ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్.. చంద్రబాబు సర్కార్ కీలక యోచన.

0
131

 

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్.. చంద్రబాబు సర్కార్ కీలక యోచన

Andhra

AP Government Mulls Work From Home Option Following Modis Call

పశ్చిమాసియా యుద్ధంపై ప్రధాని మోదీ హెచ్చరిక

పొదుపు, వర్క్ ఫ్రమ్ హోమ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని సూచన

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ పరిశీలిస్తున్నామన్న చంద్రబాబు

ఇంధన పొదుపులో భాగంగా హైబ్రిడ్ విధానంపైనా ఏపీ సర్కార్ యోచన

త్వరలో మార్గదర్శకాల రూపకల్పన.. కేబినెట్‌లో చర్చకు అవకాశం

పశ్చిమాసియాలో ఉద్రిక్త‌త‌ల‌ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పొదుపు పిలుపునకు ఏపీ ప్రభుత్వం స్పందించింది. ఇంధన సంక్షోభాన్ని నివారించే ముందస్తు చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అమలు చేసే అంశంపై ఏపీ సర్కార్ తీవ్రంగా యోచిస్తోంది. కరోనా మహమ్మారి సమయంలో ప్రాచుర్యం పొందిన ఈ విధానం, మళ్లీ ఇప్పుడు యుద్ధ పరిస్థితుల కారణంగా తెరపైకి వచ్చింది.

 

ఇటీవల ప్రధాని మోదీ దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ.. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల ప్రభావం భారత్‌పైనా ఉంటుందని, ప్రజలందరూ పొదుపు పాటించాలని సూచించారు. ముఖ్యంగా ఇంధనం వాడకాన్ని తగ్గించడం, అనవసర ప్రయాణాలు మానుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే ఆయన వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని ఒక పరిష్కారంగా ప్రస్తావించారు.

 

ప్రధాని సూచనల తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఈ విషయంపై స్పందించారు. ఏపీలో ప్రభుత్వ రంగంలోనూ వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన ప్రకటించారు. భవిష్యత్తులో ప్రపంచమంతా ఇంటి నుంచే పనిచేసే రోజులు రాబోతున్నాయని, దానికి అనుగుణంగా మన ఆలోచనా విధానంలో మార్పు రావాలని ఆయన పేర్కొన్నారు. ఇంధన పొదుపు కోసం అనవసర ప్రయాణాలు తగ్గించి, టెలి, వీడియో కాన్ఫరెన్స్‌లకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు సూచించారు.

 

చంద్రబాబు వ్యాఖ్యల నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అమలుకు సంబంధించిన ప్రతిపాదనలపై ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంటి నుంచి పనిచేసేందుకు వీలున్న విభాగాలు, కార్యాలయాలకు తప్పనిసరిగా హాజరుకావాల్సిన ఉద్యోగులను గుర్తించే ప్రక్రియ చేపట్టనున్నారు. కొందరికి పూర్తిగా వర్క్ ఫ్రమ్ హోమ్, మరికొందరికి హైబ్రిడ్ విధానంలో (కొన్ని రోజులు ఇల్లు, కొన్ని రోజులు ఆఫీస్) పనిచేసే అవకాశాన్ని కల్పించే అంశాలను పరిశీలిస్తున్నారు. ఈ ప్రతిపాదనలపై కేబినెట్ సమావేశంలో చర్చించి, స్పష్టమైన మార్గదర్శకాలతో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Search
Categories
Read More
Andhra Pradesh
మార్కాపురం జిల్లాలో ఆకస్మిక తనిఖీ చేపట్టిన కలెక్టర్
మార్కాపురం జిల్లాలో ఆకస్మిక తనిఖీ చేపట్టిన కలెక్టర్.. మార్కాపురం జిల్లా తర్లపాడు మండలంలోని...
By Chennaiah Kati 2026-06-18 08:12:36 0 118
Andhra Pradesh
నిరంతరాయమైన విద్యుత్ ను అందిచడమై లక్ష్యం విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే MMకొండయ్య.
చీరాల: విద్యుత్ రంగానికి కూటమి సర్కార్ పెద్ద పీట. నూతనంగా నిర్మించనున్న విద్యుత్...
By Gadiyapudi Narendra 2026-02-18 15:57:06 0 221
Telangana
తెలంగాణ జాతి ఆత్మగౌరవ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన గులాబీ దీపిక,
నాలుగు కోట్ల గొంతులను ఏకం చేసి విప్లవ శంఖం మోగించిన ధిక్కార వేదిక, ‎సమైక్య సంకెళ్లను తెంచి...
By Ponnala Srinivasrao 2026-04-27 04:46:44 0 158
Andhra Pradesh
స్వర్ణాంధ్ర-2047 థీమ్‌తో అమరావతిలో పంద్రాగస్టు సంబరాలు..జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం రాజధాని అమరావతిలో అత్యంత వైభవంగా...
By Pagadala Venkateswar 2026-08-15 09:48:33 0 87
Andhra Pradesh
శివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాల వద్ద పటిష్ట బందోబస్తు: DSP
మహా శివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాల వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు మదనపల్లె...
By Pagadala Venkateswar 2026-02-14 06:32:38 0 206
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com