కవితా నీ నీచ రాజకీయాలు మానుకో..! రాజకీయ డ్రామాలు ఆపాలని హెచ్చరిక

0
98

కవితా నీ నీచ రాజకీయాలు మానుకో..!* 

‎తెలంగాణ రాష్ట్ర సహకార యూనియన్ మాజీ చైర్మన్ రాజా వరప్రసాద్* 

‎*టిఆర్ఎస్ అధినేత్రి కవితపై నిప్పులు చెరిగిన "రాజా వరప్రసాద్"* 

‎*రాజకీయ డ్రామాలు ఆపాలని హెచ్చరిక* 

‎*ఫామ్ హౌస్ కు తీసుకెళ్లి మత్తుమందు ఇచ్చి లైంగిక దాడి చేశాడంటే మధ్యలో నీ సన్నాయి నొక్కులు ఎందుకు..?* 

‎*సంఘటన వెలుగు చూసిన ఐదు రోజుల తర్వాత బయటకు వచ్చి బిఆర్ఎస్ పై విమర్శలు చేయడం ఒక కుట్ర* 

‎మైనర్ బాలికను ఫామ్ హౌస్ కు తీసుకెళ్లి కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ తీవ్రమైన లైంగిక దాడి చేశాడని సాక్షాత్తు బాధితురాలు ఆమె తల్లి ఆరోపిస్తుంటే.. సంఘటన వెలుగు చూసిన ఐదు రోజుల తర్వాత బయటికి వచ్చి కొత్తగా రాజకీయ డ్రామాలు చేస్తూ, మైనర్ బాలిక కుటుంబానికి అండగా నిలిచిన బిఆర్ఎస్ పార్టీనే కుట్రబుద్ధితో టార్గెట్ చేసి విమర్శలు చేయడం నీ నీచమైన రాజకీయానికి నిదర్శనమని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ బిఆర్ఎస్ సీనియర్ నేత, తెలంగాణ మాజీ కార్పొరేషన్ చైర్మన్ రాజా వరప్రసాద్ నిప్పులు చెరిగారు. బుధవారం విడుదల చేసిన మీడియా ప్రకటనలో టిఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవితను ఉద్దేశించి...

‎టిఆర్ఎస్ పార్టీ పేరుతో రాజకీయాల్లోకి కొత్తగా అడుగుపెట్టి తన రాజకీయ స్వార్థం కోసం న్యాయంగా పోరాడుతున్న బిఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేయడం అత్యంత నీచమైన చర్యగా ఆయన అభివర్ణించారు. 

‎కవిత మాట్లాడుతున్న మాటలను బట్టి చూస్తే బిఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేయాలనే ఉద్దేశంతో విమర్శలు గుప్పిస్తున్నారని దీనివల్ల ఆమె ఎవరికి కొమ్ము కాస్తుంధో అర్థమయిపోతుందని విమర్శించారు. 

‎తెలంగాణకు అమ్మలా అక్కలా ఉంటానని చెప్పిన కవిత ఇప్పుడు మైనర్ బాలికకు అన్యాయం జరిగిందంటే దానిపై మైనరో కాదు మేజరో అంటూ సన్నాయి నొక్కులు నొక్కడం సరికాదన్నారు. అమ్మాయి మైనర్ కాకపోతే మేజర్ అయితే ఆమెకు అన్యాయం జరగాలని కవిత కోరుకుంటున్నారా ప్రశ్నించారు. 

‎మహిళ అయితే ఫామ్ హౌస్ లోకి తీసుకెళ్లి మత్తు పదార్థాలు తాగించి లైంగిక వేధింపులకు గురి చేయవచ్చా..? కవిత ఇదే కోరుకుంటున్నారా..? అని పత్రికా ముఖంగా నిలదీశారు. కవిత నీచ రాజకీయాలు ఎవరికి ఉపయోగం లేవని పేర్కొన్నారు. ఒక మహిళ అయి ఉండి ఈ మాటలు మాట్లాడడానికి కొంచమైనా సిగ్గుపడాల్సిన అవసరం ఉందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ పుత్రుడు అయితే బారాహుల్ మాఫీ ఉంటుందా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రికి చట్టాలు వర్తించవా అదే ఎవడో సామాన్యుడు ఈ దుర్మార్గం చేసి ఉంటే ఇలాగే కవిత సన్నాయి నొక్కులు నొక్కేవారా అని నిలదీశారు.

