వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రూరల్ ఇన్స్పెక్టర్ గారిని కలిసిన ఎర్రకోట రాజీవ్ రెడ్డి

0
234

నందవరం సబ్ ఇన్స్పెక్టర్ గారి పై చర్యలు తీసుకోవాలి వైస్సార్సీపీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంచార్జ్ ఎర్రకోట రాజీవ్ రెడ్డి గారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ సమన్వయకర్త ఎర్రకోట రాజీవ్ రెడ్డి గారు ఎమ్మిగనూరు నియోజకవర్గ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారిని కలిసి నందవరం మండలంలో విధులు నిర్వహిస్తున్న సబ్ ఇన్స్పెక్టర్ గారి వ్యవహార శైలిపై తగిన చర్యలు తీసుకోవాలి అని వివరించడం జరిగింది.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకొని నందవరం మండలంలో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలపై ఉద్దేశపూర్వకంగా అక్రమ కేసులు నమోదు చేసి వేధింపులకు గురిచేస్తున్నారని ఆయన ఆరోపించారు.ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిని లక్ష్యంగా చేసుకొని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని తెలిపారు.

ముఖ్యంగా నందవరం మండలం కనకవీడు గ్రామంలో ఇటీవల జరిగిన ఘటనలో అసలు తప్పు టిడిపి నాయకులదే ఉన్నప్పటికీ, కావాలనే వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలపై కేసులు నమోదు చేసి కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి వివరించారు.అలాగే మండలంలోని ఏటిగడ్డ ప్రాంతాల నుంచి అక్రమ ఇసుక, మట్టి తరలింపులు యథేచ్ఛగా జరుగుతున్నప్పటికీ వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, వైఎస్ఆర్సిపి నాయకులు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని ఆరోపించారు. మండలం లో బెల్ట్ షాపుల వ్యవహారంపై కూడా తగిన తనిఖీలు నిర్వహించకుండా అలసత్వం వహిస్తున్నారని తెలిపారు.నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలపై జరుగుతున్న అక్రమ కేసులు, వేధింపులు, పోలీసు వ్యవస్థ దుర్వినియోగంపై సమగ్రంగా వివరించిన ఎర్రకోట రాజీవ్ రెడ్డి గారు, నందవరం సబ్ ఇన్స్పెక్టర్ వారి పై పూర్తి స్థాయి విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఎమ్మిగనూరు నియోజకవర్గ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారిని కోరారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మేధావుల ఫారం కార్యదర్శి కనకవీడు లక్ష్మీకాంత్ రెడ్డి గారు, ఎమ్మిగనూరు మండల సీనియర్ నాయకులు, మండల కన్వీనర్ బి.ఆర్ బసి రెడ్డి గారు, నియోజకవర్గ ప్రచార విభాగ అధ్యక్షుడు చాంద్ బాషా,చంద్రబాబు, పెద్ద ఈరన్న, గిడ్డయ్య,వీరేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలు
    హైదరాబాద్ :  GHMC(కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ జోన్ల)...
By Sidhu Maroju 2025-12-30 17:10:29 0 216
Telangana
బాచుపల్లిలో ఫార్మా బస్సు బోల్తా 10 మందికి గాయాలు
మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ప్రైవేట్ ఫార్మా కంపెనీకి చెందిన మినీ బస్సు అదుపుతప్పి బోల్తా...
By Ponnala Srinivasrao 2026-03-17 08:19:25 0 270
Sports
Premier League Title Race Pushed to the Absolute Wire
An absolute thriller is unfolding in the English Premier League as today’s high-stakes...
By Dunna Jessicaruth 2026-05-20 05:39:45 0 106
Andhra Pradesh
పుంగనూరు:పుంగనూరు సబ్ ట్రెజరీ అధికారిగా వసంత రాంబాబు
పుంగనూరు సబ్ ట్రెజరీ అధికారిగా వసంత రాంబాబు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. మదనపల్లి సీనియర్...
By Kothuru Murali 2026-07-17 04:28:49 0 228
Andhra Pradesh
Tirumala: కిటకిటలాడుతున్న తిరుమల.. సర్వదర్శనానికి 24 గంటలు.
Tirumala: కిటకిటలాడుతున్న తిరుమల.. సర్వదర్శనానికి 24 గంటలు 24-01-2026 Sat 14:14 | Andhra  ...
By Pagadala Venkateswar 2026-01-24 09:48:07 0 382
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com