ఏపీ కేబినెట్‌లో పొదుపు విప్లవం.. ఎస్కార్ట్ లేకుండా ఒకే వాహనంలో మంత్రులు.

0
140

ఆర్భాటాలను పక్కన పెట్టిన ఏపీ మంత్రులు

లోకేశ్ ఏర్పాటు చేసిన విందుకు కాన్వాయ్ లేకుండా ఒకే వాహనంలో వచ్చిన మంత్రులు

రెండు వాహనాలతో సీఎం క్యాంపు కార్యాలయానికి మంత్రి నారాయణ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో 'పొదుపు మంత్రం' అమలవుతున్న తీరు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అంతర్జాతీయ చమురు సంక్షోభం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుకు స్పందిస్తూ, ఏపీ మంత్రులు తమ విలాసాలను పక్కనపెట్టి సామాన్యుల తరహాలో పొదుపు చర్యలు చేపట్టడం ఒక గొప్ప ముందడుగు.

 

 

 

ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ ఇప్పటికే తమ భద్రత, కాన్వాయ్‌ విషయంలో పొదుపు పాటిస్తుండగా... ఇతర మంత్రులు కూడా అదే బాటలో నడుస్తున్నారు. ఈ ఉదయం సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రి నారా లోకేశ్ ఏర్పాటు చేసిన అల్పాహార విందుకు మంత్రులు హాజరయ్యారు. 

 

 

 

ఈ సందర్భంగా మంత్రులు నిమ్మల రామానాయుడు, అనిత, గుమ్మడి సంధ్యారాణి, సవిత, కొల్లు రవీంద్ర, పార్థసారథి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి, పయ్యావుల కేశవ్ తదితరులు ఎస్కార్ట్ వాహనాలను పక్కనపెట్టి, కేవలం ఒక్కో వాహనంలోనే సీఎం కార్యాలయానికి చేరుకున్నారు.

 

 

గతంలో మంత్రి నారాయణ కాన్వాయ్‌లో తన సొంత వాహనంతో పాటు మరో నాలుగు వాహనాలు ఉండేవి. ఇప్పుడు ఆ కాన్వాయ్‌లో ఏకంగా 50 శాతం తగ్గించుకుంటూ నారాయణ కీలక నిర్ణయం తీసుకున్నారు. కేవలం రెండు వాహనాలతోనే ఆయన నేడు సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు.

Search
Categories
Read More
Manipur
Major Security Crackdown: 5 Insurgents Arrested
Joint security forces launched coordinated anti-insurgency operations across Manipur over the...
By Dunna Jessicaruth 2026-05-25 06:42:05 0 123
Andhra Pradesh
అన్నమయ్య: అంబేద్కర్ ఆశయాలను గౌరవిద్దాం...
అన్నమయ్య జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో మంగళవారం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్...
By Pagadala Venkateswar 2026-04-14 07:20:41 0 192
Telangana
మల్లంపేట లో నియమాలకు విరుద్ధంగా నిర్మాణం చెసినా వాణిజ్య భవనం నిర్మాణం సీల్డ్ చెసిన జిహెచ్ఎంసి
దిండిగల్, మల్లంపేట ఇ మద్య నే మునిసిపాలిటీ నండి ప్రభుత్వం G H M C లో విలీనం చేసిన విషయం...
By Ponnala Srinivasrao 2026-03-04 03:55:38 0 492
Andhra Pradesh
ఏపీకి మరో భారీ పెట్టుబడి.. ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా కాంప్లెక్స్.. ఆ ప్రాంతానికి మహర్దశ..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో డేటా సెంటర్ ఏర్పాటు కానుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన...
By Pagadala Venkateswar 2026-01-17 10:44:44 0 214
Andhra Pradesh
పంట నష్టం వివాదం – దంపతులపై కర్రలతో దాడి.
గురువారం, రామసముద్రం మండలంలోని నారిగానిపల్లి పంచాయతీ దిగువలంబంవారిపల్లెలో పంట నష్టం వివాదం తీవ్ర...
By Pagadala Venkateswar 2026-04-02 10:21:27 0 206
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com