సింగరేణిలో “రివ్యూ మీటింగ్‌లు” పేరుతో కాలక్షేపం జరుగుతోందా? అనే ప్రశ్న ఇప్పుడు కార్మికుల్లో తీవ్రంగా వినిపిస్తోంది.

0
259

సింగరేణిలో “రివ్యూ మీటింగ్‌లు” పేరుతో కాలక్షేపం జరుగుతోందా? అనే ప్రశ్న ఇప్పుడు కార్మికుల్లో తీవ్రంగా వినిపిస్తోంది,సమస్యల పరిష్కారం కోసం నిర్వహించాల్సిన సమావేశాలు కేవలం ఫోటోలు, ప్రకటనలు, హామీలకే పరిమితమవుతున్నాయని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి మీటింగ్ తర్వాత “సానుకూల చర్చ జరిగింది”, “త్వరలో పరిష్కారం” అనే మాటలు వినిపిస్తున్నా, నేలమీద మార్పు మాత్రం కనిపించడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి,పెండింగ్ డిమాండ్లు,ఉద్యోగ భద్రత,ఖాళీల భర్తీ,కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు,ఇవన్నీ సంవత్సరాలుగా పెండింగ్‌లోనే ఉండగా, యాజమాన్యం మరియు కొన్ని యూనియన్ నాయకులు మాత్రం రివ్యూ మీటింగ్‌ల పేరుతో కాలాన్ని నెట్టేస్తున్నారనే అభిప్రాయం బలపడుతోంది,సింగరేణి కార్మికుల కష్టం మీద నడిచే సంస్థ. కాబట్టి సమావేశాలు కేవలం ప్రదర్శనగా కాకుండా, సమస్యల పరిష్కారానికి మార్గదర్శకంగా మారాలని కార్మికులు కోరుతున్నారు.“మీటింగ్‌లు కాదు… ఫలితాలు కావాలి” అనే నినాదం ఇప్పుడు సింగరేణి ప్రాంతాల్లో గట్టిగా వినిపిస్తోంది.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గ : ఈతకు వెళ్లి వ్యక్తి మృతి
పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలంలో ఆదివారం పెద్ద ఉప్పరపల్లి బలిజ వీధికి చెందిన మునిరెడ్డి (40)...
By Kothuru Murali 2026-04-06 07:11:04 0 191
Andhra Pradesh
మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
*వై ఎస్ జగన్ కి జన్మదిన శుభాకాంక్షలు*   *మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి...
By Rajini Kumari 2025-12-21 09:16:18 0 280
Andhra Pradesh
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో రోజు రోజుకు పెరిగిపోతున్న ఇసుక మాఫియా ఆగడాలు
_*ఎన్టీఆర్ జిల్లా/నందిగామ*_    *_ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్న గ్రామాస్తుల....._*...
By Rajini Kumari 2026-04-01 08:55:53 0 206
Andhra Pradesh
చీరాల జాతీయ రహదారిపై పోలీసులు ముమ్మర తనిఖీలు
బాపట్ల జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు చీరాల పరిధిలోని జాతీయ రహదారిపై పోలీసులు...
By Vadlamudi NagaVenkat 2026-03-31 09:32:16 0 479
Rajasthan
Rajasthan Unveils Exciting Sports Calendar for 2026-27
The Department of Personnel, in collaboration with state sports agencies, has officially released...
By Lokeshwari Panthadi 2026-07-01 08:37:28 0 243
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com