Andhra Pradesh: ఏపీలో ఈవీ విప్లవం.. తొలిదశలో 135 ఈవీ ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటు.

0
191

 

Andhra Pradesh: ఏపీలో ఈవీ విప్లవం.. తొలిదశలో 135 ఈవీ ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటు

10-03-2026 Tue 12:45 | Andhra

Andhra Pradesh to Establish 135 EV Charging Stations Under PM e Drive

వాటిలో 600 ఛార్జింగ్ పాయింట్ల ఏర్పాటు

జులై నాటికే అందుబాటులోకి తీసుకురానున్న ప్రభుత్వం

 

ఒక్కో కేంద్రం ఏర్పాటుకు రూ.50 లక్షల ఖర్చు

ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వాడకాన్ని ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసింది. కేంద్ర ప్రభుత్వ 'పీఎం ఈ-డ్రైవ్' పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా భారీగా ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను విస్తరించనుంది. తొలి దశలో 135 ఈవీ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ కేంద్రాల్లో 600 ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయనుంది. దీంతో జాతీయ రహదారుల వెంబడి ప్రయాణించే ఈవీ వాహనదారులకు ఇకపై ఛార్జింగ్ కష్టాలు తీరనున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో 444 ఈవీ కేంద్రాలను ఏర్పాటు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను పరిశీలించిన కేంద్ర బృందం.. తొలి విడతలో 135 ప్రాంతాల్లో ఈవీ కేంద్రాల ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది. ప్రభుత్వ కార్యాలయాలు, మున్సిపల్ కార్పొరేషన్లు, జెన్కో మరియు డిస్కంల ఖాళీ స్థలాల్లో వీటిని నిర్మిస్తారు. కార్లు, ద్విచక్ర వాహనాలు, ఆటోలతో పాటు భారీ వాహనాలకు కూడా ఇక్కడ ఛార్జింగ్ సదుపాయం ఉంటుంది.

 

ఏప్రిల్‌లో టెండర్లు.. ఆగస్టుకల్లా పూర్తి!

ఏప్రిల్‌లో టెండర్ల ప్రక్రియను ప్రారంభించి జులై లేదా ఆగస్టు నాటికే ఈ కేంద్రాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని నెడ్‌క్యాప్ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒక్కో కేంద్రానికి సుమారు రూ.50 లక్షలు ఖర్చవుతుందని అంచనా. ఇందులో 80% కేంద్రం భరిస్తుండగా, మిగిలిన 20% వాటాను డిస్కంలు సమకూరుస్తాయి. ఐదేళ్ల పాటు ఆపరేటర్లు వీటిని నిర్వహిస్తారు. దీని ద్వారా వచ్చే ఆదాయం ప్రధానంగా డిస్కంలకే చెందుతుంది.

 

రెండో దశలో నగరాలపై ఫోకస్

ఏటా రాష్ట్రంలో 6 వేల ఈవీ కార్లు, 40 వేల టూవీలర్లు కొత్తగా రోడ్డెక్కుతున్నాయి. ఈ జోరును గమనించిన అధికారులు, భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా ‘ఛార్జింగ్ నెట్‌వర్క్’ను సిద్ధం చేస్తున్నారు. హైవేల తర్వాత, నగరాల్లో ఛార్జింగ్ సదుపాయాలను పెంచడంపై దృష్టి సారించారు. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కాకినాడ, ఏలూరు నగరాల్లో రెండో దశలో మరో 100 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.

Search
Categories
Read More
Lakshdweep
Lakshadweep Promotes Eco-Tourism and Green Conservation
Lakshadweep continues to advance eco-tourism and environmental conservation in 2026 by promoting...
By Fathima Safa 2026-07-04 13:17:30 0 120
SURAKSHA
P. Amudha, IAS: Driving Transparent and People-Centric Governance
An accomplished IAS officer whose commitment to transparent governance, administrative reforms,...
By Lokeshwari Panthadi 2026-07-20 07:57:28 0 186
Telangana
Fire Accident at Kphb!!!!
Fire accident helf at kphb yesterday night. Its a private travels bus ( Hyderabad to palakollu)...
By Terli Ashok 2026-04-18 07:55:59 0 612
Andhra Pradesh
జిల్లాలో రేషన్ బియ్యం మాఫియా. డీఎస్ఓ ను వెంటనే సస్పెండ్ చేయాలి - బీఎస్పీ డాక్టర్ గుదే రాజారావు డిమాండ్.
బాపట్ల బాపట్ల జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోందని, దీనికి...
By Vadlamudi NagaVenkat 2026-04-10 09:59:39 0 178
Telangana
"ఎక్స్‌ట్రీమిజంపై గట్టి దెబ్బ.. 42 మంది మావోయిస్టుల లొంగుబాటు !
హైదరాబాద్ : తెలంగాణలో మావోయిస్టు కార్యకలాపాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నిషేధిత సంస్థ CPI...
By Sidhu Maroju 2026-04-10 12:33:03 0 428
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com