‎ఒక అమ్మాయి తనకు ఫామ్ హౌస్ లోనికి తీసుకెళ్లి మత్తుమందు ఇచ్చి లైంగిక దాడి చేశాడని స్వయంగా బాధితురాలు చెబుతుంటే అదే విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేస్తే తాపీగా ఐదు రోజుల తర్వాత బయటకు వచ్చి దేశం మహిళలు అందరూ ఆ బండి భగీరథ ను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తుంటే ఇప్పుడు కవిత మాట్లాడే మాటలు చూస్తుంటే ఆమె అసలు రంగు తెలంగాణ ప్రజలకు అర్థం అవుతుందని తెలిపారు.

‎ కాంగ్రెస్ బిజెపి కలిసి కవితను బిఆర్ఎస్ పైన ఆరోపణలు చేయడానికి నిన్ను బయటికి తెచ్చి ఓ పార్టీ పెట్టించి విమర్శలు చేయిస్తున్నారని, నువ్వు ఒక అమ్ముడుపోయిన రాజకీయవేత్తవు, ఇక నీ డ్రామాలు తెలంగాణ ప్రజలు స్పష్టంగా తెలుసుకున్నారని రాజా వరప్రసాద్ విమర్శలు గుప్పించారు. 

‎ఇక టిఆర్ఎస్ మూసుకొని రేపిస్టుల బిజెపి పార్టీలో చెరిపోవాలి అంటూ రాజా వరప్రసాద్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బిజెపి తీహార్ జైల్లో కవితకు చిప్పకూడు తినిపించిన ఇంకా బుద్ధి రాలేదంటూ రాజా వరప్రసాద్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మైనర్ బాలిక విషయంలో అండగా నిలబడాల్సిన కవిత ఆత్మవంచన చేసుకొని అన్యాయం చేయాలని చూడడం కన్నా వారణాసి వెళ్లి మోడీ జపం చేస్తూ గంగలో దూకాలని రాజా వరప్రసాద్ సలహా ఇచ్చారు.. 

Search
Categories
Read More
Telangana
అల్వాల్ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయండి : మల్కాజిగిరి ఎమ్మెల్యే
మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి  కూకట్పల్లి జోనల్ కమిషనర్ అపూర్వ చౌహాన్ ని...
By Sidhu Maroju 2025-06-10 10:34:52 0 1K
Andhra Pradesh
డిజిటల్ అరెస్ట్ పేరుతో భారీ సైబర్ మోసం*
విశాఖకు చెందిన ముగ్గురు సైబర్ నేరస్థుల అరెస్ట్.. రూ.10 లక్షల నగదు స్వాధీనం బాపట్ల జిల్లా చీరాల...
By Vadlamudi NagaVenkat 2026-05-22 11:11:27 0 231
Andhra Pradesh
పుంగనూరు: విశేష అలంకరణలో దర్శనమిచ్చిన మారెమ్మ
పుంగనూరు పట్టణ ప్రజల ఆరాధ్య దైవం మారెమ్మ శుక్రవారం సందర్భంగా విశేష అలంకరణలో భక్తులకు...
By Kothuru Murali 2026-05-30 13:58:37 0 87
Himachal Pradesh
Himachal Pradesh Strengthens Apple Economy Reforms
Himachal Pradesh continues to focus on strengthening its apple-based economy through targeted...
By Fathima Safa 2026-06-29 12:30:26 0 53
Andhra Pradesh
పుంగునూరు: చోరీ కేసులో ముగ్గురి అరెస్ట్ కొత్తూరు మురళి
రూరల్ సిఐ సాయి ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం, జనవరి 2న సోమల మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయం వద్ద...
By Kothuru Murali 2026-04-25 03:06:55 0 103
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com