ఏపీలో భిన్న వాతావరణం.. కొన్ని జిల్లాల్లో వర్షాలు, మరికొన్నిచోట్ల వడగాల్పులు.

0
131

నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం

బుధవారం పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్ష సూచన

అల్లూరి, పోలవరం జిల్లాల్లోని కొన్ని మండలాల్లో వడగాల్పులు

కొన్ని ప్రాంతాల్లో వర్షాలు, మరికొన్ని చోట్ల ఎండ ప్రభావం

వాతావరణ వివరాలు వెల్లడించిన ఏపీ విపత్తుల నిర్వాహణ సంస్థ

ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్‌డీఎంఏ) ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని వెల్లడించారు.

 

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, దాని అనుబంధ ద్రోణి కారణంగా అల్లూరి సీతారామరాజు, పోలవరం, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని ఏపీఎస్‌డీఎంఏ తెలిపింది.

 

ఇదే సమయంలో, కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన ఎండలు, వడగాల్పులు కొనసాగుతాయని హెచ్చరించింది. ముఖ్యంగా అల్లూరి జిల్లాలోని జీకే వీధి, ముంచింగిపుట్టు, పెదబయలు మండలాలతో పాటు, పోలవరం జిల్లాలోని చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం, గుర్తేడు మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉంటుందని తెలిపింది. మంగళవారం కర్నూలు జిల్లా నాగరడోనలో అత్యధికంగా 42.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

 

వర్షాల సమయంలో రైతులు, పశువుల కాపరులు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని, చెట్ల కింద ఆశ్రయం పొందవద్దని అధికారులు సూచించారు. కాగా, ఈ అల్పపీడనం రానున్న బుధవారం సాయంత్రానికి మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

Search
Categories
Read More
Andhra Pradesh
TTD SV విద్యా ధ్యాన ట్రస్ట్ కు 1 కోటి విరాళం
టీటీడీ ఎస్వీ విద్యాదాన ట్రస్ట్ కు రూ 1 కోటి విరాళం   క్యాంప్ కార్యాలయంలో చైర్మన్ బిఆర్...
By Rajini Kumari 2025-12-31 10:25:04 0 255
Andhra Pradesh
Andhra Pradesh: ఏపీలో ఈవీ విప్లవం.. తొలిదశలో 135 ఈవీ ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటు.
  Andhra Pradesh: ఏపీలో ఈవీ విప్లవం.. తొలిదశలో 135 ఈవీ ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటు...
By Pagadala Venkateswar 2026-03-10 08:53:16 0 194
Telangana
"డ్రైనేజీ సమస్యలపై మాజీ కార్పొరేటర్ ఫోకస్.|"
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : ఓల్డ్ ఆల్వాల్ పరిధిలోని అయ్యంగారి బస్తీలో నెలకొన్న డ్రైనేజీ సమస్యలను...
By Sidhu Maroju 2026-03-31 10:57:54 0 201
Andhra Pradesh
వృద్ధి రేటు పెంపుపై సీఎం చంద్రబాబు ఫోకస్.. పనితీరు ఆధారంగా శాఖలకు స్కోరింగ్.
  వృద్ధి రేటు పెంపుపై సీఎం చంద్రబాబు ఫోకస్.. పనితీరు ఆధారంగా శాఖలకు స్కోరింగ్  ...
By Pagadala Venkateswar 2026-06-10 06:06:25 0 103
Andhra Pradesh
నిమ్మనపల్లిలో ట్రాక్టర్‌పై నుంచి పడి మహిళకు తీవ్ర గాయాలు.
నిమ్మనపల్లి మండలంలో శుక్రవారం ఉదయం ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌పై నుంచి పడిపోయి ఓ మహిళ తీవ్రంగా...
By Pagadala Venkateswar 2026-05-22 12:38:39 0 215
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com