కొడైకెనాల్‌లో తెలంగాణ వ్యాపారవేత్త దారుణ హత్య.. గెస్ట్‌హౌజ్‌లో కుర్చీకి కట్టేసి ఊపిరాడకుండా చేసి..!

0
526

కొడైకెనాల్‌‌లో ఓ గెస్ట్ హౌజ్‌లో తెలంగాణకు చెందిన ఓ వ్యాపారవేత్త దారుణ హత్యకు గురయ్యారు. ఒకప్పటి వెండితెర నటి, సోషల్ మీడియా స్టార్ విష్ణుప్రియ తండ్రి, తెలంగాణ వ్యాపారవేత్త సూర్యనారాయణ హత్యోదంతం ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఇది కేవలం దోపిడీ కోసం జరిగిన దాడి కాదని.. ఒక వివాహేతర సంబంధం, ఆపై జరిగిన హత్య, దానికి బదులుగా జరిగిన ప్రతీకార హత్య అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.

పర్యాటక కేంద్రమైన తమిళనాడులోని కొడైకెనాల్‌లో ఒక భయంకరమైన హత్యోదంతం వెలుగుచూసింది. తెలంగాణకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, సినీ నటి విష్ణుప్రియ తండ్రి అయిన సూర్యనారాయణ (73) తన సొంత బంగళాలోనే అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించారు. ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన స్థానికంగా పెను కలకలం సృష్టించింది. ఇది సాధారణ హత్య కాదని.. పక్కా ప్లాన్‌తో జరిగిన ప్రతీకార దాడి అని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

కుర్చీకి కట్టేసి.. నోటికి టేపులు వేసి..

పోలీసుల కథనం ప్రకారం.. కొడైకెనాల్‌లోని కురింజి ఆండవర్ టెంపుల్ రోడ్డులో సూర్యనారాయణకు ఒక విలాసవంతమైన బంగళా ఉంది. ఆదివారం తెల్లవారుజామున పలువురు దుండగులు.. దొంగతనంగా ఇంట్లోకి చొరబడ్డారు. లోపలికి వెళ్లగానే అక్కడ పని చేస్తున్న ఇద్దరు కార్మికులను, యజమాని సూర్యనారాయణను బలవంతంగా మూడు కుర్చీల్లో కూర్చోబెట్టి తాళ్లతో కట్టేశారు.

అనంతరం సూర్యనారాయణ అరవకుండా ఉండేందుకు హెవీ డ్యూటీ ప్యాకింగ్ టేపులతో ముఖం, నోటిని గట్టిగా చుట్టేశారు. ఈక్రమంలోనే ఆయన ఊపిరాడక స్పృహ తప్పి పడిపోయాడు. ఆపై దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. సూర్యనారాయణ వద్ద పనిచేసే అసిస్టెంట్ ఒకరు ఎలాగోలా తాళ్లను విప్పుకుని.. ఇరుగుపొరుగు వారికి సమాచారం అందించారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించినప్పటికీ.. అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.

Search
Categories
Read More
Jharkhand
Jharkhand Promotes Tourism and Eco-Travel in 2026
Jharkhand has continued to promote tourism in 2026 by enhancing infrastructure at key...
By Fathima Safa 2026-07-01 10:04:19 0 96
Chandigarh
Special Revision of Electoral Rolls Commences Across Manipur
The Election Commission of India officially launched Phase III of the Special Intensive Revision...
By Dunna Jessicaruth 2026-05-20 09:38:51 0 266
Andhra Pradesh
జనసేన పార్టీ పదవుల కోసం ప్రొఫైల్ సేకరణ ప్రారంభం.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు, జనసేన పార్టీలో పదవుల కోసం వీర సైనికులు,...
By Pagadala Venkateswar 2026-06-29 08:00:42 0 116
Andhra Pradesh
రామకోటయ్య ఇండోర్ స్టేడియాన్ని సందర్శించిన సాఫ్ట్ చైర్మన్ అని మినీ రవి నాయుడు
*ఫర్ స్క్రోలింగ్**   *శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు**   • చెన్నుపాటి...
By Rajini Kumari 2025-12-16 09:34:03 0 214
SURAKSHA
S. Suresh Kumar IAS: Advancing Education Through Governance
A distinguished Andhra Pradesh cadre IAS officer whose leadership in school education, digital...
By Lokeshwari Panthadi 2026-07-16 09:23:49 0 176
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com