Madanapalle: మదనపల్లె ఎన్.జే.ఆర్ కళ్యాణమండపంలో 'షైనింగ్ స్టార్స్-2026', 'మై స్కూల్ మై ప్రైడ్' కార్యక్రమం.

0
81

Madanapalle: మదనపల్లె పట్టణంలోని డీఎస్పీ కార్యాలయం సమీపంలోని పుంగనూరు రోడ్డులో ఉన్న ఎన్.జే.ఆర్ కళ్యాణమండపంలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన 'షైనింగ్ స్టార్స్–2026' మరియు 'మై స్కూల్ మై ప్రైడ్' కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రోడ్డు రవాణా, మౌలిక వసతుల శాఖ మంత్రి, అన్నమయ్య జిల్లా ఇన్‌చార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ భాష ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

 

ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అతిథులు రూ.20,000 ప్రోత్సాహక చెక్కులు, ప్రశంసా సర్టిఫికెట్లు, మెడల్స్ అందజేసి అభినందించారు. విద్యార్థులు విద్యతో పాటు నైతిక విలువలు, క్రమశిక్షణ అలవర్చుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని వారు సూచించారు.

 

రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ విద్యార్థులను ప్రోత్సహించేలా పలు సంక్షేమ, ప్రోత్సాహక కార్యక్రమాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, విద్యాశాఖ సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లె ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షుడిగా నాగేష్ బాధ్యతలు స్వీకరణ.
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షుడిగా లక్కీ టైల్స్ మాల్ నాగేష్ శుక్రవారం...
By Pagadala Venkateswar 2026-03-20 13:50:40 0 199
Telangana
"చీరల సందడి మొదలు"|
"ఇంద్రానగర్‌లో ఇందిరమ్మ చీరల పంపిణీకి ఎమ్మెల్యే శ్రీకారం." మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :...
By Sidhu Maroju 2026-06-25 08:45:35 0 209
Andhra Pradesh
Polavaram Irrigation Project: Progress and Key Updates
The Polavaram Irrigation Project remains one of Andhra Pradesh's most significant multipurpose...
By Fathima Safa 2026-06-17 05:07:23 0 107
Health & Fitness
Global Health Agencies Monitor Hantavirus Outbreak
Public health agencies are tightly monitoring a rare orthohantavirus cluster linked to a South...
By Dunna Jessicaruth 2026-05-19 07:00:31 0 120
Andhra Pradesh
నేడు ఏపీ కేబినెట్ భేటీ .. ఈ కీలక అంశాలపై చర్చ.
అమరావతిలో రూ.1,208 కోట్ల ట్విన్ టవర్ల ప్రాజెక్టుకు ఆమోదం తెలిపే అవకాశం సచివాలయం, అసెంబ్లీ భవనాల...
By Pagadala Venkateswar 2026-04-30 04:30:32 0 130
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com