"తుర్కపల్లిలో భద్రతకు కొత్త బలం.. 22 సీసీ కెమెరాల ప్రారంభం”|

0
378

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తుర్కపల్లి గ్రీన్ పార్క్ అవెన్యూలో భద్రతా వ్యవస్థను మరింత పటిష్టం చేసే లక్ష్యంతో ఏర్పాటు చేసిన 22 కొత్త సీసీ కెమెరాలను ఆల్వాల్ డీఐ, వీరబాబు, సెక్టార్ ఎస్‌ఐ దేవేందర్ ప్రారంభించారు. 

ఈ సందర్భంగా కాలనీవాసులతో మాట్లాడిన డీఐ వీరబాబు, “ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి కాలనీకి సీసీ కెమెరాలు అత్యంత అవసరం. నేరాలు జరిగిన తర్వాత విచారణలో మాత్రమే కాకుండా, నేరాలు జరగకుండా నిరోధించడంలో కూడా సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రజలు పోలీసులకు సహకరిస్తూ అప్రమత్తంగా ఉంటే సమాజాన్ని మరింత సురక్షితంగా మార్చుకోవచ్చు” అని పేర్కొన్నారు.

ఇటీవలి ఘటనలను ప్రస్తావించిన అధికారులు, అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాలు కనిపించిన వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

సీసీ కెమెరాల ద్వారా నేరస్తులను త్వరగా గుర్తించే అవకాశం ఉంటుందని, దీనివల్ల కాలనీల్లో భద్రతా వాతావరణం మరింత మెరుగుపడుతుందని తెలిపారు.

ప్రజల భాగస్వామ్యంతో కమ్యూనిటీ పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేస్తున్నామని కూడా అధికారులు వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో గ్రీన్ పార్క్ అవెన్యూ అధ్యక్షుడు మోహన్ సీతాకుమార్, కార్యదర్శి బెజుగం వెంకటేష్, ఖజాంచి రవి రాథోడ్‌తో పాటు కాలనీవాసులు పాల్గొని పోలీసుల చర్యలను అభినందించారు.

#Sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: నిబంధనల మేరకే పెట్రోల్ డీజిల్ సరఫరా చేయాలి కొత్తూరు మురళి
అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గంలోని సోమల, చౌడేపల్లి మండలాలలో సోమవారం తహసిల్దార్లు పార్వతి,...
By Kothuru Murali 2026-04-28 06:32:05 0 142
Andhra Pradesh
ఏనుగుల సంచారం.. అటవీశాఖ సూచనలు
గరుగుబిల్లి మండలం గిజబ గ్రామ పరిసర అరటి తోటల్లో, వరి పొలాల్లో ఉదయం ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు...
By Boiena Rajesh 2026-04-06 04:43:21 0 363
Andhra Pradesh
నమస్తే ఎమ్మిగనూరు పోరుబాటు కార్యక్రమంలో ఎమ్మిగనూరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఎర్రకోట రాజీవ్ రెడ్డి మూడో రోజు పాల్గొనడం జరిగింది
ఎమ్మిగనూరు మార్కెట్ యార్డులో అకాల వర్షాలతో నష్టపోయిన బి. సెంటర్ గ్రామ రైతు అయిన కర్ణా ను...
By Boya Dasthagiri 2026-07-20 09:46:50 0 205
Andhra Pradesh
పుంగనూరు నియోజ క వర్గం : రథసప్తమి వేడుకలకు సర్వం సిద్ధం.
పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం, కల్లూరు దేవళంపేటలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం వద్ద...
By Kothuru Murali 2026-01-25 11:48:08 0 200
Telangana
తెలంగాణ సచివాలయంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ని కలిసిన మహాబూబాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులు, అఖిలపక్ష నేతలు...*
*మహబూబాబాద్ మున్సిపల్ పరిధిలోని అనంతారం గ్రామంలో మెగా ఫ్రైట్ మెయింటెనెన్స్ డిపో స్థాపనకు 409.01...
By CM_ Krishna 2025-12-25 02:04:43 0 370
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com