లక్సెట్టిపేటలో పోలీసుల కార్డన్ సెర్చ్,46 ద్విచక్ర వాహనాలు,ఒక ఆటో స్వాధీనం

0
283

లక్సెట్టిపేటలో పోలీసుల కార్డన్ సెర్చ్,46 ద్విచక్ర వాహనాలు,ఒక ఆటో స్వాధీనం

 

లక్సెట్టిపేట పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణ,నేరాల నియంత్రణ లక్ష్యంగా పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సోమవారం తెల్లవారుజామున లక్సెట్టిపేట సీఐ రమణమూర్తి ఆధ్వర్యంలో సర్కిల్ సిబ్బంది పాత బస్టాండ్, మహాలక్ష్మివాడ ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు.ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 46 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలు, వాహన పత్రాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.కార్డన్ సెర్చ్ అనంతరం స్థానిక ప్రజలకు పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నేరాల నియంత్రణలో ప్రజల సహకారం ఎంతో ముఖ్యమని, అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.ప్రతి వాహనదారుడు హెల్మెట్ ధరించడం, వాహన పత్రాలు వెంట ఉంచుకోవడం తప్పనిసరిగా పాటించాలని సూచించారు.అలాగే అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు.మైనర్లకు వాహనాలు ఇచ్చి రోడ్డుపైకి పంపవద్దని హెచ్చరించారు.వేసవి సెలవుల సందర్భంగా ఊర్లకు వెళ్లే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, విలువైన వస్తువులను ఇంట్లో వదిలివెళ్లవద్దని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలందరూ సహకరించాలని, ఆసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు.ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో లక్సెట్టిపేట ఎస్సై సురేష్ కుమార్, దండేపల్లి ఎస్సై తైసీనోద్దీన్,జన్నారం ఎస్సై ఉదయ్ కిరణ్ మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్ లో కానిస్టేబుల్ ప్రమోద్ ను హత్య చేసిన నిందితుడు రియాజ్ పోలీసులకు దొరికిండు.
హైదరాబాద్:  నిజామాబాద్లో కానిస్టేబుల్ ప్రమోద్ను హత్య చేసి పరారైన రియాజ్ పోలీసులకు...
By Sidhu Maroju 2025-10-19 12:55:17 0 320
Andhra Pradesh
Madanapalle: మదనపల్లె ఎన్.జే.ఆర్ కళ్యాణమండపంలో 'షైనింగ్ స్టార్స్-2026', 'మై స్కూల్ మై ప్రైడ్' కార్యక్రమం.
Madanapalle: మదనపల్లె పట్టణంలోని డీఎస్పీ కార్యాలయం సమీపంలోని పుంగనూరు రోడ్డులో ఉన్న ఎన్.జే.ఆర్...
By Pagadala Venkateswar 2026-07-20 11:26:13 0 81
Andhra Pradesh
చందర్లపాడు లో ఘనంగా స్కూల్ రేడినెస్ మేళ
చందర్లపాడు లో ఘనంగా స్కూల్ రెడీనెస్ మేళ ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు (మండలం ),...
By Patan Khuddus 2026-04-30 19:30:55 0 270
Andhra Pradesh
చీరాల మండలం కొత్తపాలెం గ్రామపంచాయతీ పరిధిలో ఆటో ఢీకొని 18 నెలల పాప మృతి
చీరాల: చీరాల మండలం కొత్తపాలెం గ్రామపంచాయతీ పరిధిలోని దళిత నగర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది....
By Gadiyapudi Narendra 2026-02-20 05:04:17 0 221
Maharashtra
Maharashtra Strengthens Environment and Forest Conservation
Maharashtra is reinforcing its commitment to environmental sustainability and forest conservation...
By Fathima Safa 2026-06-30 09:12:00 0 223
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com