ఆర్టీసీ బస్టాండ్ లో ఘోర ప్రమాదం: డ్రైవర్ నిర్లక్ష్యనికి 14నెలల పసికందు బలి

0
545

🎤కుమురంభీమ్ ఆసిఫాబాద్: భారత్ అవాజ్ న్యూస్ జిల్లా కేంద్రంలో గల ఆర్టీసీ బస్టాండ్ లో నిన్న మే 13న జరిగిన ఒక ఘోర ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్ యొక్క అజాగ్రత్త నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా 14 నెలల పసికందు తరుణ్ ప్రాణాలు కోల్పోయడు.చింతలమనేపల్లి మండలం కొండపల్లి గ్రామానికి చెందిన భీంరావు గీత దంపతుల కుమారుడు తన నాయనమ్మ మనవడు తరుణ్ ని ఎత్తుకొని కాగజ్ నగర్ బస్సు ఎక్కడానికి వచ్చింది బస్ ఎక్కుతు ఉండగా మరోబస్సు రివర్స్ తీసుకునేక్రమంలో వారిని బస్సు ఢీ కిట్టింది రెండు బస్సుల మధ్య ఇరుక్కుని బాలుడు తరుణ్ కు తీవ్ర గాయాలయ్యాయి తరుణ్ ను హాస్పిటల్ తీసుకెళ్తుండగా మార్గామధ్యలోనే మృతి చెందాడు బస్సు ఢీ కొట్టడంతో తనచేతిలో ఉన్న మనవడు కింద పడి ప్రాణాలు కోల్పోయాడని మహిళా కన్నీటి పర్యంతం అయ్యింది ఈ ఘోర ప్రమాదానికి నిరసనగా బాధిత కుటుంబానికి తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కుటుంబ సభ్యులు బంధువులు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఆసిఫాబాద్ డిపో ఎదుట బాలుడి శవంతో భారీ రాస్తారోకో నిర్వహించారు.ప్రమాదనికి కారణమైన డ్రైవర్ పై కఠినచర్యలు తీసుకోవాలని భాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని ఈ సందర్బంగా ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేసారు.ఆందోళన తీవ్రం కావడంతో ఆర్టీసీ అధికారులు.తక్షణమే స్పందించి బాధిత కుటుంబనికి అత్యవసర ఖర్చుల నిమిత్తం రూ.25000.తక్షణ ఆర్థిక సాయంగా అందచేశారు.ప్రమాదానికి కారణమైన డ్రైవర్ పై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో నిరసన కారులు రాస్తారోకో విరమించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
విజయవాడ నందిగామ లో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యాయత్నం
_*ఎన్టీఆర్ జిల్లా/నందిగామ*_   _*ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం.....*_  ...
By Rajini Kumari 2026-04-15 13:16:00 0 218
Telangana
అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మంచిర్యాల్ ఎమ్మెల్యే గలమెత్తిన.
సభలో నియోజకవర్గ సమస్యలును ప్రస్తావించాలని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్  రావు గారిని మంచిర్యాల్...
By Bonagiri RaviShankar 2026-09-07 05:19:59 0 175
Andhra Pradesh
ఇంద్రకీలాద్రిపై చిన్నారులకు పోలియో చుక్కలు
ప్రెస్ నోట్ విజయవాడ (ఇంద్రకీలాద్రి): ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి...
By Rajini Kumari 2025-12-22 08:20:13 0 288
BMA
Eco-Acoustics: Soundscapes Exposing Illegal Logging
Environmental journalists are deploying autonomous acoustic sensors deep within protected forests...
By JoinBMA 2026-08-21 18:20:53 0 326
Andhra Pradesh
రామసముద్రంలో వైసీపీ గ్రామ అధ్యక్షుల నియామకం.
రామసముద్రం మండలం పెద్ద కురపల్లి, కురిజాల పంచాయతీల్లో రచ్చబండ కార్యక్రమం నిర్వహించి, వైసీపీ గ్రామ...
By Pagadala Venkateswar 2026-01-28 10:15:31 0 177
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com