దళారులను నమ్మి మోసపోవద్దు......!

0
186

*దళారులను నమ్మి మోసపోవద్దు....*

 - *ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన..*

 - *బోబ్బరోనిపల్లి సర్పంచ్ శెంకెశి కమలాకర్*

భారత్ అవాజ్ న్యూస్: 15 మే రోజున దుగ్గొండి మండలం బొబ్బర్పల్లె గ్రామపంచాయతీ రైతులు దళారులను నమ్మి మోసపోవకుండా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలని బోబ్బరోనిపల్లి సర్పంచ్ శెంకెశి కమలాకర్ సూచించారు. శుక్రవారం బోబ్బరోనిపల్లి గ్రామంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ ప్రారంభించారు. అనంతరం కమలాకర్ మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు మద్దతు ధర కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని తీసుకువచ్చి అధికారుల సూచనలు పాటించాలని కోరారు. కొనుగోలు కేంద్రంలో 2389 సన్న రకం, 2369 దొడ్డు రకం ధరతో ధాన్యం కొనుగోలు ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి గాజుల శ్యామ్, ఏపీఎం రమేష్, ఏఈఓ రాజేష్, సిఏ కొనుకటి కృష్ణవేణి, ఉపసర్పంచ్ కొనుకటి అరుణ, వార్డు సభ్యులు రాధారపు నరేష్, గోంగూర కోటి, లలిత, భాషబోయిన రాజు, మయూరి విఓ అధ్యక్షురాలు బొల్లం సావిత్రి, మాజీ సర్పంచ్లు ఎర్ర ఆది రెడ్డి, రైతులు కోడూరి రాజేందర్, కొలిపాక చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.... దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము....

Search
Categories
Read More
Chandigarh
Chandigarh Strengthens Traffic and Road Safety Measures
Chandigarh continues to enhance traffic management and road safety through the adoption of...
By Fathima Safa 2026-07-02 06:13:30 0 117
Andhra Pradesh
మాజీ సీఎం పాదయాత్ర పై బుద్దా వెంకన్న ప్రెస్ మీట్
*మీడియా మిత్రుల‌కు ఆహ్వానం* *22-01-2026*   *విలేఖ‌రుల స‌మావేశం*  ...
By Rajini Kumari 2026-01-22 12:38:02 0 263
BMA
Digital Gatekeeping: Portals Denied State Accreditation
Digital-first independent newsrooms are facing systemic bureaucratic bias, frequently being...
By JoinBMA 2026-08-21 08:15:08 0 159
Andhra Pradesh
High Court: ‘మదనపల్లె’పై జోక్యం చేసుకోలేం
అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని మదనపల్లెకు మార్చడాన్ని నిలువరించలేమని హైకోర్టు తేల్చిచెప్పింది.
By Pagadala Venkateswar 2026-01-08 07:38:58 0 212
Andhra Pradesh
రాఘవేంద్ర పాఠశాలలో ఘనంగా 17వ వార్షికోత్సవం
చీరాల పట్టణంలోని రాఘవేంద్ర హైస్కూల్ నందు 17వ వార్షికొత్సవ వేడుకలు కరస్పాండెంట్ మణికుమార్...
By Vadlamudi NagaVenkat 2026-04-03 11:53:19 0 310
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com