacheruvu: తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలకు ‘తల్లికి వందనం’ పథకం వర్తించకపోవడంతో అన్నమయ్య జిల్లా కలెక్టర్‌ను వేడుకున్న తాత నాగమల్లప్ప.
Mulakalacheruvu: అన్నమయ్య జిల్లా ములకలచెరువు మండలం గుడుపల్లి గ్రామంలో నివాసముంటూ కొమ్మిరి...
By Pagadala Venkateswar 2026-07-24 05:22:19 0 140
Andhra Pradesh
ఇక బరువు తగ్గొద్దు లోకేశ్.. ప్రధాని మోదీ సరదా సూచన!
హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో ప్రధాని మోదీకి తేనీటి విందు ఫిట్‌నెస్ విషయంలో మోదీయే...
By Pagadala Venkateswar 2026-05-11 02:45:06 0 129
Andhra Pradesh
మదనపల్లి: బాధిత హోంగార్డులకు చెక్కుల పంపిణీ చేసిన ఎస్పీ.
అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్, అకాల మరణం చెందిన హోంగార్డుల కుటుంబాలకు, విశ్రాంత హోంగార్డుకు...
By Pagadala Venkateswar 2026-06-06 05:42:10 0 130
Andhra Pradesh
అన్నమయ్య జిల్లా: ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం: RIO
అన్నమయ్య జిల్లాలో ఈ నెల 23 నుంచి నిర్వహించనున్న ఇంటర్‌ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి...
By Pagadala Venkateswar 2026-02-21 04:35:13 0 199
SURAKSHA
Sujata Saunik IAS: Leading Maharashtra with Vision & Purpose
The Journey Begins "Leadership is measured not by authority, but by the positive change it...
By Fathima Safa 2026-07-20 14:33:08 0 112
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com