ఏపీ హైకోర్టు సీజేకు జడ్ ప్లస్ భద్రత.. గ్రీన్ ఛానల్ ఏర్పాటుకు ఆదేశాలు.

0
151

ఏపీ హైకోర్టు సీజేకు జడ్ ప్లస్ భద్రత.. గ్రీన్ ఛానల్ ఏర్పాటుకు ఆదేశాలు

13-05-2026 Wed 08:36 | Andhra

Justice Lisa Gill Gets Z Plus Security in Andhra Pradesh

సెక్యూరిటీ రివ్యూ కమిటీ సిఫార్సుల మేరకు ప్రభుత్వ నిర్ణయం

సీజే కాన్వాయ్‌కు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు

విజయవాడ, గుంటూరు పోలీసులకు డీజీపీ నుంచి కీలక సూచనలు

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా గిల్‌కు రాష్ట్ర ప్రభుత్వం భద్రతను పెంచింది. ఆమెకు 'జడ్ ప్లస్' కేటగిరీ భద్రత కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. జస్టిస్ లీసా గిల్‌కు ముప్పు పొంచి ఉందన్న అంచనాలు, సెక్యూరిటీ రివ్యూ కమిటీ సిఫార్సుల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

 

ఈ మేరకు తక్షణమే చర్యలు చేపట్టాలని రాష్ట్ర డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాను ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఆయన విజయవాడ, గుంటూరు పోలీసు కమిషనరేట్ల అధికారులకు తగిన సూచనలు జారీ చేశారు. రోజూ విజయవాడలోని తన నివాసం నుంచి అమరావతిలోని హైకోర్టుకు ప్రయాణించే మార్గంలో జస్టిస్ లీసా గిల్ కాన్వాయ్‌కు 'గ్రీన్ ఛానల్' ఏర్పాటు చేయాలని డీజీపీ ఆదేశించారు. దీనివల్ల ఆమె ప్రయాణ సమయంలో కాన్వాయ్‌ ఎక్కడా ఆగకుండా నేరుగా గమ్యస్థానానికి చేరుకుంటుంది.

 

జస్టిస్ లీసా గిల్ 2026 ఏప్రిల్ 25న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఏపీ హైకోర్టుకు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా ఆమె రికార్డు సృష్టించారు.

Search
Categories
Read More
Telangana
లింగాపూర్, సిర్పూర్ (యు) పోలీస్ స్టేషన్లలో ఎస్పీ నితికా పంత్ ఆకస్మిక తనిఖీ. అక్రమ కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని ఆదేశం
ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పరిధిలోని లింగాపూర్ మరియు సిర్పూర్...
By Chunarkar Jagadeesh 2026-07-22 15:47:37 0 250
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం: గజ వాహనంపై దర్శనం ఇచ్చిన మృత్యుంజయేశ్వర స్వామి
అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లె మండల కేంద్రంలోని శ్రీ అభీష్టద మృత్యుంజయేశ్వర...
By Kothuru Murali 2026-04-28 06:35:00 0 154
Tamilnadu
కొడైకెనాల్‌లో తెలంగాణ వ్యాపారవేత్త దారుణ హత్య.. గెస్ట్‌హౌజ్‌లో కుర్చీకి కట్టేసి ఊపిరాడకుండా చేసి..!
కొడైకెనాల్‌‌లో ఓ గెస్ట్ హౌజ్‌లో తెలంగాణకు చెందిన ఓ వ్యాపారవేత్త దారుణ హత్యకు...
By Bharat Aawaz 2026-02-23 07:48:34 0 527
Andhra Pradesh
Jogi Ramesh: జోగి రమేశ్ పై నాన్ బెయిలబుల్ కేసు నమోదు.
బెయిల్ పై ఉన్న జోగి రమేశ్ కు మరో షాక్ జగన్ పర్యటన సందర్భంగా న్యూసెన్స్ క్రియేట్ చేశారంటూ కేసు...
By Pagadala Venkateswar 2026-02-07 07:23:06 0 204
Telangana
యూసుఫ్ నగర్ స్మశానవాటిక అభివృద్ధి, ఉర్దూ మెడికల్ స్కూల్ ఏర్పాటుపై మంత్రిని కలిసిన ఎమ్మెల్యే మాధవరం
హైదరాబాద్, జూన్ 19: భారత్ ఆవాజ్ ప్రతినిధి,  అల్లాపూర్ డివిజన్ పరిధిలోని యూసుఫ్ నగర్ ముస్లిం...
By Jagadeesh Babu 2026-06-19 15:14:34 0 273
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com