"మల్కాజ్‌గిరిలో బీఆర్ఎస్ సంస్థాగత ఎన్నికల జోరు.. భారీగా తరలివచ్చిన కార్యకర్తలు”

0
209

మేడ్చల్ మల్కాజ్‌గిరి : నియోజకవర్గంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ సంస్థాగత ఎన్నికల సందడి ఊపందుకుంది. 192 టెంపుల్ అల్వాల్ మరియు 193 వెంకటాపురం డివిజన్‌లలో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశాలు పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. 

ఈ సమావేశాలకు మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

సమావేశాల్లో తెలంగాణ రాష్ట్ర ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ నందికంటి శ్రీధర్ తో పాటు వీరేశం యాదవ్, ఆనంద్, జేఏసీ వెంకన్న, తోట నరేందర్ రెడ్డి, ఖలీల్, అరుణ్ రావు తదితర నాయకులు పాల్గొన్నారు. పార్టీ బలోపేతంలో సంస్థాగత ఎన్నికలు కీలక పాత్ర పోషిస్తాయని నాయకులు స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ డివిజన్ స్థాయి కమిటీలను సమర్థవంతంగా ఏర్పాటు చేసి పార్టీని మరింత ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. 

సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తూ ప్రతి ఇంటికి బీఆర్ఎస్ సిద్ధాంతాలను చేర్చాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 

అలాగే ఎస్‌ఐఆర్ (Special Intensive Revision) ప్రక్రియలో ప్రతి కార్యకర్త అప్రమత్తంగా ఉండి ఓటర్ల హక్కులను కాపాడేందుకు కృషి చేయాలని సూచించారు.

ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ మల్కాజ్‌గిరి అభివృద్ధి కోసం ప్రభుత్వం మీద నిరంతరం ఒత్తిడి తీసుకువస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. 

రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలపర్చేందుకు నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. 

సమావేశానికి హాజరైన కార్యకర్తల అభిప్రాయాలను శ్రద్ధగా విన్న ఎమ్మెల్యే, వాటిని గౌరవిస్తూ తగిన నిర్ణయాలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా పార్టీ సభ్యత్వ రుసుములను కూడా ప్రకటించారు. సాధారణ సభ్యత్వం రూ.10 కాగా, క్రియాశీలక సభ్యత్వం రూ.50గా నిర్ణయించినట్లు వెల్లడించారు.

సమావేశాల్లో... నరేందర్ రెడ్డి పరమేష్, శరణగిరి, యాదగిరి గౌడ్, శ్రీధర్ గౌడ్, విజయ్ శేఖర్, హనుమంత్, వి.ఎన్. రాజు, జార్జ్, లింగా రెడ్డి, శ్రీనివాస్, సురేష్, రాజు, వెంకటరమణ, రామానుజన్, అరవింద్, విశాల్, విద్యాసాగర్, అమూల్, సింథిల్, ప్రేమ్, హనుమంతు, జస్వీర్ సింగ్, ఆరిఫ్ రెహ్మత్ ఖాన్, సాజిద్, ప్రశాంత్, అరుణ్, సుధీర్, జామ మహేందర్, అంజయ్య, వెంకటేష్, మహేష్, మాధవి, అనురాధ, నందిని, నిర్మల తదితర బీఆర్ఎస్ నాయకులు, మహిళలు, యువకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని సమావేశాలను విజయవంతం చేశారు.

#Sidhumaroju

Alwal

Search
Categories
Read More
Karnataka
See ntr statue open in Karnataka sindanoor.
సింధనూరులో స్వర్గీయ ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన నారా లోకేష్   రాయచూర్ జిల్లా...
By G k Nookala 2026-04-04 10:26:33 0 230
Andhra Pradesh
అంజుమన్ ఆస్తుల పరిరక్షణకు ఐక్యతే మార్గం: ముఫ్తీ అబ్దుల్ బాసిత్.
గుంటూరు:అంజుమన్ ఇస్లామియా ఆస్తుల పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని జమీయతుల్ ఉలమా రాష్ట్ర...
By John Baji 2026-01-06 12:38:30 0 246
Andhra Pradesh
మంత్రి కొలుసు పార్థసారథి గారికి ఘనంగా స్వాగతం పలికిన రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు
రాయచోటి అన్నమయ్య జిల్లా పర్యటనలో భాగంగా ఆదివారం రాయచోటి ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ కు చేరుకున్న...
By Benguluri Madhubabu 2026-05-03 08:22:48 0 278
Telangana
# కరీంనగర్ లో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ధాత్రి ఆయుర్వేద హాస్పిటల్ ప్రారంభోత్సవం.
కరీంనగర్ జిల్లా పట్టణం లోనీ చైతన్యపురి కాలనీ , మహాశక్తి ఆలయం దగ్గర  ధాత్రి ఆయుర్వేద...
By Thalakokkula Sadanandam 2026-03-21 13:14:22 0 580
Andhra Pradesh
రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తే చర్యలు
రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ చేసిన, తరలిస్తున్న చట్టపరంగా చర్యలు తప్పవని తహశీల్దార్ ప్రసన్నకుమార్...
By Boiena Rajesh 2026-09-06 05:13:28 0 99
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com