"మల్కాజ్‌గిరిలో బీఆర్ఎస్ సంస్థాగత ఎన్నికల జోరు.. భారీగా తరలివచ్చిన కార్యకర్తలు”

0
207

మేడ్చల్ మల్కాజ్‌గిరి : నియోజకవర్గంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ సంస్థాగత ఎన్నికల సందడి ఊపందుకుంది. 192 టెంపుల్ అల్వాల్ మరియు 193 వెంకటాపురం డివిజన్‌లలో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశాలు పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. 

ఈ సమావేశాలకు మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

సమావేశాల్లో తెలంగాణ రాష్ట్ర ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ నందికంటి శ్రీధర్ తో పాటు వీరేశం యాదవ్, ఆనంద్, జేఏసీ వెంకన్న, తోట నరేందర్ రెడ్డి, ఖలీల్, అరుణ్ రావు తదితర నాయకులు పాల్గొన్నారు. పార్టీ బలోపేతంలో సంస్థాగత ఎన్నికలు కీలక పాత్ర పోషిస్తాయని నాయకులు స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ డివిజన్ స్థాయి కమిటీలను సమర్థవంతంగా ఏర్పాటు చేసి పార్టీని మరింత ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. 

సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తూ ప్రతి ఇంటికి బీఆర్ఎస్ సిద్ధాంతాలను చేర్చాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 

అలాగే ఎస్‌ఐఆర్ (Special Intensive Revision) ప్రక్రియలో ప్రతి కార్యకర్త అప్రమత్తంగా ఉండి ఓటర్ల హక్కులను కాపాడేందుకు కృషి చేయాలని సూచించారు.

ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ మల్కాజ్‌గిరి అభివృద్ధి కోసం ప్రభుత్వం మీద నిరంతరం ఒత్తిడి తీసుకువస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. 

రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలపర్చేందుకు నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. 

సమావేశానికి హాజరైన కార్యకర్తల అభిప్రాయాలను శ్రద్ధగా విన్న ఎమ్మెల్యే, వాటిని గౌరవిస్తూ తగిన నిర్ణయాలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా పార్టీ సభ్యత్వ రుసుములను కూడా ప్రకటించారు. సాధారణ సభ్యత్వం రూ.10 కాగా, క్రియాశీలక సభ్యత్వం రూ.50గా నిర్ణయించినట్లు వెల్లడించారు.

సమావేశాల్లో... నరేందర్ రెడ్డి పరమేష్, శరణగిరి, యాదగిరి గౌడ్, శ్రీధర్ గౌడ్, విజయ్ శేఖర్, హనుమంత్, వి.ఎన్. రాజు, జార్జ్, లింగా రెడ్డి, శ్రీనివాస్, సురేష్, రాజు, వెంకటరమణ, రామానుజన్, అరవింద్, విశాల్, విద్యాసాగర్, అమూల్, సింథిల్, ప్రేమ్, హనుమంతు, జస్వీర్ సింగ్, ఆరిఫ్ రెహ్మత్ ఖాన్, సాజిద్, ప్రశాంత్, అరుణ్, సుధీర్, జామ మహేందర్, అంజయ్య, వెంకటేష్, మహేష్, మాధవి, అనురాధ, నందిని, నిర్మల తదితర బీఆర్ఎస్ నాయకులు, మహిళలు, యువకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని సమావేశాలను విజయవంతం చేశారు.

#Sidhumaroju

Alwal

Search
Categories
Read More
Telangana
‎ ‎ప్రధాని మోదీపై 'కాంతార' నటుడు ఫైర్
పదేళ్లు విడగొట్టి.. ఇప్పుడు కలిసి ఉండమంటే ఎలా? ప్రధాని మోదీపై 'కాంతార' నటుడు కిషోర్ నిప్పులు!" 🔥...
By Ponnala Srinivasrao 2026-03-28 02:28:05 0 317
Telangana
పారాక్వాట్ గడ్డిమందు నిషేధం
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పారాక్వాట్ (Paraquat) గడ్డిమందు పై నిషేధం విధించిన విషయం...
By Bheeshman King 2026-04-01 16:06:10 0 1K
Andhra Pradesh
ప్రతి ఇంటికి సంక్షేమం… ప్రతి కుటుంబానికి భరోసా – కూటమి ప్రభుత్వ లక్ష్యం
ప్రతి ఇంటికి సంక్షేమం… ప్రతి కుటుంబానికి భరోసా – కూటమి ప్రభుత్వ లక్ష్యం ముండ్లమూరు...
By Chennaiah Kati 2026-07-01 06:58:58 0 104
Andhra Pradesh
పుంగనూరు ఎద్దుల పరుషలో ఆకట్టుకున్న ఒంగోలు జాతి ఎద్దులు
పుంగనూరులో బుధవారం జరిగిన ఎద్దుల పరుషలో ఒంగోలు జాతి ఎద్దులు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. కదిరి నుంచి...
By Kothuru Murali 2026-04-30 11:38:54 0 141
Jammu & Kashmir
J&K Accelerates Renewable Energy and Hydropower Plans
Jammu & Kashmir is strengthening its energy sector through the expansion of renewable energy...
By Fathima Safa 2026-06-25 13:00:12 0 153
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com